దివ్య దర్శిని(నటి)
దివ్యదర్శిని తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రముఖ భారతీయ టీవీ వ్యాఖ్యాత, నటి.[1] మొట్టమొదట ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. టివిల్లో నటించే ముందు కమల్ హాసన్ నిర్మించిన దమయంతి(2003) సినిమాలో మొదటి సారి సహాయ నటిగా నటించింది దివ్యదర్శిని. రాడాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన సెల్వి, అరసి సీరియళ్ళలో ఆమె నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. 2007 నుంచి విజయ్ టివిలో చాలా షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 2014నుంచి ఆమె స్వంత షో కాఫీ విత్ డిడి ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తోంది.
కెరీర్[మార్చు]
దివ్యదర్శిని 17 ఫిబ్రవరి 1985న జన్మించింది. ఆమె 18వ ఏట 1995లో టివి వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించింది. విజయ్ టివి నిర్వహించిన ఉంగల్ తీర్పు షోలో చైల్డ్ యాంకర్ గా ఎంపికైంది. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన, రాజ్ టివిలో ప్రసారమైన రెక్కై కట్టియ మనసు సీరియల్ లో ఆమె నటించిన పాత్రకు ప్రశంసలు అందుకొంది. ఈ పాత్రతో ఆమెకు వరసుగా అవకాశాలు వచ్చాయి.[2]