ధర్మసాధని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మసాధని
సంపాదకులుపి.నరసింహం
సంపాదకులుకె.రామశాస్త్రి
తరచుదనం
  • వారపత్రిక (1913-1926)
    * పక్షపత్రిక (1926-1940) *
    మాస పత్రిక (1941-1967)
ముద్రణకర్తకె.హనుమంతరావు
సంస్థబ్రహ్మసాధనాశ్రమము, కాకినాడ
దేశంభారతదేశం
భాషతెలుగు

కాకినాడ నుండి ఈ ధార్మిక వారపత్రిక వెలువడింది. బ్రహ్మసాధనాశ్రమ పక్షాన ప్రతి శనివారము ఈ పత్రిక వెలువడేది. కె.హనుమంతరావు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు. బ్రహ్మసమాజానికి సంబంధించిన వార్తలు, ధార్మిక సంబంధమైన విషయాలు ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రిక స్త్రీవిద్య, రజస్వలానంతర వివాహాలు మొదలైన సంఘ సంస్కరణలను ప్రోత్సహించింది. ఈ పత్రిక 1913లో ప్రారంభమై 54 సంవత్సరాలకు పైగా వెలువడింది. 1926నుండి పక్షపత్రికగా రూపాంతరం చెందింది. 1941లో మాసపత్రికగా వెలువడింది. ఈ పత్రికలో ఉమర్ అలీషా, చలం, జానకీజాని, తల్లావజ్ఝల పతంజలి మొదలైన వారి రచనలు వెలుగు చూశాయి. రాజారామ్‌ మోహన్ రాయ్ 126వ వర్ధంతి సందర్భంగా ఈ పత్రిక ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది[1].

మూలాలు[మార్చు]

  1. "ఎ.పి.ప్రెస్ అకాడమీ వారి ఆర్కైవ్స్‌లో ధర్మసాధని ప్రతులు". Archived from the original on 2020-10-25. Retrieved 2020-04-12.