ది ఫౌంటెన్ హెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ది ఫౌంటెన్ హెడ్ అమెరికన్ నవలా రచయిత్రి అయాన్ ర్యాండ్ 1943లో రచించిన నవల. మార్మికవాదం, మార్క్సిజం, కలెక్టివిజం వంటి భావనలను వ్యతిరేకిస్తూ అయాన్ రాండ్ 'ఆబ్జెక్టివిజం' తాత్వికతను, సమాజం యొక్క సామూహిక ఆలోచనలను ఈ నవలలో ప్రతిపాదించింది. వ్యక్తి ప్రతిభను ఎవరూ అణచి పెట్టలేరని, 'రోర్కు' వంటి ప్రతిభావంతుడైన భవన నిర్మాణశిల్పి అనేక అననుకూల పరిస్థితులను ఎదుర్కొని, చివరకు గొప్ప నిర్మాణ శిల్పిగా, ఇంజనీరుగా పేరుతెచ్చుకుంటాడు. అది అమెరికా మహానగరాలలో ఆకాశహర్మ్యాలు నిటారుగా ఆకాశాన్ని చుంబిస్తూ తలయెత్తుతున్న సందర్భం.

అల్పప్రగ్ఞావంతులైన పీటర్ కీటింగ్ వంటి నకిలీ ఇంజనీర్లు మొదట పత్రికలు, భజనపరుల సహకారంతో పైకివచ్చినా సమయం గడిచేకొలదీ వారి నిజరూపం బయటపడి అపఖ్యాతి పాలవుతారు.

'టుహి'వంటి అసూయాపరులైన జర్నలిస్టులు ఏమార్గంలోనైనా ఈ నవలలో ప్రథానపాత్ర రోర్కు పైకిరాకుండా సర్వశక్తులు పెట్టి అడ్డుకొంటారు.

వైనాండ్ తన ధనబలం, పత్రికల బలంతో ఏమైనా సాధించగలనని గర్వించే పెట్టుబడిదారు. చివరకు మంచివైపు నిలబడినా, ఆత్మబలంలేక అల్లరిమూకల దాడికి భయపడి తలవంచి, పేరును, భార్య 'డోమినిక్'ను పోగొట్టుకుంటాడు. నవలలో ప్రకృతి వర్ణపలు, పాత్రల వేషభాషలు తరచు ప్రతీకాత్మకంగా అనిపిస్తాయి.

ఈనాటి మన సమాజానికి ఈ పెద్ద, సుదీర్ఘమయిన నవలకు ఎన్నో పోలికలు, పత్రికాధిపతులు సమాజంలో అవిద్యావంతులైన ప్రజలకు నీచాభిరుచులను, నేరాలు ఘోరాలు పతాకశీర్షికలలో వండి వడ్డిస్తున్నారు, ప్రజల అభిరుచులను ఇచ్చవచ్చినట్లు తప్పుదారిపట్టించి ఆడుకోగలుగుతున్నారు.

మనిషి అజేయుడని చెప్పడానికి ప్రతీకగా ఈ పుస్తకం ముఖపత్రం మీద ఉదయించే సూర్యుడి బొమ్మను వాడారు! మనిషి సృజనాత్మక శక్తిమీద నమ్మకం కలిగించే గొప్ప నవల "ఫౌంటెన్ హెడ్".

డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు ఫౌంటెన్ హెడ్ ను తెలుగులోకి అనువాదం చేశాడు.

మూలాలు

[మార్చు]