దౌలతదియా
దౌలతదియా
দৌলতদিয়া | |
---|---|
పల్లె | |
Coordinates: 23°39′N 88°51′E / 23.650°N 88.850°E | |
దేశం | బంగ్లాదేశ్ |
జిల్లా | రాజబాడీ |
దౌలతదియా (Bengali: দৌলতদিয়া) అనేది బంగ్లాదేశ్‌లోని రాజబాడీ జిల్లాలో ఒక పల్లెటూరు. బంగలాదేశ్‌లోని అతిపెద్ద వేశ్యవాటికైన ఈ ఊరు,[1] ప్రపంచంలోని అతిపెద్ద వేశ్యవాటికల్లో ఒకటిగా పేరుగాంచింది. [2][3] 1988లో బంగలాదేశ్‌లో అధికారిక అనుమతి పొందిన 20 వేశ్యావాటికల్లో ఇదొకటి. ఐతే అప్పటికే కొన్ని దశాబ్దాలుగా ఈ వేశ్యావాటిక అనధికారికంగా ఉనికిలో ఉంది.[2] ఈ ఊళ్ళో 1300–2000 మంది వేశ్యలు ఉంటారని అంచనా. [1][3] రోజుకి 3000 మందికి పైగా సేవలందించే ఈ వేశ్యావాటికలో,[3] డబ్బులు చెల్లించిన వారికి శృంగారం, జూదం, మాదకద్రవ్యాల సేవలు దొరుకుతాయి.[1] ఈ ఊరు బంగలాదేశ్, భారతదేశాల సరిహద్దు ప్రాంతాలు ఐన దర్శన/గేడే (దక్షిణాన), కుతుబ్‌పుర్/తైఁపుర్ (ఉత్తరాన) లనుండి సుమారు 40 కి.మీల దూరంలో ఉంది.
వివాదాలు
[మార్చు]బంగలాదేశ్‌లో పడుపువృత్తి చేపట్టేందుకు చట్టప్రకారం కనీసం 18 ఏళ్ళు పూర్తై ఉండాలి. కానీ దౌలతదియాకు కొత్తగా వస్తోన్న వేశ్యల సగటు వయసు 14 ఏళ్ళు కాగా[2], కొందరు పదేళ్ళ పిల్లలు కూడా ఉన్నారు.[1] వేశ్యల్లో చాలామంది 250 డాలర్లకు సమానమైన మొత్తానికి (2014 నాటికి) తమ సేవలను అందిస్తున్నారు. ఈ డబ్బులని వాళ్ళు మళ్ళీ “మేడం” (English: Madam) లుగా పిలవబడే తార్పుడుగత్తెలకు ఇవ్వాలి. [1] ఈ మేడంలు తెలిసీతెలియని వేశ్యలకు లావెక్కడానికి సల్బ్యుటమొల్ (Salbutamol), డెక్సమిథసొన్ (Dexamethasone) వంటి మందులను ఇస్తుంటారు. [1][3]
2020లో తాత్కాలిక మూసివేత
[మార్చు]2020, మార్చ్ 20న కోవిడ్-19 వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఈ వేశ్యవాటిక మూసివేయబడింది. 2020, మార్చి 23న ఇక్కడి వేశ్యలు అత్యవసర నిధుల కోసం ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నారు. [4] దాంతో కొద్దికాలంలోనే ఇది మళ్ళీ తెరుచుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Tania Rashid (4 February 2014). "Sex, Slavery, and Drugs in Bangladesh". Vice News. Retrieved February 5, 2015.
- ↑ 2.0 2.1 2.2 Claudia Hammond (9 January 2008). "'I'm just here for survival'". The Guardian. Retrieved February 5, 2015.
- ↑ 3.0 3.1 3.2 3.3 Christine Jackman (26 October 2013). "Daughters of the brothel". Sydney Morning Herald. Retrieved February 5, 2015.
- ↑ "Sex workers in one of world's largest brothel appeal for funds due coronavirus". Reuters. 23 March 2020. Retrieved 23 March 2020.