ది జాజ్ సింగర్ (1927 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది జాజ్ సింగర్
ది జాజ్ సింగర్ సినిమా పోస్టర్
దర్శకత్వంఅలాన్ క్రాస్‌లాండ్
స్క్రీన్ ప్లేఆల్ఫ్రెడ్ ఎ. కోహ్న్
నిర్మాతడారైల్ ఎఫ్. జనక్
తారాగణంఅల్ జోల్సన్, బాబీ గోర్డన్, మే మెక్ ఎవాయ్, వార్నర్ ఓలాండ్, యూజీనీ బెసెరర్
ఛాయాగ్రహణంహాల్ మొహర్
కూర్పుహెరాల్డ్ మెక్కార్డ్
సంగీతంలూయిస్ సిల్వేర్స్
నిర్మాణ
సంస్థలు
వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, ది వీటాఫోన్ కార్పోరేషన్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
విడుదల తేదీ
అక్టోబరు 6, 1927 (1927-10-06)
సినిమా నిడివి
89 నిముషాలు (సంగీతంతో 96 నిముషాలు)
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$422,000[1]
బాక్సాఫీసు$2.6 మిలియన్[1]

ది జాజ్ సింగర్ 1927, అక్టోబర్ 8న విడుదలైన అమెరికా టాకీ చలనచిత్రం. అలాన్ క్రాస్‌లాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 354 మాటలతో ప్రపంచ చలనచిత్రరంగంలో తొలి టాకీ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో అల్ జోల్సన్, బాబీ గోర్డన్, మే మెక్ ఎవాయ్, వార్నర్ ఓలాండ్, యూజీనీ బెసెరర్ తదితరులు నటించారు.[2]

యూదు మత గురువు (వార్నర్ ఓలాండ్) తనలాగే తన కొడుకు (అల్ జోల్సన్) కూడా మతానికే కట్టుబడివుండాలనుకుంటాడు. అందుకు విరుద్ధంగా అల్ జోల్సన్, జాజ్ సింగర్ మారి బార్‌లలో పాటలు పాడుతుంటాడు. ఆ విషయం తెలుసుకున్న వార్నర్ ఓలాండ్, కొడుకును ఇంటినుండి వెళ్ళిపోమంటాడు. అప్పుడు అల్ జోల్సన్ తన తండ్రికి నచ్చినవిధంగా మతపరమైన పాటలు పాడి తండ్రి అభిమానాన్ని పొందుతాడు.[3]

నటవర్గం

[మార్చు]
 • అల్ జోల్సన్
 • బాబీ గోర్డన్
 • మే మెక్ ఎవాయ్
 • వార్నర్ ఓలాండ్
 • యూజీనీ బెసెరర్
 • ఒట్టో లెడరర్
 • రిచర్డ్ టకర్
 • యోస్సెలే రోసెన్బ్లాట్

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: అలాన్ క్రాస్‌లాండ్
 • నిర్మాత: డారైల్ ఎఫ్. జనక్
 • స్క్రీన్ ప్లే: ఆల్ఫ్రెడ్ ఎ. కోహ్న్
 • ఆధారం: సమ్సన్ రాఫెల్స్సన్ రాసిన ది జాజ్ సింగర్ అనే నాటకం
 • సంగీతం: లూయిస్ సిల్వేర్స్
 • ఛాయాగ్రహణం: హాల్ మొహర్
 • కూర్పు: హెరాల్డ్ మెక్కార్డ్
 • నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, ది వీటాఫోన్ కార్పోరేషన్
 • పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్

చిత్ర విశేషాలు

[మార్చు]
 1. విటాఫోన్ విధానంలో టాకింగ్ - మిషన్ డిస్కులతో ఫిల్మ్ ను సింక్రోనైజ్ చేసి పెదవుల కదలికకు మాటలను చేర్చడం జరిగింది.[2]
 2. ఈ చిత్రాన్ని టాకీ చిత్రంగా తీయాలని ముందుగా అనుకోలేదు. ఆల్ జోల్సన్ సినిమాలో మొదటి పాటపాడి, రెండోపాట పాడబోతూ కొన్ని మాటలను మాట్లాడగా అవి కూడా రికార్డు అయ్యాయి.[4] దర్శకనిర్మాతలు రషెస్ చూస్తున్న సమయంలో సినిమాలో మాటలు ఉంటే బాగుంటుంది అనిపించి, మరికొన్ని మాటలతో కొన్ని సన్నివేశాలు తీయడం జరిగింది.[2]
 3. ఈ సినిమాలో మొత్తం 354 మాటలు ఉన్నాయి. వాటిలో 340 అల్ జోల్సన్, 13 మాటలను యూజీనీ బెసెరర్ (తల్లి), స్టాప్ అనే మాటను వార్నర్ ఓలాండ్ (తండ్రి) పలికారు.[2]
 4. ఈ చిత్రంలోని సౌండ్ ను సౌండ్-ఆన్-డిస్క్ విధానంలో రికార్డు చేశారు.[2]

అవార్డులు

[మార్చు]
 1. 1929లో జరిగిన మొదటి ఆస్కార్ అవార్డులో చిత్ర నిర్మాత డారైల్ ఎఫ్. జనక్ గౌరవ ఆస్కార్ పురస్కారాన్ని అందుకోవడమేకాకుండా ఉత్తమ రచయిత విభాగంలో ఆల్ఫ్రెడ్ ఎ. కోహ్న్ నామినేట్[5] చేయబడ్డాడు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 Warner Bros financial information in The William Shaefer Ledger. See Appendix 1, Historical Journal of Film, Radio and Television, (1995) 15:sup1, 1-31 p 6 DOI: 10.1080/01439689508604551
 2. 2.0 2.1 2.2 2.3 2.4 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 11.
 3. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 10.
 4. Kehr, Dave (October 16, 2007). "New DVDs: The Jazz Singer". New York Times. Archived from the original on 10 మార్చి 2013. Retrieved 7 ఫిబ్రవరి 2019.
 5. "The 1st Academy Awards (1929) Nominees and Winners". oscars.org. Retrieved 7 February 2019.

ఇతర లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఆధార గ్రంథాలు

[మార్చు]