Jump to content

ధనుర్విద్యా విలాసము

వికీపీడియా నుండి
ధనుర్విద్యా విలాసము పుస్తక ముఖచిత్రం.

ధనుర్విద్యా విలాసము కృష్ణమాచార్యుడు అనే కవి రచించగా వేటూరి ప్రభాకరశాస్త్రి పరిష్కరించిన పద్యకావ్యం.

ప్రాచీన యుద్ధవిద్యలో ధనుర్విద్యా ప్రావీణ్యత అత్యంత ప్రముఖమైన అంశం. తుపాకులు, ఫిరంగులు వంటి ఆధునిక ఆయుధాలు విపరీతంగా ప్రపంచమంతా వ్యాపించేవరకూ దీని ప్రభావం కొనసాగింది. ఆధునిక యుగంలో కూడా కొన్ని ప్రత్యేకమైన స్థితిగతుల్లో వ్యూహకర్తలు ధనుస్సుతో విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనంతరకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన క్రీడగా ఆర్చరీ అధునికీకరణ చెందింది. ఈ నేపథ్యంలో తెలుగులో ఎంతో సాహిత్యం పద్యరూపంలో ధనుర్విద్యపై ఉంది. ఈ నేపథ్యంలో ధనుర్విద్యను గురించి ఆ విద్యాకౌశలం కలిగిన మహమ్మద్ జాఫర్ వద్ద నేర్చిన తిరుపతి రాయలనే మహారాజు వివరిస్తుండగా దానిని కృష్ణమాచార్యుడనే కవి పద్యరూపంలో రచించినట్టుగా గ్రంథంలోని ఆధారాలు చెప్తున్నాయి.

విషయసూచిక

[మార్చు]
ప్రథమాశ్వాసము
  • ఇష్టాదేవతాధ్యానము
  • సుకవిస్తుతి
  • కుకవినింద
  • కృతికథాకల్పక వంశావతార వర్ణనము
  • స్వప్న వృత్తాంతోపన్యాసము
  • కృతిపతి గుణకీర్తనము
  • కథారంభము
  • ద్రోణార్జున సమాగమము
  • ద్రోణుండర్జునకు ధనుర్విద్యా రహస్యంబుపదేశింప దొరకొనుట
  • విద్యా ప్రభావ సూచనము
  • గురు సంకీర్తనము
  • శిష్య వరణము
  • సఖండాఖండకోదండద్వయనామోద్దేశము
  • ధనుర్మిర్మాణ పరిమాణ ప్రముఖ విశేష వినిభాగము
  • మార్గణ పరిగణన ప్రణయనము
  • శరవిధాన మానప్రశంసనము
  • పక్షపరిమాణ ప్రశంసాదికము
  • పుంఖోప్య సంఖ్యానము
ద్వితీయాశ్వాసము
  • తూణీర లక్షణాదికము
  • మేఖలాబంధ లక్షణము
  • మౌర్వీ నిర్మాణ కథనము
  • అంగుళి త్రాణప్రకీర్తనము
  • జ్యారోపణ ప్రకారము
  • ధనురూ ర్ధ్వాధర భాగవినిభాగము
  • ముష్టి ప్రకరణము
  • స్థానోప సంఖ్యానము
  • శరగ్రహణోపాయ ప్రతిపాదనము
  • సంధాన క్రమవివరణము
  • ఆకర్షణ హస్తప్రస్తావము
  • బాణహస్త క్షేత్రనిరూపణము
  • దృష్టి లక్షణ్వాక్షణము
  • ధనురాకర్షణ కౌశలోపన్యాసము
  • పుంఖోద్వేజన విభజనము
  • చాపముష్టి ప్రేరణ వివరణము
  • శరమోచన ప్రకార ప్రవచనము
  • చాపోత్సరణ లక్షణవినిభాగము
  • శరాభ్యోసోచిత మాసోపన్యాసము
  • శరవ్యాపారయోగ్యతిథి వారతారకాయోగకరణ విస్తరప్రస్తావము
  • ఖురళికా రంగప్రసంగము
  • రంగప్రవేశలక్షణ నిర్దేశము
  • ధనుశ్శరపూజా యోజనము
  • గురుప్రమాణస్థేమము
  • శరశారాసనగ్రహణ పౌర్వా పర్యలోచనము
తృతీయాశ్వాసము
  • స్థానప్రతిష్ఠానములు
  • లక్ష్య శుద్ధిలాభము
  • లక్ష్యవేదికా విధానము
  • నారాచయోచన ప్రకారము
  • చిత్రలక్ష్యభేదనోపాయము
  • శాబ్దలక్ష్యశరాభ్యాసము
  • దూరనికట స్థలలక్ష్యభేదన
  • దృష్టిముష్టినియమనలక్షణము
  • రథారోహణ శరాభ్యాస విశేషము
  • గజారోపణ శరప్రయోగా వినిభాగము
  • హయారోహణ శరమోక్షణము
  • చిత్రయుద్ధ ప్రకారము దండకము
  • దూరపాతి శరాభ్యాస విస్తారము
  • నభోవిభజనము
  • శరప్రయోగ సమయాసమయ నిరూపణము
  • శరగమన గుణదోష వినిభాగము
  • నలువది కౌశలములు
  • దివ్యాస్త్రమంత్ర తంత్ర ప్రయోగోపసంహారము

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: