నరవర్మను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నరవర్మను
Nirvana-Narayana
Pillar in the Bijamaṇḍal, Vidisha with an inscription of Naravarman
King of Malwa
Reignసుమారు 1094 –  1130 CE
PredecessorUdayaditya; possibly Lakshmadeva
SuccessorYashovarman
రాజవంశంParamara

నారావర్మను సంబంధిత శాసనాలు ఉదయపూరు సమీపంలోని అమెరా (సా.శ. 1093–1095), దేవాసు (సా.శ.1094), భోజపూరు (సా.శ. 1100–1101), నాగ్పూరు (సా.శ. 1104-05), విదిషా (తేదీలేని) వద్ద కనుగొనబడ్డాయి. కదంబపద్రకా (సా.శ. 1110) వద్ద మరో శాసనం జారీ చేయబడింది. బొంబాయి నివాసి వద్ద ఉంది. హెచ్. వి. త్రివేది కదంబపద్రకాను ఉజ్జయిని సమీపంలోని కమలిఖేడి (లేదా కామలియఖేడి) గ్రామంగా గుర్తిస్తుంది.

ఆరంభకాల జీవితం[మార్చు]

నరవర్మను పరామరా రాజు ఉదయాదిత్య కుమారుడు. పరామారా శాసనాలు నరవర్మను, ఆయన సోదరుడు లక్ష్మదేవుడి సైనిక పోరాటాలు, దానధర్మాలను వివరిస్తాయి. కాని లక్ష్మదేవ ఎప్పుడూ సింహాసనాన్ని అధిరోహించలేదు. ఉదయాదిత్య తరువాత నరవర్మను సింహాసనం అధిష్టించాడని దేవాసు గ్రాంటు శాసనం సూచిస్తుంది. 1082 కి కొంతకాలం ముందు లక్ష్మదేవ మరణించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సా.శ. 1082 లో కామెడు శాసనం తన సోదరుడి జ్ఞాపకార్థం నరవర్మను చేసిన భూమి మంజూరును నమోదు చేసింది. [1]

సైనికవృత్తి[మార్చు]

తరువాతి పరామరా శాసనాలు కొన్ని నరవర్మనును దిగ్విజయ ("అన్ని దిశలలోనూ జయించడం") పోరాటాన్ని చేపట్టిన గొప్ప సైనిక నాయకుడిగా చిత్రీకరిస్తాయి.[1] ఉదాహరణకు మాళ్వాలోని ఒక ఖరారు చేయబడిన శాసనం నిర్వాణ-నారాయణ (నరవర్మను బిరుదు) ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన మలయాచలం పశ్చిమాన ద్వారకా వరకు భూభాగాలను స్వాధీనం చేసుకుని రాజ్యవిస్తరణ చేసినట్లు పేర్కొంది.[2] ఇటువంటి వర్ణనలు సాంప్రదాయిక కవితా ప్రగల్భాలుగా భావించబడుతున్నాయి: వాస్తవానికి, నరవర్మను అనేక ఇతర రాజులచే ఓడించబడ్డాడు. తన సొంత సహచరుల తిరుగుబాట్లను కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఆయన పాలనలో పరామరా-నియంత్రిత భూభాగం గణనీయంగా తగ్గింది.[1]

మాళవలోని పరామరా భూభాగానికి ఈశాన్యంగా భూభాగాన్ని పరిపాలించిన చందేలాలతో చేసిన పోరాటంలో నరవర్మను ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. సమకాలీన చందేలారాజు సల్లక్షనవర్మను"మాళవుల రాజ సంపదను కొల్లగొట్టినట్లు" పేర్కొన్నాడు.[1]

ఆయన శాకంభరి చాహమానాలకు వ్యతిరేకంగా ఓటమిని చవిచూశాడు. యుద్ధంలో చాహమాన రాజు రెండవ అజయరాజు నరవర్మను సైన్యాధ్యక్షుడు సోలానాను స్వాధీనం చేసుకున్నాడు. నరవర్మను సామంతులైన చాచిగా, సింధులా, యశోరాజా అనే ముగ్గురు ప్రముఖ యోధులను కూడా అజయరాజు చంపాడు.[3][4]

అజయరాజు కుమారుడు అర్నోరాజా నిర్వాణ-నర్యానాను (అంటే నరవర్మను) అవమానించాడని బిజోలియా శిలాశాసనం పేర్కొనాది. యువరాజుగా నరవర్మనుకు వ్యతిరేకంగా తన తండ్రి చేసిన పోరాటంలో అజయరాజా పాల్గొనడనడానికి ఇది సూచన కావచ్చు. .[5]

పశ్చిమాన గుజరాతు పొరుగు ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యుల తల్వాడ శాసనం, వారి రాజు జయసింహ "నరవర్మను అహంకారాన్ని అణగదొక్కాడు" అని పేర్కొన్నాడు.[1] ఈ పోరాటంలో జయసింహకు తన నద్దుల చాహమన పాలెగాడు ఆశారాజా సహాయం అందించినట్లు తెలుస్తోంది. ఆశారాజా వారసుడు అల్హానా నానా శాసనం ఆశారాజా పరామరా రాజధాని ధారా వద్దకు వచ్చినప్పుడు, నరవర్మను కోటలో దాక్కున్నాడు. మాళవాలోని పరమారా భూభాగంలో ఆశారాజా సహాయంతో జయసింహ సంతోషించినట్లు సుంద కొండ శాసనం పేర్కొంది.[6]

సోమేశ్వర, జినమండనగని, జయసింహ సూరి వ్రాసిన వృత్తాంతాల చాళుక్యరాజు నరవర్మనును జైలులో పెట్టాడు. ఏది ఏమయినప్పటికీ హేమచంద్ర, అరిసింహ, మేరుతుంగా వంటి ఇతర చరిత్రకారులు చాళుక్యరాజు నరవర్మను వారసుడైన యశోవర్మనును జైలులో పెట్టారని పేర్కొన్నారు.[7] చాళుక్య-పరామరా యుద్ధం బహుశా నరవర్మను పాలనలో ప్రారంభమై యశోవర్మను పాలనలో ముగిసింది.[8]

సా.శ. 1133-34లోని ఇంగోడా శాసనం ఉజ్జయినికి ఈశాన్యంగా ఒక స్వతంత్ర రాజ్యం ఉందని సూచిస్తుంది. దాని పాలకుడు విజయపాల మహారాజాధిరాజా-పరమేశ్వర అనే బిరుదును కలిగి ఉన్నాడని పేర్కొన్నది. నరవర్మను పాలన ముగిసే సమయానికి పరామరాలు ఈ ప్రాంతం మీద నియంత్రణ కోల్పోయారని ఇది సూచిస్తుంది.[9]

సంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

Coin of Naravarman. Goddess Lakshmi seated facing / Devanagari legend.[10]

నరవర్మను ఒక కవి ఆయన పూర్వీకులు వివిధ దేవతలకు ప్రశంసలకు కీర్తనలు రూపకల్పన చేశాడు. నాగపూరు ప్రశస్తి ఆయన స్వరపరిచారు.[11] ఆయన ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని పునరుద్ధరించాడు. దేవత గౌరవార్థం ఒక శ్లోకాన్ని రచించాడు.[12] ఆయన విదిషా వద్ద ఒక ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాని దానిని పూర్తి చేయలేకపోయాడు. బహుశా సైనిక పరాజయాలు, తిరుగుబాట్ల కారణంగా.[1]

నరవర్మను జారీ చేసిన నాణేలలో బంగారం (5.2 గ్రా), వెండి (2.9 గ్రా), రాగి నాణేలు (ఇండోర్‌లో కనుగొనబడ్డాయి) ఉన్నాయి.[13][14].

రాజతరంగిని ఆధారంగా తిరుగుబాటు నుండి తప్పించుకున్న కాశ్మీరీ యువరాజు భిక్షచరకు నరవర్మను ఆశ్రయం ఇచ్చాడు. ఆయన వద్ద తన సస్వంత కొడుకులాగే భిక్షచరా పెరిగాడు. నరవర్మను వద్ద రాకుమారుడు బిక్షచర ఆయుధాలు, శస్త్రాల వాడకంలో శిక్షణ పొందాడు.[15]

శిలాశాసనాలు[మార్చు]

నరవర్మను శాసనాలు ఉదయపూరు సమీపంలోని అమెరా (సా.శ. 1093–1095), దేవాస్ (సా.శ.1094), భోజుపూరు (సా.శ. 1100–1101), నాగ్పూరు (సా.శ. 1104-05), విదిషా (తేదీలేని) వద్ద కనుగొనబడ్డాయి. కదంబపద్రక (సా.శ. 1110) వద్ద మరో శాసనం జారీ చేయబడింది. ఇది బొంబాయి నివాసితుడి ఆధీనంలో ఉంది. హెచ్. వి. త్రివేది కదంబపద్రకను ఉజ్జయిని సమీపంలోని కమలిఖేడి (లేదా కామలియఖేడి) గ్రామంగా గుర్తిస్తున్నారు.[16]

మూలాలు[మార్చు]

గ్రంధసూచిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నరవర్మను&oldid=3914029" నుండి వెలికితీశారు