ది హాబిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది హాబిట్ (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్
దిహాబిట్ టోల్కీన్.jpg
కృతికర్త: జె.ఆర్.ఆర్.టోల్కీన్
బొమ్మలు: జె.ఆర్.ఆర్.టోల్కీన్
ముఖచిత్ర కళాకారుడు: జె.ఆర్.ఆర్.టోల్కీన్
దేశం: యునైటెడ్ కింగ్డమ్
భాష: ఆంగ్లం
విభాగం (కళా ప్రక్రియ):
ప్రచురణ: George Allen & Unwin (UK)
విడుదల: 21 September 1937
దీని తరువాత: లార్డ్ ఆఫ్ ది రింగ్స్


ది హాబిట్ ఆంగ్లం: The hobbit. (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య, కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ఉత్తమ బాలల సాహిత్య రచనగా అవార్డు పొందింది. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో బాలల సాహిత్యంలో ఈ పుస్తకం విశేష ఆదరణ చురగొంది.


ఈ పుస్తకం (ఆర్థికంగా) ఘనవిజయం సాగించినందుకు టోల్కీన్ ని కొనసాగింపుగా పుస్తకాలు వ్రాయమని ప్రచూరణకర్తలు కోరగా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రచించారు. ఇవి కూడా ఘనవిజయం సాధించాయి. హాబిట్ కథలోని కొన్ని పాత్రలు, మిడిల్ ఎర్త్ కథాంశం లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో కూడా కనబడుతుంది. ఈ కథలు ముఖ్యంగా యుద్దనేథ్యం కల్గి వుంటాయి. ఇటువంటి యుద్ద కథలు వ్రాయడానికి టోల్కీన్ మొదటి ప్రపంచయుద్దంలో పనిచేసిన అనుభవం తోడ్పడిందని విమర్శకులు భావిస్తారు. పైగా టోల్కీన్ కి జెర్మానిక్ ప్రాచీన భాషా పరిజ్ణానం ఉండడం పిల్లల కథలంటే అభిరుచి వుండడం మరొక కారణం.

ఈ కథలో హాబిట్ (టోల్కీన్ సృష్టించిన ఒక జాతి పొట్టి మనుషులు) బిల్బో బాగ్గిన్ స్, మంత్ర శక్తిగల గెండాల్ఫ్, (డ్వార్ఫ్) మరగుజ్జుల సమూహానికి రాజైన థోరిన్ తో కలిసి మరగుజ్జుల రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చిన స్మాగ్ అనే డ్రాగన్ తొ పొరాడి వారి నిథిని దక్కించుకోవడమే కథాంశం.

కథ[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

  1. http://www.nytimes.com/1938/03/13/movies/LOTR-HOBBIT.html
  2. http://books.google.com/?id=TqJ7gHrwjUEC&printsec=frontcover#PPA27,M1
  3. http://books.google.com/books?id=gPDBt8ea5lcC
"https://te.wikipedia.org/w/index.php?title=ది_హాబిట్&oldid=3616653" నుండి వెలికితీశారు