ది కైట్ రన్నర్ నవల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ది కైట్ రన్నర్" ఇంగ్లీషు నవలా రచయిత ఖలీడ్ హుస్సేనీ ఇరాన్ దేశీయుడు. ఆఫ్ ఘన్ సమాజాన్ని పాశ్చాత్యజ్ఞానం వెలుగులో విశ్లేషించి విమర్శనాత్మకంగా రాసిన గొప్ప నవల. రచయిత బయటి ప్రపంచానికి తెలియని జీవితాన్ని ఆశ్ఛర్య కరంగా పాఠకుల ముందు ఆవిష్కరించాడు.

ఆఫ్ ఘనిస్థాన్ చరిత్ర, సమాజం నేపథ్యంలో 'కైట్ రన్నర్' నవల ఇతివృత్తం 1952లో మొదలై 1990 దశకంవరకూ సాగుతుంది. రచయిత ఖలీద్ హుసేని 11 ఏళ్ల వయసులో దేశంవిడిచిపెట్టి కొంతకాలం ఫ్రాంన్సులో ఉండి, తర్వాత అమెరికాలో స్థిరపడ్డాడు. కైట్ రన్నర్ అతని తొలిరచన. ఆఫ్ ఘన్ పితృస్వామ్య, పురుషాహంకార సమాజం, దేశంలో వివిధ తెగలమధ్య వైరుధ్యాలు, ఫక్తూన్ పాలకవర్గాల ఆధిపత్యం నేపధ్యంలో ఈ నవలరాశాడు.

అమీర్ కాబూల్ సంపన్న ఫక్తూన్ కుటుంబంలో జన్మించాడు. అతనితండ్రి బాబా ధనికవ్యాపారి, అయినా ఉదారభావాలు కలిగిన వ్యక్తి. బాబా హజారా తెగకు చెందిన తన సేవకుడు అలీ కుమారుడు హుసేనీని కూడా తనతో సమానంగా అభిమానించడం అమీర్ సహించలేడు. తన బాల్య స్నేహితుడిపట్ల అసూయ పడతాడు. అమీర్, హుసేని ఇద్దరూ తల్లిలేని పిల్లలు. గాలిపటాలు ఎగరెయ్యడంలో హుసేని నైపుణ్యాన్ని ఎవరు మెచ్చుకొన్నా అమీర్ ఓర్చుకోలేడు. బాబా స్నేహితుడు రహీంఖాన్ అమీర్ ను దగ్గర తీసి ఓదార్పు మాటలతో సాంత్వన కలిగిస్తాడు. బాబా అమీర్ ను ఆఫ్.ఘన్ల జాతీయక్రీడ గాలిపటాల పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహిస్తాడు. ఈపోటీలో విజయం ప్రతిష్ఠాత్మకమైనది. హుసేని ఆక్రీడలో చాలా నేర్పరి. హుసేని తన మిత్రుడివెంట వుండి అమీర్ ని పోటీలో గెలిపిస్తాడు. చివరి గాలిపటాన్ని గ్ఞాపికగా చేజిక్కించుకోడంలో హుసేని ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. సగం జర్మన్, సగం ఫక్తూన్ అయిన అసిఫ్ ఆసూయతో, ద్వేషంతో హజారాతెగ హుసేనీని కొట్టి,అతనిపై అసహజమైన లైంగిక దాడి చేసినా అమీర్ హుసేనీని రక్షించడానికి ప్రయత్నం చేయకుండా తను తెచ్చిన గాలిపటం సావనీర్ని తండ్రికి చూపించి మెప్పు పొంది, తండ్రికి దగ్గరవుతాడు.

||రెండోభాగం||

1979 లో సోవియట్ రష్యా జోక్యంతో, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే బాబా కుమారుణ్ణి తీసుకుని పాకిస్థాన్ కు, అక్కడ నుండి కాందిశీకుుడుగా అమెరికా చేరుకున్నాడు. బాబా అడ్డమైన పనులు చేస్తూ అమీర్ ను చదివించి ప్రయోజకుణ్ణి చేసి, చనిపోయేముందు ఆఫ్గనిస్థాన్ కాందిశీకుల కుమార్తె సురయాతో వివాహం జరిపిస్తాడు. ఆమీర్ రచయితగా స్థిరపడ్డాడుగాని అమీర్ దంపతులకు సంతానప్రాప్తి లేదని తెలుస్తుంది.

||మూడోభాగం||.

15 సంవత్సరాల తర్వాత, అమీర్ తండ్రికి ఆత్మీయమిత్రుడయిన రహీంఖాన్ మరణశయ్య మీద ఉండి ఒకసారి చూచివెళ్ళమని కోరతాడు. అమీర్ పెషావర్ వెళ్ళి ఖాన్ ని కలుస్తాడు. కాబూల్ లో బాబా ఆస్తులు తాలిబాన్ల ఆక్రమణనుంచి కాపాడేక్రమంలో హుసేని, అతవి తండ్రి అలి చంపబడ్డారని, హుసేని తండ్రి బాబానేనని, అలి కాదని హుసేని అమీర్ కు సోదరు డవుతాడని, హుసేని కుమారుడు సొహరాబ్ ను కాబూల్ అనాథశిశువుల ఆశ్రమం నుంచి కాపాడమనీ కోరుతూ, "There is a way to be good again" .అని హితవు పలుకుతాడు. పూర్వం సైన్యంలో పనిచేసిన ఒక టాక్సీ డ్రైవర్ ను తోడు తీసుకుని అమీర్ పాకిస్థాన్ నుండి కాబూల్ వెళ్ళి, డిటెక్టివ్ నవలలో మాదిరి అనేక సాహసాలు చేసి హుసేని కుమారుడు సొహరాబ్.ని కాపాడి వెంటపెట్టుకొని అమెరికా తీసుకుని పోతాడు. సొహరాబ్.ను అసహజ లైంగికక్రీడకు వాడుకుంటున్న తాలిబాన్ తో అమీర్ చేసిన పోరాటంలో, ఆకుర్రాడు వడిసెలతో తాలిబాన్ నుకొట్టి కాపాడుతాడు. అమీర్ బాల్యంలో హుసేని పట్ల తన ప్రవర్తనకు పరిహారంగా సొహరాబ్ ను అమెరికా కు తీసుకుని పోతాడు.

నేరభావన అమీర్ ని బాల్యం నుండి వెంటాతుంది. తల్లిలేని కుర్రాడుగా పెరగడం, సేవకుడు అలీ కొడుకును తండ్రి బాబా తనతో సమానంగా ముద్దు చెయ్యడం, తండ్రీ కుమారుల మధ్య వైరుధ్యాలు, అనుబంధం, ఆఫ్గనిస్థాన్ సమాజంలో తెగలమధ్య వైరభావాలు, స్త్రీలపట్ల చిన్నచూపు, అన్నీ నవలలో ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి.

కవిత్వం ఆడవాళ్లు రాసుకుంటారు. పురుషులకు తగదు అని బాబా కుమారుడితో అనడంలోనే పురుషాహంకార సమాజభావాలు వ్యక్తమవుతాయి. తాలిబాన్ల పాలనలోని కాబూల్ లో కన్నబిడ్డలకు ఒకపూట అన్నంకోసం అవయవహీనుడు కృత్రిమ పాదాన్ని బజారులో అమ్మడానికి ప్రయత్నించడం, వ్యభిచారనేరం ఆరోపించబడిన వారిని ఫుట్ బాల్ ఆట మధ్యలో క్రీడామైదానంలో స్త్రీ పురుషులను బహిరంగంగా ఉరితీయడం, తాలిబాన్లు అనాథ బాలకులను అసహజ లైంగిక కృత్యాలకు వాడుకోడం వంటి దారుణమైన దృశ్యాలు అమీర్ చూస్తాడు.

రాజరికపాలన అంతమవడంతో కాందిశీకులు పాకిస్థాన్ కు వలసపోవడం, తాలిబాన్ పాలనలో అభద్రతా భావం, అశాంతి ఈనవలకు నేపధ్యం. పాత్రలు ఏకాంత హర్మ్యాలనుండి దిగివచ్చి, ఇతరులతో ప్రేమబంధాన్ని పెనవేయడం హుసేని రెండవ నవల "Thousand Splendid Suns", మూడోనవల 'And the Mountains Echoed" లోనూ కొనసాగుతుంది. ఈ మూడు నవలలను ట్రయాలజిగా పరిగణించవచ్చు. A Thousand Splendid Suns నవలలో పాత్రలు తాలిబాన్ పాలనలో నలిగిపోయినా జీవితేచ్ఛను కాపాడుకొంటారు. మతం, పాలకులు, కుటుంబం ఇనుపచట్రంలో నలిగిపోతున్నా నానా, మరియం, లైలా లొంగిపోరు.

మూలాలు: 1.The Kite Runner,2."Thousand Splendid Suns",3.'And the Mountains Echoed" (నవలలు ట్రయాలజి.)