నబకిశోర్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నబకిశోర్ దాస్
నబకిశోర్ దాస్


ఎమ్మెల్యే: 14వ ఒడిశా శాసనసభ, 15వ ఒడిశా శాసనసభ, 16వ ఒడిశా శాసనసభ
ముందు కిషోర్ కుమార్ మొహంతి
నియోజకవర్గం ఝార్సుగూడా

వ్యక్తిగత వివరాలు

జననం 1962 జనవరి 7
మరణం 2023 జనవరి 29(2023-01-29) (వయసు 61)
భువనేశ్వర్
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు నర్సింహ చరణ్ దాస్ (తండ్రి)
జీవిత భాగస్వామి మినిటీ దాస్
వృత్తి రాజకీయ నాయకుడు

నబకిశోర్ దాస్ (1962 జనవరి 7 - 2023 జనవరి 29) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన 2009, 2014, 2019లో వరుసగా ఝూర్సుగూడ శాసనసభ నియోజకవర్గం నుండి 14వ, 15వ, 16వ ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

నబకిశోర్ దాస్ ఒడిశా రాజకీయాల్లో బిజు జనతా పార్టీ నాయకుడు. అంతకుముందు భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన ఉన్నాడు. వరుసగా మూడవసారి 16వ ఒడిశా శాసనసభకు కూడా ఎన్నికయిన ఆయన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు.

మరణం[మార్చు]

2023 జనవరి 29న ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో నబకిశోర్ దాస్ పై గోపాలచంద్ర దాస్ అనే పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలకు గురైన ఆయనను భువనేశ్వర్ తరలించి అపోలో ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించినా కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ నబకిశోర్ దాస్ మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.[1]

మూలాలు[మార్చు]

  1. "ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత". Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

రాజకీయ జీవితం[మార్చు]

దాస్ ఒడిశా రాజకీయాల్లో బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. అంతకుముందు, అతను భారత జాతీయ కాంగ్రెస్‌లో ఉన్నాడు. నబా దాస్ 62,663 ఓట్లతో 14వ ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు. [1] ఆ తర్వాత అతను తన రెండవసారి 15వ ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. [2] [3] అతను వరుసగా మూడవసారి 16వ ఒడిశా శాసనసభకు కూడా ఎన్నికయ్యాడు. [4] [5] మరణించే సమయానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

  1. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 2 January 2014. 22516
  2. "Reports on Election 2014 - See page no. 124, archived on" (PDF). 6 June 2017. Archived from the original (PDF) on 6 June 2017. Retrieved 19 February 2019.
  3. "CEO ODISHA". archive.is. 19 February 2019. Archived from the original on 19 February 2019. Retrieved 19 February 2019.
  4. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.