ద్వంద్వ సమాసము
స్వరూపం
]] దీని లక్షణాన్ని "ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం" అని వివరించారు.
- ఉదాహరణలు
- సీతారాములు : సీతయును రాముడును
- రాధాకృష్ణులు : రాధయును కృష్ణుడును
- రామలక్ష్మణులు : రాముడును లక్ష్మణుడును
- కృష్ణార్జునులు : కృష్ణుడును అర్జునుడు
రకాలు
[మార్చు]ఈ సమాసం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం, సమాహార ద్వంద్వ సమాసం అని రెండు రకాలుగా కనిపిస్తుంది.
- ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం
ఒక పదం యొక్క అపేక్ష మరొక పదం కలిగివుండి - ఇలా అనేక పదాలు ఒకే క్రియా పదంతో అన్వయించడం ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం.
ఉదాహరణ : 'రామకృష్ణులు వచ్చారు' అన్నదానిలో రాముడూ వచ్చాడు కృష్ణుడూ వచ్చాడు అని 'వచ్చారు' అనే క్రియా పదం సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యతను ఇస్తూ అన్వయించబడినది.
- సమాహార ద్వంద్వ సమాసం
సమాహారం అనగా సమూహం అని అర్ధం. విడివిడిగా ఉన్న వస్తువుల్ని ఒకటిగా చేయటం. రెండు లేక మూడు పదాలను కలిపి ఒకటిగా ఏకవచనంలో చెప్పడం సమాహార ద్వంద్వ సమాసం.
బహుపద ద్వంద్వ సమాసము
[మార్చు]బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటె ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహుపద ద్వంద్వ సమాసమంటారు.
- ఉదాహరణ
- రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ద్వంద్వ సమాసము, తెలుగు వ్యాకరణము, మల్లాది కృష్ణప్రసాద్, విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ, 2007, పేజీలు: 208-213.