నల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నల్లి
Cimex lectularius
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Cimicidae

Kirkaldy, 1909
Genera & Species

Genus Cimex

Genus Leptocimex

Genus Haematosiphon

Genus Oeciacus

నల్లులు (ఆంగ్లం Bed bugs) దోమలాగా రక్తాహార కీటకాలు. ఇవి విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో లభించే నల్లి శాస్త్రీయ నామం 'సెమెక్స్ రొటండస్'. ఐరోపా, అమెరికా దేశాలలో ఉండే నల్లిని 'సిమెక్స్ లెక్ట్యులేరియస్' అంటారు.

నల్లులలో గుచ్చి పీల్చే రకమైన ముఖ భాగాలుంటాయి. ఇవి మానవుడి మీద బాహ్య విరామ పరాన్న జీవులుగా బతుకుతాయి. ఇది నిశాచర కీటకాలు. పగటిపూట ఇవి గృహోపకరణాల నెర్రెలలో, బల్లలు, సీట్ల పగుళ్ళలో దాగి ఉంటాయి. దేహాలు పృష్టోదరాల తలాల్లో చదునుగా ఉంటుంది. వీటిలో ముందు చెక్కలు క్షీణించి ఉంటాయి. వీటిని 'హెమీ ఎలిట్రా' అంటారు. వెనుక రెక్కలు లేవు. దుర్గంధ గ్రంథులు మధ్య వక్షం యొక్క ఉదర తలంలో కాళ్ళ మూల భాగంలో ఉంటాయి. ఒక్కసారి మానవ రక్తాన్ని పీల్చుకొంటే మళ్ళీ కొన్ని నెలలు ఆహారం గురించి పట్టించుకోదు. నల్లికి ఆహారం లభించకపోతే అది స్వజాతి భక్షణకు దిగుతుంది. ఇది బొద్దింక మాదిరిగా హెమీమెటాబోలస్ కీటకం. దీనిలో అసంపూర్ణ రూపవిక్రియ జరుగుతుంది. అండాలనుంచి సరూప శాభకాలనే దశ ఏర్పడుతుంది. సరూప శాబకాలు అధిక సార్లు నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢ దశను చేరతాయి.

రిలాప్సింగ్ జ్వరం, టైఫస్ జ్వరం, ట్రెంచ్ జ్వరం, ప్లేగు కుష్టు వ్హాధులను కలిగించే వ్యాధిజనక జీవులకు నల్లి వాహక జీవిగా పనిచేస్తుంది.

నల్లుల నివారణ చర్యలు[మార్చు]

ఈ క్రింది చిట్కా ద్వారా నల్లులను తేలికగా నివారించవచ్చు [1].

కావలసినవి: ఉల్లిపాయ సగం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు కప్పుల నీరు, రెండు చెంచాల మిరియాల పొడి, సగం చెంచాడు ద్రవ రూపంలో ఉన్న గిన్నెల సబ్బు, గరాటు, స్ర్పే బాటిల్‌, పాత నైలాన్‌ వస్త్రం.

తయారీ విధానం: ఒక గిన్నెలో ఉల్లిపాయ, వెల్లుల్లి, నీరు, మిరియాల పొడి, గిన్నెలని కడిగే సబ్బు తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి నైలాన్‌ వస్త్రం సహాయంతో వడపోయాలి. ఇలా వేరుచేసుకున్న ద్రావణాన్ని గారాటు ద్వారా స్ర్పే బాటిల్‌లో పోసుకోవాలి. నల్లులు ఎక్కువగా కనపడే ప్రదేశాలలో ఈ ద్రవాన్ని చల్లితే ఇట్టే మాయవుతాయి. అడల్ట్ బెడ్ బగ్స్ చదును ముదురు గోధుమ, Oval ఆకారంలో కాంతి గోధుమ, ఏ హింద్ రెక్కలు. ముందు రెక్కలు విసర్జిత శేషాలు, ప్యాడ్ వంటి నిర్మాణాల తగ్గించారు. బెడ్ దోషాలు వాటిని ఒక గుంపుగా రూపాన్ని ఇవ్వాలని సూక్ష్మతో పొట్టలు పరిచ్ఛేద చేశారు. పెద్దలు 4-5 మిల్లీమీటర్ల (లో 0.16-0.20) పొడవు, 1.5-3 మిల్లీమీటర్ల వెడల్పు (0.059-0.118 లో) కు పెరుగుతాయి.

కొత్తగా పొదిగిన నిమ్ప్స్ రంగులో తేలికగా, అపారదర్శక, వారు వంటి బ్రోనేర్ మారింది, పరిపక్వతకు చేరుకుంటాయి. కేవలం ఒక రక్త భోజనం తిన్న ఏ వయస్సు ఒక మంచం బగ్ వనదేవత తరువాత అనేక గంటల పైగా గోధుమ రంగు, ముదురు ఎరుపు అపారదర్శక ఉదరం ఉంది, రెండు రోజుల్లో అపారదర్శక బ్లాక్ క్రిమి దాని భోజన వంటి. బెడ్ దోషాలు అటువంటి చిన్న బొద్దింకలు, లేదా కార్పెట్ బీటిల్స్ వంటి ఇతర కీటకాలు, పొరపాటున ఉండవచ్చు; వెచ్చని, క్రియాశీల వారి ఉద్యమాలు చాలా ఇతర నిజమైన దోషాలు వంటి, మరింత చీమల వంటి, ఉన్నప్పుడు చూర్ణం, అయితే, వారు ఒక లక్షణం డిజ్ఎగ్రియబుల్ వాసన విడుదల చేస్తాయి..[2]

బెడ్ దోషాలు, గూడు స్థానాలు సంబంధించి తినే, పునరుత్పత్తి కమ్యూనికేట్ ఫేరోమోన్స్, ఉపయోగించండి.

మూలాలు[మార్చు]

  1. "ఇలా చేస్తే నల్లులు మాయం". andhrajyothy.com. 24 April 2015. Retrieved 25 April 2015.[permanent dead link]
  2. "ఇలా నల్లులు". howtogetridofbedbugsbitespictures.com. 24 April 2015. Archived from the original on 8 సెప్టెంబరు 2015. Retrieved 25 April 2015.
  • Forsyth, Adrian. A Natural History of Sex: The Ecology and Evolution of Mating Behavior. Richmond Hill, Ontario: Firefly Books, 2001. ISBN 1-55209-481-2.
  • Goddard, Jerome A. The Physician’s Guide to Arthropods of Medical Importance (second edition). Boca Raton, Florida: CRC Press, 1993. ISBN 0-8493-5160-X.
  • MacQuitty, Miranda, and Lawrence Mound. Megabugs: The Natural History Museum Book of Insects. New York: Random House Children's Books, 1995. ISBN 1-898304-37-8, ISBN 1-85868-045-X.
  • Quammen, David. The Flight of the Iguana: A Sidelong View of Science and Nature. New York: Delacorte Press, 1988. ISBN 0-385-29592-8, ISBN 0-385-26327-9, ISBN 0-684-83626-2. Provides detail about Xylocaris maculipennis.
  • Smithereen Pest Control (Chicago, Illinois), employees of. Personal interviews. August 2005. (Used for semi-rewrite.)
  • Martin Leverkus, Ryan C. Jochim, Susanne Schad et al. Bullous allergic hypersensitivity to bed bug bites mediated by IgE against salivary nitrophorin. J. Invest. Dermatol. (2006) 126, 91-96.
"https://te.wikipedia.org/w/index.php?title=నల్లి&oldid=3849282" నుండి వెలికితీశారు