దేవతల కొలువులు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
- దేవతల కొలువులు, తెలుగునాట ఇదొక జానపద కళారూపము
దేవతల కొలువుల సంబరాలు;
[మార్చు]ఈనాడు దేవతల కొలువులు అన్ని గ్రామాల్లోనూ అంతగా జరగక పోయినా అక్కడక్కడ వెనుక బడిన ప్రాంతాల్లో దేవతల మొక్కు బడులు, తాతర్లు సంబరాలు జరుగుతూ వుంటాయి. వీటిని ఉగాది, సంక్రాంతి మొదలైన పండుక దినాల్లో జరుపుతారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు అర్పిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్ద్యాలు అర్పిస్తారు. గరగలు ఘటాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఈంటింటికీ త్రిప్పుతారు. డప్పుల మీద సప్తకాళ వాయిద్యాన్ని మాదిదలు వాయిస్తూ వుంటే, గరగలను ఎత్తుకున్న చాకళ్ళు (రజకులు) లయ భద్ధ మైన చించులతో, తన్మయత్వంతో నృత్యం చేస్తారు. ఆ సందర్భంలో వాయించే డప్పు వాయిద్యం ఈ విధంగా సాగుదుతుంది.
తాళం వరుసలు
[మార్చు]త ఝుణక, ఝుణక, ఝుణకా తద్దివిత - ధివిత, తకతా కితతక - కిటతక - కిటతక తాం - ధోం - తక్కిట కిటతక ఝంతరి కిటతక - ధుంతరి కిట తక - ధుం తరికిటతక
అని డప్పుల మీద పలికిస్తూ, మధుర భావాలు ఒలికిస్తూ, భక్తి తన్మయత్వంతో ప్రజలను ముగ్దుల్ని చేస్తూ, వారి హృదయాలను రాగ రంజితం చేస్తూ వుంటారని ఒక సందర్భంలో కీ:శే: నేదునూరి గంగా ధరంగా రన్నారు.
మింటి దిక్కున జూచి, మీసంతు బడిసి ఒంటిదున్నా తలను నరికేనురా కొంకాక చిందూలు - గోవింద గంతూలు\ శంకలేకా బలి చల్లీతిరా - లింగతాలిల్లే తాలిల్లే..............................||ఓరి||
అండాండమను బిరుదు దాసాది నాపేరు పిండాండమను బిరుదు కాసె పోసి అండ పిండ బ్రహ్మాండముల కెల్లను మెండుండు దైవాల - మెడాడు రా లింగ...... తాలెల్లె తాలిల్లె ......||ఓరి| అని భీకరంగా పాడుతూ, చిందులూ వేస్తూ ఒక్క వృటుతో ఆ దున్న పోతు మెడను నరికి వేస్తాడు. ఆ రక్తంతో ఆన్నాన్ని తడిపి, కుంభ రాసి పోస్తారు. రక్త వర్ణమైన ఆ కుంభాన్ని ఒక తట్టలోకి ఎత్తి, దానిపై నరికిన దున్న పోతు తలను పెట్టి, తట్టను వెట్టి వాడి తల మీద పెట్టి ఘటాల వాడు డప్పుల వాయిద్యాన్న నుసరించి గణాచారిలా ఆవేశంతో గంతులు వేస్తూ భీకరంగా కేకలు వేస్తూ గ్రామ పొలిమేరల్లో నాలుగు దిక్కులు పొలి గంగను విడిచి రక్తపు అన్నాన్ని వెదజల్లుతారు. గ్రామ దేవతలను పొలి మేరలో పెడతారు.
మూలం:
[మార్చు]తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.