Jump to content

దూర్వాసుల వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
(దుర్వాసుల వెంకట సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)
దూర్వాసుల వెంకట సుబ్బారావు
జననం10 మే 1911
పెద్దాపురం
జాతీయతభారతీయుడు
వృత్తిపెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, న్యాయ వాది
జీవిత భాగస్వామిఅచ్యుతాంబ
పిల్లలువెంకట శాస్త్రి, వేదాంతం, సత్యనారాయమూర్తి, వినయ ప్రసాద్, చావలి అన్నపూర్ణ, పెదపూడి సూర్యమాల,

దూర్వాసుల వెంకట సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు పెద్దాపురం పట్టణానికి చెందిన మొట్టమొదటి, ఏకైక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (MLA) శాసన సభ్యులుగా ప్రత్యేక గుర్తిపు పొందారు

దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు న్యాయవాదిగా పనిచేస్తూ అమలాపురానికి పబ్లిక్ ప్రాసిక్యుటర్ గా నియమితులయ్యారు.

స్వాతంత్ర్య పోరాటంలో

[మార్చు]

బ్రిటీషు వారి అరాచకాలకు సహించలేక తన పదవికి రాజీనామా చేసి భారతదేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమివేయటమే లక్ష్యంగా 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకొన్నందుకు మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి గారితో కలిసి 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

రాజకీయ అరంగేట్రం

[మార్చు]

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు గానూ దూర్వాసుల వెంకట సుబ్బారావు గారి న్యాయవాద పట్టబద్రుని పట్టా రద్దుకి కేసు వేయబడగా పోరాడి సాధించుకొన్నారు. కేసు కొట్టి వేయబడింది స్వాతంత్ర్యానంతర పరిణామాల వల్ల కలత చెందిన దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాల పై విసుగు చెంది 1949 లో తన భావాలతో సారూప్యత కల్గిన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట రామస్వామి పై ఓటమి చవిచూశారు.

1953 లో ఆంధ్ర రాష్ట్రావతరణ ప్రకటన వెలువడింది 1956 లో ఆంధ్ర రాష్ట్రం అవతరించిది

1955లో పెద్దాపురానికి దూర్వాసుల వెంకట సుబ్బారావు (సి.పి.ఐ = కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్థి చల్లా అప్పారావు (కె ఎల్ పి = కృషి లోక్ పార్టీ) పై విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసారు

సహచరులు సంబోధనలు

[మార్చు]

ఆయన వాగ్ధాటికి మెచ్చిన నీలం సంజీవరెడ్డి గారు అసెంబ్లీలో సుబ్బారావు సింహం లా గర్జిస్తారు అని అందరికీ చెప్పేవారు, డా. బెజవాడ గోపాలరెడ్డి గారు ఆయన్ని దూర్వాసుల మహాముని అని సంబోధించేవారు

పెద్దాపురం పట్టణానికి చెందిన మొట్టమొదటి, ఏకైక MLA ఈయనే కావడం విశేషం

ఆంధ్రా యూనివర్సిటీ క్రిమినాలాజి కేసుల్లో సుబ్బారావు గారు వాదించిన కేసులు రిఫరెన్సు లుగా చేసుకునేవారు