దివాకర్ పుండిర్
Jump to navigation
Jump to search
దివాకర్ పుండిర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1998 - ప్రస్తుతం |
దివాకర్ పుండిర్ (జననం 11 నవంబరు 1975) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నటుడు, మోడల్. బాలీవుడ్ సినిమాలలో నటించాడు. 1998లో గ్రావియరా మిస్టర్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.[1] జర్మనీలో జరిగిన మిస్టర్ ఇంటర్‌కాంటినెంటల్ కాంటెస్ట్‌లో రెండో రన్నరప్‌గా నిలిచాడు.[2]
జననం
[మార్చు]దివాకర్ 1975, నవంబరు 11న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. దివాకర్ తండ్రి ఆర్మీ అధికారి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న దివాకర్, సినిమాల్లోకి రావడానికి ముందు పైలట్ గా పనిచేశాడు.
మోడలింగ్ రంగం
[మార్చు]లైఫ్‌బాయ్ సబ్బు, వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్‌లు, హ్యుందాయ్ వెర్నా, హోండా యాక్టివా, స్కోడా ర్యాపిడ్, పార్లే బేక్స్‌మిత్ వంటి బ్రాండ్‌లకు చెందిన అనేక టివీ వాణిజ్య ప్రకటనలలో మోడల్‌గా ఉన్నాడు.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2003 | ప్యార్ కియా నహిం జాతా | ||
2004 | బాలీవుడ్ కింగ్ | రాహుల్ | |
2005 | పెహచాన్: ది ఫేస్ ఆఫ్ ట్రూత్ | ప్రసాద్ సక్సేనా | |
2006 | డాన్ | రమేష్ | |
2014 | వన్ బై టూ | రంజన్ సదనః | |
2019 | 99 పాటలు | జై తండ్రి | అతిథి పాత్ర |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
2003 | క్రైమ్ పెట్రోల్ (సీజన్ 1) | హోస్ట్ | సోనీ టీవీ |
2004 | కహానీ ఘర్ ఘర్ కీ | సంభవ్ ఖన్నా | స్టార్ ప్లస్ |
2005-2006 | రెత్ | క్షోం | జీ టీవీ |
2006 | సిందూర్ తేరే నామ్ కా | ఆయుష్మాన్ మల్హోత్రా | జీ టీవీ |
2006-2008 | రావణ్ | రాముడు | జీ టీవీ |
2007-2008 | పరివార్ | శౌర్య షెర్గిల్ | జీ టీవీ |
2007-2009 | సంతాన్ | పరీక్షిత్ | స్టార్ ప్లస్ |
2009 | ష్.. ఫిర్ కోయి హై - నిషాన్ | వరిష్ట్ సన్యాల్ (ఎపిసోడ్ 194 & ఎపిసోడ్ 195) | స్టార్ వన్ |
2009-2010 | జానే పెహచానే సే..యే అజ్ఞాతవాసి | జై వర్ధన్ సింగ్ | స్టార్ వన్ |
2010-2012 | మర్యాద: లేకిన్ కబ్ తక్? | స్టార్ ప్లస్ | |
2012-2015 | సప్నే సుహానే లడక్పాన్ కే | ఆకాష్ కుమార్ | జీ టీవీ |
2016 | దర్ సబ్కో లగ్తా హై - ద్వార్ | డా. అజయ్ (ఎపిసోడ్ 26) | & టీవీ |
2016-2018 | కర్మఫల్ దాత శని | విష్ణు[3] | కలర్స్ టీవీ |
2017-2020 | పరమావతార్ శ్రీ కృష్ణ | శివుడు | & టీవీ |
మూలాలు
[మార్చు]- ↑ "Diwakar Pundir, who has joined the cast of Reth on Zee". The Indian Express. 23 May 2005. Retrieved 2022-02-20.
- ↑ "Graviera Mr. India Diwaker Pundir placed second runner-up at Mr Intercontinental Contest".
- ↑ Scroll Staff (7 November 2016). "Here is what the new Colors TV show 'Karmaphal Data Shani' looks like". Scroll.in. Retrieved 2022-02-20.