Jump to content

ద్విగు సమాసము

వికీపీడియా నుండి

ద్విగు సమాసము ఒక రకమైన సమాసము. సంఖ్యలను అనగా అంకెలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది. ఈ సంఖ్య ఒకటి నుండి ప్రారంభమై అనంతం దాకా సాగుతుంది. ఎన్ని సంఖ్యలున్నా అది ద్విగు సమాసమే. అయితే ఆ సంఖ్య తప్పకుండా నిర్దేశించబడాలి. కొంత, కొన్ని మొదలైనవి సమూహాన్ని చెబుతున్నాయి కాని సంఖ్యను నిర్దేశించడం లేదు కనుక కొన్నిదినాలు, కొంతసమయము వంటివి ద్విగు సమాసాలు కావు.

ఉదాహరణ :

ముల్లోకములు - మూడయిన లోకములు

నవరసాలు - తొమ్మిది ఐన రుచులు

దశావతారాలు - పది అవతారాలు

సమాహార ద్విగు సమాసము

[మార్చు]

సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము నందలి పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.

ఉదాహరణ : పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ద్విగుసమాసం, విక్టరీ తెలుగు వ్యాకరణము, మల్లాది కృష్ణప్రసాద్, విక్టరీ పబ్లికేషన్స్, విజయవాడ, 2007, పేజీలు: 202-4.