ది బిగ్ బ్యాంగ్ థియరీ (టీవీ సిరీస్)
ద బిగ్ బ్యాంగ్ థియరీ | |
---|---|
245px ద బిగ్ బ్యాంగ్ థియరీ టైటిల్ కార్డ్ | |
సుపరిచితం | టిబిబిటి |
ఫార్మాట్ | సిట్ కాం |
రూపకర్త | చక్ లోరే బిల్ ప్రాడీ |
దర్శకత్వం | జేమ్స్ బరోస్ (pilot) మార్క్ సెండ్రోవ్ స్కీ |
తారాగణం | జానీ గలేకీ జిమ్ పార్సన్స్ కాలే కూకో సిమాన్ హాల్బర్గ్ కునాల్ నయ్యర్ సారా గిల్బర్ట్ |
ఓపెనింగ్ థీమ్ | "The Big Bang Theory Theme"[1] written and recorded by Barenaked Ladies |
మూల కేంద్రమైన దేశం | USA |
వాస్తవ భాషలు | English |
సీజన్(లు) | 3 |
ఎపిసోడ్ల సంఖ్య | 51 (List of episodes) |
నిర్మాణం | |
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు | చక్ లోరే బిల్ ప్రాడీ లీ అరోన్ సన్ |
నిర్మాతలు | Steve Molaro Mike Collier Faye Oshima Belyeu |
సంపాదకులు | Peter Chakos |
కెమెరా సెటప్ | మల్టి కెమెరా |
మొత్తం కాల వ్యవధి | 21 నిమిషాలు (అడ్వర్టైజ్మెంట్లు లేకుండా) |
ప్రసారం | |
వాస్తవ ప్రసార ఛానల్ | CBS |
చిత్ర రకం | 480i (SDTV) 576i (SDTV), 1080i (HDTV) |
వాస్తవ ప్రసార కాలం | September 24, 2007 – present |
External links | |
Website |
ది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్ కామ్(టీవీ సీరీస్), వారిద్దరూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా స్టీవెన్ మోలారోతో కలిసి పనిచేశారు. ఈ ముగ్గురూ ప్రధాన రచయితలుగా కూడా పనిచేశారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ సిబిఎస్ లో సెప్టెంబరు 24, 2007లో మొట్టమొదట ప్రసారమైంది.[2] ఎనిమిదవ సీజన్ సెప్టెంబర్ 22, 2014న ప్రసారం కావడం ప్రారంభమైంది.
కాలిఫోర్నియాకు చెందిన పసడెనాలో జీవించే ఐదు పాత్రలు కేంద్రంగా ఈ సీరియల్ సాగుతుంది. ఆ ఐదుగురిలో లెనార్డ్ హాఫ్ స్టడ్టర్, షెల్డన్ కూపర్ కాల్టెక్ లో ఫిజిసిస్టులు, వారిద్దరూ ఒకే అపార్ట్ మెంట్లో జీవిస్తుంటారు; వెయిట్రెస్ గా పనిచేస్తూ, సినిమారంగంలో నటిగా మారాలనుకునే పెన్నీ; లెనార్డ్, షెల్డన్ల లాగానే సామాజికంగా వింతమనుషులైన, గీకీ స్నేహితులు, సహోద్యోగులు అయిన ఎయిరోస్పేస్ ఇంజనీర్ హోవర్డ్ వోలోవిట్జ్, ఆస్ట్రోఫిజిసిస్టులు రాజ్ కూత్రప్పలి ఉన్నారు. ఈ నలుగురి విచిత్రమైన లక్షణాలు, మేధస్సు కలిసి పెన్నీ సామాజిక నైపుణ్యాలు, కామన్ సెన్స్ లోని వైరుధ్యం వల్ల హాస్యం రూపొందుతుంది.[3][4]
కొంతకాలానికి సహాయక పాత్రలైన హోవార్డ్ గర్ల్ ఫ్రెండ్ (తర్వాత భార్య), మైక్రోబయాలజిస్ట్ బెర్నడెట్ రోస్టెంకోవ్ స్కీ, గతంలో పెన్నీతో పాటుగా పార్ట్ టైం వెయిట్రెస్, న్యూరోసైంటిస్ట్ ఎమీ ఫర్రా ఫొవ్లర్(ఈమె షెల్డన్ ని డేటింగ్ వెబ్సైట్ ద్వారా కలిసి, అతని గర్ల్ ఫ్రెండ్ అవుతుంది), ముఖ్యపాత్రలు కలిసే కామిక్ బుక్ స్టోర్ ఓనర్, సీజన్ 8లో హోవార్డ్ తల్లితో వెళ్ళిపోయే స్టువార్ట్ బ్లూమ్ వంటివాటిని ముఖ్యపాత్రలుగా మలిచారు.
Notes[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "As sold on [[iTunes Music Store]]". Retrieved 2009-10-25. URL–wikilink conflict (help)CS1 maint: discouraged parameter (link)
- ↑ "The Big Bang Theory: Cast & Details".
- ↑ Gary Strauss (April 11, 2007). "There's a science to CBS' Big Bang Theory". USA Today. Retrieved November 7, 2008. CS1 maint: discouraged parameter (link)
- ↑ Scott D. Pierce (October 8, 2007). "He's a genius". Deseret News. Archived from the original on 2009-01-08. Retrieved December 11, 2008. CS1 maint: discouraged parameter (link)