దివ్య ప్రభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివ్య ప్రభ
జననం (1991-05-18) 1991 మే 18 (వయసు 32)
జాతీయతబారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
పురస్కారాలుకేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డు

దివ్య ప్రభ (జననం 1991 మే 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ భాషా చిత్రాలలో నటిస్తుంది. ఆమె టేక్ ఆఫ్ (2017) [1], థమాషా (2019) [2] చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధిచెందింది. 2015లో, ఈశ్వరన్ సాక్షియై అనే టీవీ సీరియల్‌లో తన నటనకు గాను ఆమె ఉత్తమ రెండవ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డును గెలుచుకుంది.[3] 2022లో, కార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన అరిప్పు చిత్రానికి అంతర్జాతీయ పోటీ విభాగంలో ఆమె ఉత్తమ నటిగా ఎంపికైంది.[4]

కెరీర్[మార్చు]

ఆమె 2013 చిత్రం లోక్‌పాల్‌ చిత్రంతో ఎండితెరపైకి అడుగుపెట్టింది.[5][6] ఆమె మొదటి తమిళ చిత్రం ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన కయల్ (2014). రాజేష్ పిళ్లై దర్శకత్వం వహించిన వేట్టా (2016) చిత్రంలో ఆమె క్యారెక్టర్ రోల్ పోషించింది. టేకాఫ్‌ (2017) లో ఆమె నర్సుగా నటించింది.[7] 2018లో, ఆమె పీరియడ్ ఫిల్మ్ కమ్మర సంభవం, స్పోర్ట్స్ థ్రిల్లర్ నాన్సెన్స్‌లో సహాయ పాత్రలు పోషించింది. 2019లో, రోషన్ మాథ్యూ దర్శకత్వం వహించిన ఎ వెరీ నార్మల్ ఫ్యామిలీ అనే థియేటర్ ప్లేలో ఆమె నటించింది.[8] ఆ తర్వాత థమాషా సినిమాలో నటించింది.[2]

మూలాలు[మార్చు]

  1. Nair, Vidya (27 April 2017). "The Best 'Take Off'". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 8 July 2021.
  2. 2.0 2.1 Mythily Ramachandran (26 June 2019). "'Thamaasha' stars on bringing unlikely heroes into the spotlight". Gulf News. Retrieved 29 June 2019.
  3. "'Eswaran Sakshiyayi' wins five State Awards". The Times of India. 2016-06-11. ISSN 0971-8257. Retrieved 2023-07-20.
  4. "Kunchacko Boban, Mahesh Narayanan on Locarno Competition Title 'Ariyippu' (EXCLUSIVE)". 3 August 2022.
  5. Sandy (18 October 2019). "Divya Prabha – Malayalam film and television actress". My Words & Thoughts (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 July 2021.
  6. Sajin Shrijith (11 June 2019). "Rehearsals are so comforting: 'Thamaasha' actor Divyaprabha". The New Indian Express. Retrieved 29 June 2019.
  7. Nair, Vidya (27 April 2017). "The Best 'Take Off'". Deccan Chronicle. Retrieved 10 June 2017.
  8. Cris (4 February 2019). "'A Very Normal Family' at Mathrubhumi Lit Fest: Meet the fun cast and crew". The News Minute. Retrieved 29 June 2019.