Jump to content

నరేష్ బేడి

వికీపీడియా నుండి
నరేష్ బేడి
The Chairman, International Competition Jury, Shri Goutam Ghose briefing the media, at the 41st International Film Festival (IFFI-2010), in Panjim, Goa on November 29, 2010.jpg
జననం
హరిద్వార్, ఉత్తరాఖండ్, భారతదేశం
వృత్తిచిత్రకారుడు, చిత్ర నిర్మాత
పిల్లలురంజనా, రాజీవ్ బేడి, అజయ్ బేడి
విజయ్ బేడి
తల్లిదండ్రులుడా. రమేష్ బేడీ
పురస్కారాలుపద్మశ్రీ
పాండా పురస్కారం
ఎర్త్ వాచ్ పురస్కారం

నరేష్ బేడి భారతీయ చిత్రకారుడు[1], చిత్ర నిర్మాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత.[2] బేడీ కుంటుంభంలోని మూడు తరాలు వన్యప్రాణి ఫోటోగ్రాఫర్స్, చిత్ర నిర్మాతలు. వారిలో రెండవ తరానికి చెందిన వాడు నరేష్ బేడీ. [3] వైల్డ్ స్క్రీన్ పండా పురస్కారం పొందిన మొదటి ఆసియా వాసిగా గుర్తించబడ్డాడు.[4] [5] బ్రిటిష్ అకాడమీ ఫిల్ం అవార్డ్స్ కు నామినేట్ అయిన మొదటి భారతీయునిగా గుర్తింపు పొందాడు.[6] భారతదేశ నాల్గవ పొర పురస్కారం పద్మశ్రీని 2015 లో అందుకున్నాడు.[7]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

నరేష్ బేడీ ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జన్మించాడు[8]. వన్యప్రాణుల ఫోటోగ్రాఫ అయిన ఇతని తండ్రి రమేష్ బేడీ 74 పుస్తకాల రచయిత[9].

ఈయన తన ఆసక్తిని, తన సోదరుడు అయినటువంటి రాజేష్ బేడితో కలిసి తన తండ్రి సమర్పించిన రోలీకార్డ్ కెమెరాతో ఆసక్తిని పెంచుకున్నారు[9]. తన 19వ ఏట ఎగ్జిబిషన్ పర్యటనకు వచ్చిన జవహర్‌లాల్ నెహ్రూ ఫోటో కవరేజ్ చేసాడు. ఈయన పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. ఈయన న్యూ ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలని కవరేజ్ చేసాడు. ఈ కవరేజ్ ని దూరదర్శన్ ఛానల్ US $ 1800 కు కొనుగోలు చేసింది. ఈయన 1970 లో తన సోదరుడితో కలిసి నేషనల్ జియోగ్రాఫిక్, స్టెర్న్, జియో కోసం కోబ్రా - ది స్నేక్ గాడ్ అనే సినిమా తీసే ముందు అనేక ప్రాజెక్టులను చిత్రీకరించాడు. ఈ ప్రాజెక్టును బిబిసి, డిస్కవరీ ఛానల్ కొనుగోలు చేసింది. ఈయన అనేక అరుదైన వన్యప్రాణుల చిత్రాలను మొదటిసారి ఘారియల్స్ పునరుత్పత్తి, నర్సింగ్, బహుళ సంభోగం, పులులను చిరుతపులి వేట, బార్-హెడ్ పెద్దబాతులు పెంపకం వాటి పై చిత్రికరించాడు. ఈయన టిబెటన్, భారతీయ అడవి కుక్కలు (ధోల్స్), హిమాలయన్ లింక్స్, మంచు చిరుతపులులను మొదటిసారి చిత్రీకరించాడు.

పురస్కారాలు

[మార్చు]

ఈయన నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క ఎర్త్ వాచ్ పురస్కారం, ఈస్ట్మన్ కోడాక్ పురస్కార గ్రహీత. ఈయన చిత్రీకరించిన ఆసియన్ ది గంగా ఘరియల్ అనే డాక్యుమెంటరీ సినిమాటోగ్రఫీ కి 1984 లో గ్రీన్ ఆస్కార్‌గా పేరుగాంచిన వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం లభించింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కోసం నామినేషన్ అందుకున్న మొదటి భారతీయుడిగా ఉన్నాడు. ఈయనకు 2005 లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం పృథ్వరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈయన ఎర్ర పాండా పరిరక్షణపై చిత్రీకరించిన మొదటి చిత్రం చెరుబ్ ఆఫ్ ది మిస్ట్ కు మూడు క్లాసిక్ టెలీ పురస్కారాలు, వైల్డ్ స్క్రీన్ పాండా పురస్కారం, అంతర్జాతీయ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం, వైల్డ్‌లైఫ్ ఆసియా పురస్కారం, అంతర్జాతీయ వైల్డ్ ట్రాక్ ఆఫ్రికా పురస్కారాలను పొందాడు. వన్యప్రాణుల చిత్రాలకు ఈయన చేసిన కృషికి సింగపూర్‌లోని వైల్డ్‌లైఫ్ ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో వేల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2015 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[10]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారంను అందుకున్న మొట్టమొదటి ఆసియన్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ పురస్కారాలకు నామినేట్ అయినా మొదటి భారతీయుడు. ఈయన కుమారులు, అజయ్ బేడి, విజయ్ బేడి లు కూడా మూడవ తరం చిత్రనిర్మాతలుగా ఉన్నారు. 28 వ ఎమ్మీ అవార్డులకు ఎడిటింగ్ విభాగంలో నామినేట్ అయ్యారు. 2004 లో వీరి చిత్రం ది పోలీసింగ్ లంగూర్ వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Wild Film History". Wild Film History. 2015. Retrieved 17 February 2015.
  2. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 26 జనవరి 2015. Retrieved 2 జనవరి 2020.
  3. "India Today". India Today. 30 September 1994. Retrieved 17 February 2015.
  4. Naresh Bedi (5 December 2005). "Hindustan Times - Interview". News report (Interview). Interviewed by Sudeshna B. Baruah. Archived from the original on 18 February 2015. Retrieved 17 February 2015.
  5. "Ganges Garial". Wild Film History. 2015. Retrieved 17 February 2015.
  6. "The New Indian Express". The New Indian Express. 18 June 2009. Archived from the original on 18 ఫిబ్రవరి 2015. Retrieved 18 February 2015.
  7. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.
  8. Naresh Bedi (5 December 2005). "Hindustan Times - Interview". News report (Interview). Interviewed by Sudeshna B. Baruah. Archived from the original on 18 February 2015. Retrieved 17 February 2015.
  9. 9.0 9.1 "India Today". India Today. 30 September 1994. Retrieved 17 February 2015.
  10. "Awards". Bedi Brothers. 2015. Archived from the original on 18 ఫిబ్రవరి 2015. Retrieved 2 January 2020.

బాహ్య లంకెలు

[మార్చు]