Jump to content

దింపుడు కల్లం

వికీపీడియా నుండి

దింపుడు కల్లం అనేది మానవుని మరణ సమయంలో నిర్వహించే ఒక హిందూ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారం శవయాత్ర జరుగుతున్నపుడు చనిపోయిన వారి మీద మమకారముతో కొంతమంది శవాన్ని ఒక ప్రదేశంలో పాడెమీద నుంచి కిందకు దింపి శవం చెవిలో మూడుసార్లు వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారు. తరువాత మళ్ళీ శ్మశానం వైపు తీసుకెళతారు. అలా దింపే స్థలాన్ని దింపుడు కల్లం అంటారు.

ఇంటి నుంచి దింపుడు కల్లం వరకు ఒక యాత్రగా, దాని తరువాత చితివరకూ ఒక యాత్రగా భావిస్తారు. దింపుడు కల్లం దగ్గర శవంమీదనున్న గుడ్డ తొలగించి అందరూ ఒకసారి చూస్తారు. చనిపోయిన వ్యక్తి మీద మమకారంతో వచ్చేవాళ్ళుమొదటి భాగంతో వెనుదిరిగి వెళ్ళిపోతారు. తరువాత వచ్చేవాళ్ళు శవాన్ని శివంగా భావించి ఎవరూ రోదించరు. తరువాత శవాన్ని దహనం (కాల్చడం) కానీ, ఖననం (పూడ్చిపెట్టడం) కానీ చేస్తారు.

మూలాలు

[మార్చు]
  • హిందూ సాంప్రదాయాలు - గాజుల సత్యనారాయణ. పుట-65