దొంగాట (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగాట
దర్శకత్వందిలీష్ పోతన్
రచనసంజీవ్ పజహూర్
నిర్మాతసందీప్ సేనన్
అనీష్ ఎం. థామస్
తారాగణంఫహాద్ ఫాజిల్
సూరజ్ వెంజరామూడు
నిమిషా సజయన్
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
కూర్పుకిరణ్ దాస్
సంగీతంబిజిబల్
నిర్మాణ
సంస్థ
ఆహా ఒరిజిన‌ల్స్‌
విడుదల తేదీ
2022 మే 6 (2022-05-06)(తెలుగు)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

దొంగాట 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. 2017లో మలయాళంలో విడుదలైన ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్’ సినిమాను ఆహా ఒరిజిన‌ల్స్‌ తెలుగులో చేసిన ఈ సినిమాకు దిలీష్ పోతన్ దర్శకత్వం వహించాడు. ఫహాద్ ఫాజిల్, సూరజ్ వెంజరామూడు, నిమిష సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘దొంగాట’ పేరుతో మే 6న ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది.[1] మలయాళంలో విడుదలైన ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్’ సినిమాలో నటనకు గానూ ఫహద్ ఫాజిల్ కు ఉత్తమ సహాయ నటుడిగా, సజీవ్ పళూర్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు అందుకున్నారు.

కథ[మార్చు]

ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్),, శ్రీజ (నిమిషా సజయన్) ఇద్ద‌రు ప్రేమించుకొని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని వేరే ఊర్లో కాపురం పెడతారు. భార్య మెడలోని బంగారు తాళిని తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం కొన్న భూమిలో బోరు వేయిద్దామనుకొని, గొలుసును అమ్మాలని నిర్ణయించుకొని, బస్సులో ప్రయాణిస్తుండగా ప్రసాద్‌ (ఫాహద్‌ ఫాజిల్) అనే దొంగ బంగారు గొలుసును కొట్టేస్తాడు. దీంతో ఆ దొంగపై దంపతులు కేసు నమోదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. ప్రసాద్‌ (ఫాహద్‌ ఫాజిల్) నేరాన్ని అంగీకరిస్తాడా, లేదా అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఆహా ఒరిజిన‌ల్స్‌
  • నిర్మాత: ఆహా ఒరిజిన‌ల్స్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీష్ పోతన్
  • సంగీతం: బిజిబల్
  • సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి

మూలాలు[మార్చు]

  1. Prabha News (1 May 2022). "ఆహాలో 'దొంగాట‌'.. మే 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  2. NTV, ntv (7 May 2022). "దొంగాట (మలయాళ డబ్బింగ్) ఆహా ఓటీటీ". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. Sakshi (8 May 2022). "పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే." Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.