Jump to content

దేవరపల్లి ప్రకాశ్ రావు

వికీపీడియా నుండి
(దేవరపల్లి ప్రకాష్ రావు నుండి దారిమార్పు చెందింది)

దేవరపల్లి ప్రకాశ్ రావు
జననందేవరపల్లి ప్రకాశ్ రావు
(1958-11-11)1958 నవంబరు 11
కటక్
మరణం2021 జనవరి 13(2021-01-13) (వయసు 62)
కటక్
జాతీయతభారతీయుడు
ప్రసిద్ధిసామాజిక కార్యకర్త
భార్య / భర్తవిజయలక్ష్మి
పిల్లలు2
పురస్కారాలుపద్మశ్రీ (2014)

దేవరపల్లి ప్రకాశ్ రావు (1958 నవంబరు 11 – 2021 జనవరి 13) ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్త. కటక్‌లోని వివిధ మురికివాడల్లో నివసిస్తున్న పేదలకూ అనాథ పిల్లలకూ విద్య అందించడం కోసం, రక్తదానం కోసమూ 2019 లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[1][2] అతనికి టీ దుకాణం ఉండేది.

జీవిత విశేషాలు

[మార్చు]

ప్రకాశరావు 1958 నవంబరు 11 న కటక్‌లో జన్మించాడు. అతని తండ్రి డి కృష్ణమూర్తి, బ్రిటిషు సైన్యంలో సైనికుడు. అతని తల్లి పేరు డి లక్ష్మి. భార్య విజయలక్ష్మి, శ్రీ రామచంద్ర భంజ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో నర్సుగా పనిచేస్తోంది. రావు దంపతులకు హరిప్రియ, వనుప్రియ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3][4] అతనికి 8 భాషలలో పట్టు ఉంది.

సంఘ సేవ

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం

కటక్‌లోని బక్సీ బజార్ ప్రాంతంలో ఆయన టీ స్టాల్ నడుపుతున్నాడు. టీ అమ్మడం ద్వారా రోజుకు ఆయన దాదాపు 600 రూపాయల దాకా సంపాదిస్తాడు. అందులో కొంతభాగం కుటుంబ ఖర్చులకు వినియోగించుకుంటూ మిగతా మొత్తం పేదల కోసం ఖర్చు పెడుతున్నాడు. అంతేకాదు పాలు, బ్రెడ్ లాంటివి ఫ్రీగా అందిస్తున్నారు. ఇదంతా కూడా 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తుండటం విశేషం.

తన రెండు గదుల ఇంటినే ఆశా ఓ ఆశ్వాసన అనే బడిగా మార్చారు ప్రకాష్ రావు. పిల్లలకు చదువు నేర్పిస్తూ ఉచిత భోజనం పెడుతున్నాడు. ప్రకాష్ రావు స్కూల్ ఏర్పాటు చేసేంతవరకు అక్కడ బడి అంటేనే తెలియని పరిస్థితి. కూలీ పనులు చేసుకునేవారు ఎక్కువగా ఉండే ఆ ఏరియాలో బడి ఏర్పాటు చేసి, వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు ప్రకాష్ రావు.[5] ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు పిల్లలకు అక్కడ బోధించేలా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అక్కడ 80 మంది విద్యార్థులు చదువుతున్నారు.[6] టీ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంలో సగాన్ని పాఠశాల నిర్వహణకే వెచ్చించాడు. ఆయన 214 సార్లు రక్తదానం చేశాడు.[7] మరణానంతరం తన శరీరాన్ని దానం చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Amaravati పద్మశ్రీ జాబితాలో ఛాయ్‌వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!".
  2. "चाय वाले को मिला 'पद्मश्री', बेमिसाल है इनकी कहानी". Jansatta (in హిందీ). 2019-03-16. Retrieved 2021-08-01.
  3. m.sambadepaper.com https://m.sambadepaper.com//imageview_215807_32036289_4_71_14-01-2021_20_i_1_sf.html. Retrieved 2021-08-01. {{cite web}}: Missing or empty |title= (help)
  4. "From a mere chaiwala, I have become a Padma Shri chaiwala: Devarapalli Prakash Rao - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2 February 2019. Retrieved 2021-08-01.
  5. "టీ అమ్ముకునే తెలుగోడికి పద్మ శ్రీ పురస్కారం."
  6. "Tea Seller Runs School With His Meagre Earnings. This Padma Shri Awardee Is An Inspiration". IndiaTimes (in Indian English). 2019-01-27. Retrieved 2021-08-01.
  7. "How Life Changed For Cuttack Tea Seller After PM Modi's Mann Ki Baat". NDTV.com. Retrieved 2021-08-01.
  8. "Meet D Prakash Rao: A Tea seller who turned 'Messiah' for slum children". Meet D Prakash Rao: A Tea seller who turned ‘Messiah’ for slum children (in ఇంగ్లీష్). Retrieved 2021-08-01.