Jump to content

నల్ల జాతీయత్వం

వికీపీడియా నుండి


నల్ల జాతీయత్వం అనేది ఒక జాతి యొక్క గుర్తింపును ప్రబోధిస్తుంది. అనేకమైన స్థానిక జాతీయతల తాత్త్వికతలు ఉన్నా, అన్ని నల్ల జాతీయతల సిద్ధాంతాలూ ఐక్యత, స్వంత గుర్తింపులు, అంటే యూరోపియన్ సమాజాల నుంచి విభజన, లేదా స్వాతంత్ర్యం కోరుతుంది. మార్టిన్ డెలనీ అనే నాయకుడు నల్ల జాతీయతా  పితామహునిగా వ్యవహరింపబడ్డారు.

హైటియన్ విప్లవం విజయం సాధించడంతో 19వ శతాబ్దంలో మార్కస్ గార్వే, హెన్రీ మాక్నీల్ టర్నర్, మారిటన్ డెలనీ, హెన్రీ హైలాండ్ గార్నెట్, ఎడ్వర్డ్ విల్మట్ బ్లిడిన్, పాల్ కాఫ్ వంటి వారి కృషితో రాజకీయంగా నల్ల జాతీయులు, ఆఫ్రికా జాతీయవాదం తెరపైకి వచ్చాయి.  నల్లా జాతీయవాద నేపథ్యంలో 19వ శతాబ్దంలో అమెరికాలోని  ఆఫ్రికా  బానిసలను  తిరిగి వారి స్వదేశాలైన లిబీరియా, సైర లియోన్ లకు తరలించారు. 1910 నుండి 1920ల వరకు మార్కస్ గార్వే స్థాపించిన యూనివర్శల్ నీగ్రో ఇంప్రూవ్ మెంట్ సొసైటీ నల్ల జాతీయిల హక్కుల పోరాటంలో కీలకమైన పాత్ర పోషించింది. ఆ కాలంలో ఈ సొసైటీలో 11 మిలియన్ సభ్యులు ఉండేవారు.

విల్సన్ జెరెమై మోసెస్ తన ప్రముఖ పుస్తకం క్లాసికల్ బ్లాక్ నేషనలిజంలో నల్లా జాతీయత్వాన్ని గురించి అవగాహన చేసుకోవాలంటే  3 వివిధ సమయాల్లోని నల్ల జాతీయవాదాన్ని పరిశీలిస్తే దాని గురించి వివిధ సైద్ధాంతిక కోణాల్లో దృక్పధం పెరుగుతుందని అంటారాయన.

నల్ల జాతీయవాదానికి ముందు నుంచి మొదటిసారి ఆఫ్రికన్లను అమెరికన్లు బానిసలుగా తీసుకువెళ్లాకా వచ్చిన మొదటి విప్లవ సమయం వరకు మొదటి దశగా పరిగణిస్తారు. రెండో దశ విప్లవ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి కాలనీల్లో ముఖ్యంగా న్యూ ఇంగ్లాండ్, పెన్సైల్వనియాల్లోని  ఆఫ్రికా విద్యావంతులు సమాజంలో ఆఫ్రికన్లపై జరుగుతున్న అసమానతల గురించి ఆలోచించే సమయాన్ని రెండవ పరిణామ సమయంగా పరిగణిస్తారు. ఆ సమయంలోనే చారిత్రిక ప్రాముఖ్యత సంపాదించుకున్న ప్రిన్స్ హాల్, రిచర్డ్ అల్లెన్, అబ్సలం జోన్స్ వంటి వారు కొన్ని ఆఫ్రికన్ సొసైటీలను ప్రారంభించారు. ఈ సొసైటీలు లాడ్జ్ లు, చర్చ్ లు స్థాపించాయి. ఈ సంస్థలు వ్యక్తిగత పరిణితికీ, వేరే సంస్థల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించాయి. 

నల్ల జాతీయవాదంలో మూడవ దశ పునర్నిర్మాణ యుగంతో మరీ ముఖ్యంగా ఆఫ్రికా-అమెరికా క్రైస్తవ మతాధికారుల మధ్య వైషమ్యాలతో ప్రారంభమయింది. ఆఫ్రికన్లు అనుభవించిన బానిసత్వానికి వ్యతిరేకంగా  క్రైస్తవ మతాధికారుల వృత్తాలు అప్పటికే విడిపోయి, ప్రజల ఆమోదాన్ని పొందాయి. ఆ సమయంలో  అమెరికాలో జిం క్రో చట్టాలు అమలులో ఉండేవి. ఈ బలవంతపు బానిసత్వం వల్ల ఆధునిక నల్ల జాతీయవాదం  తెరపైకి వచ్చింది. తమ జాతి మర్యాదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో  ఈ దశలో నల్ల జాతీయులు కానివారు విడిపోయి,  కొత్త కమ్యూనిటీలను నిర్మించుకున్నారు. ఈ పరిణామాల వల్ల మూరిష్ సైన్స్ టెంపుల్, ఇస్లామ్ జాతీయత వంటి కొత్త రకపు సిద్ధాంతాలు బయలుదేరాయి. 1960లలో మత, సాంస్కృతిక, రాజకీయ జాతీయవాదం ముందుకు వచ్చింది. కానీ నల్ల జాతీయవాదం మాత్రం ఆఫ్రోసెంట్రిజమ్ అనే సాంస్కృతిక సిద్ధాంతాలను ప్రచారం చేస్తూనే ఉంది. నల్ల జాతీయవాదుల సంస్కృతిని ఆఫ్రోసెంట్రిజమ్ కాపాడుతుంటుంది.

నేపథ్యం

[మార్చు]

మార్కస్ గార్వే

[మార్చు]

మార్కస్ గార్వే ప్రపంచంలోని అందరు నల్లజాతీయులను తమ సంస్కృతిలోని  అందాన్ని గుర్తించాలని, నల్ల జాతీయులుగా ఉండడానికి గర్వపడాలి అంటూ పిలుపునిచ్చారు.

References

[మార్చు]