ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం
ধামরাই জগন্নাথ রথ
రథం ఆకారంలోని ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం
రథం ఆకారంలోని ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం
భౌగోళికం
దేశంబంగ్లాదేశ్ బంగ్లాదేశ్
సంస్కృతి
దైవంజగన్నాథ స్వామి

ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం (బెంగాలీ: ধামরাই জগন্নাথ রথ) బంగ్లాదేశ్‌లోని ధామ్ రాయ్ లో ఉన్న పవిత్ర హిందూ దేవాలయం. ఇక్కడి ప్రధాన ఆరాధ్య దైవం జగన్నాథుడు. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి జరిగే జగన్నాథుడి రథయాత్ర వేలాది మంది ప్రజలను ఆకర్షిస్తున్న ఒక ప్రసిద్ధ హిందూ పండుగ. బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజానికి ధామ్ రాయ్ లోని ఈ రథయాత్ర అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి. జగన్నాథుడిని హిందువులు విష్ణువు అవతారంగా విశ్వసిస్తారు.[1]

వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి తరలి రావడం కారణంగా, ఇది పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది, రథాలతో పాటు భారీ ఊరేగింపులు డప్పులు, మృదంగం, భక్తి పాటలు వంటివి నగరాన్ని పరవశింపజేస్తాయి. రథంపై జగన్నాథుని దర్శనం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాధువులు, కవులు, ఈ ప్రత్యేక పండుగ పవిత్రతను పదేపదే కీర్తిస్తారు. పండుగ పవిత్రత ఏమిటంటే, రథాన్ని లేదా కనీసం దానిని లాగిన తాళ్లను అయినా స్పర్శించడం వలన అనేక పుణ్య కార్యాలు లేదా యుగయుగాల తపస్సుల ఫలితాలను పొందిన వాళ్ళమౌతామని భక్తుల నమ్మకం.

చరిత్ర[మార్చు]

ప్రచురితం కాని పత్రాలు, రికార్డుల నుండి ధామ్ రాయ్ రథం సుమారు 400 సంవత్సరాల నాటిదని చెప్పబడుతోంది. బంగ్లా సంవత్సరం 1079 (గ్రెగోరియన్ క్యాలెండర్‌లో 1672కి సంబంధించినది) నుండి 1204 (సా.శ. 1697) వరకు ఉనికిలో ఉన్న రథం వెదురుతో తయారు చేయబడిందని ఆ రికార్డుల నుండి తెలిసింది. అయితే, ఈ వెదురుతో చేసిన రథం స్థానంలో చెక్కతో చేసినది ఎలా వచ్చిందో తెలియదు. 1204 నుండి 1340 మధ్య కాలంలో బలియాటి (ప్రస్తుతం సతురియా ఉపజిల్లాలో ఉంది) జమీందార్లు (ఫ్యూడల్ భూస్వాములు) నాలుగు రథాలను తయారు చేశారని, దాని నిర్మాణానికి సంబంధించిన అన్ని ఖర్చులను వారు భరించారని ప్రచురించని మూలాలు పేర్కొన్నాయి.[2]

చివరిది నిర్మించడానికి ఒక సంవత్సరం సమయం పట్టింది. ధామ్రై, కలియాకోయిర్, సతురియా, సింగైర్ ప్రాంతాల వడ్రంగులు సంయుక్తంగా 60 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పు కలిగిన రథాన్ని తయారు చేయడానికి పనిచేశారు, దీని నిర్మాణం 1340 లో పూర్తయింది. కొత్తగా నిర్మించిన రథాలు మూడు అంతస్తులుగా ఉన్నాయి. మొదటి, రెండవ అంతస్తులలో ప్రతిదానిలో నాలుగు 6 నాలుగు గదులు, పై అంతస్తులో ఒక గది ఉన్నాయి. ఈ గదులు లేదా గదులను 'నోబోరోట్నో' అని పిలుస్తారు. రథానికి 32 పెద్ద చెక్క చక్రాలు ఉన్నాయి. ముందు రెండు చెక్క గుర్రాలు అలాగే హిందూ దేవతల విగ్రహాలు పెయింటింగ్‌లతో అలంకరించబడ్డాయి. రథాన్ని లాగడానికి సుమారు 1000 కిలోగ్రాముల జ్యూట్ ఫైబర్‌తో తయారు చేసిన మందపాటి తాడులను ఉపయోగిస్తారు. అది లాగబడుతుండగా, వీధిలో, పైకప్పు మీద వరుసలో ఉన్న ప్రజలు హర్షధ్వానాలు, నినాదాలతో రథంపై అరటిపండ్లు, చక్కెరను కురిపిస్తారు.

1950లో 'జమీందారీ' విధానాన్ని రద్దు చేసిన తర్వాత, తంగైల్‌లోని మీర్జాపూర్‌కు చెందిన రే బహదూర్ రణదా ప్రోసాద్ షాహా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి విస్తృతమైన మద్దతు, ఆర్థిక సహాయం అందించాడు.

పాకిస్థాన్ తో యుద్ధం 1971లో ప్రారంభమైంది. ఈ గంభీరమైన చారిత్రాత్మక రథాన్ని పాకిస్తాన్ సైన్యం దహనం చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తరువాత, సంవత్సరానికి ఒకసారి జరువుకునే రథోత్సవ పండుగ సంప్రదాయాన్ని కొనసాగించడానికి, శ్రీ సాహా, శ్రీమతి జోయా పతి, జస్టిస్ దేబేష్ భట్టాచార్య, గౌరో గోపాల్ సాహా, ఠాకూర్ గోపాల్ కుమార్తెల సహకారంతో వెదురుతో తాత్కాలిక రథం నిర్మించబడింది.

ప్రస్తుత రథం[మార్చు]

2006 సంవత్సరంలో అప్పటి బంగ్లాదేశ్‌లోని భారత హైకమీషనర్ శ్రీమతి బినా సిక్రి కొత్త రథాన్ని నిర్మించడంలో ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చింది. తత్ఫలితంగా, 2010లో మూడు అంతస్తుల రథం నిర్మించబడింది. ఈ కొత్త రథం 27 అడుగుల పొడవు, అదే వెడల్పుతో ఉంది. ఇది 15 చక్రాలను కలిగి, వివిధ దేవుళ్ళ, దేవతల విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. ధామ్ రాయ్లోని స్థానిక ప్రజల రథ కమిటీ, Mr. R.P. సాహా కుమారుడు శ్రీ. రాజీబ్ సాహాతో ప్రధాన పోషకుడిగా, ఈ వార్షిక పండుగను నిర్వహిస్తోంది.

ఈ రథ యాత్ర మాధవ్ ఆలయం నుండి గోప్ నగర్ ఆలయం వరకు కొనసాగుతుంది, ఇది అత్తమామల ఇల్లుగా పరిగణించబడుతుంది, ఈ రెండిటి మధ్య అర కిలోమీటరు దూరం ఉంటుంది. పండుగ సందర్భంగా, భక్తులు రథాన్ని తాళ్లతో లాగి గోప్ నగర్ ఆలయానికి తీసుకువస్తారు. ఒక వారం తర్వాత రథం మళ్లీ మాధవ్ మందిర్‌కు లాగబడుతుంది, దీనిని "ఉల్టో రథ్" (తిరుగు ప్రయాణం) అని పిలుస్తారు.

రథోత్సవం[మార్చు]

రథోత్సవం లేదా రథ మేళా (রথ মেলা), బెంగాలీ క్యాలెండర్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది బెంగాలీ నెల ఆశాఢం (আষাঢ়) లో జరుగుతుంది. చంద్రుని రెండవ త్రైమాసికంలో తేదీ నిర్ణయించబడుతుంది. సాధారణంగా, జూన్ లో ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఇది జూలైలో కూడా జరుగుతుంది. ఈ సమయాల్లో ధామ్ రాయ్ ప్రధాన రహదారి వెంబడి వేడుకలు జరుగుతాయి.[2]

వివిధ రకాల ఉత్పత్తుల విక్రయం కోసం ఏర్పాటు చేయబడిన వివిధ స్టాల్స్‌తో పాటు, అన్ని వర్గాల, మత విశ్వాసాలకు అతీతంగా ప్రజలకు వినోదాన్ని అందించడానికి సర్కస్, తోలుబొమ్మ ప్రదర్శనలు కూడా జరుగితాయి.

మూలాలు[మార్చు]

  1. "Rathajatra festival today". The New Nation, Dhaka – via HighBeam Research (subscription required) . 24 June 2009. Archived from the original on 24 September 2015. Retrieved 3 September 2012.
  2. 2.0 2.1 Mandal, Paresh Chandra (2012). "Rathayatra". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.