నవంబర్ స్టోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవంబర్‌ స్టోరీ
November Story Poster.png
తరంక్రైమ్ థ్రిల్లర్
రచయితఇంద్రా సుబ్రమణియన్‌
దర్శకత్వంఇంద్రా సుబ్రమణియన్‌
తారాగణంతమన్నా
Composerశరణ్ రాఘవన్
దేశం భారతదేశం
అసలు భాషతమిళ్
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
ఛాయాగ్రహణంవిధు అయ్యన్న
ఎడిటర్శరణ్ గోవిందస్వామి
నడుస్తున్న సమయం30 - 52 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఆనంద వికటన్‌
డిస్ట్రిబ్యూటర్స్టార్ ఇండియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
చిత్రం ఫార్మాట్హెచ్.డి.టివి 1080పి
ఆడియో ఫార్మాట్స్టీరియోఫోనిక్
వాస్తవ విడుదల2021 మే 20 (2021-05-20)[1]
బాహ్య లంకెలు
Website

నవంబర్‌ స్టోరీ తమిళంలో విడుదలైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌. తమన్నా, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ కు ఇంద్రా సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించగా, 2021 మే 20న డిస్నీ ప్లస్‌ – హాట్‌స్టార్‌ లో విడుదలైంది.

కథ[మార్చు]

గణేశన్‌ (జి.ఎం. కుమార్‌) పేరొందిన క్రైమ్‌ నవలల రచయిత. ఆయన కూతురు అనూరాధ (తమన్నా). తండ్రికి అల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందని, అది ముదురుతోందనీ ఆమెకు తెలుస్తుంది. ఆయన వైద్యానికి డబ్బు కోసం పాత ఇల్లు అమ్మాలనుకుంటుంది. అల్జీమర్స్‌ తో మొత్తం జ్ఞాపకాలన్నీ చెరిగిపోకముందే ఇంకొక నవల రాయాలనుకుని గణేశన్, కూతురి సాయం కోరతాడు.

మరోవైపు హీరోయిన్, ఆమె స్నేహితుడు రాష్ట్రం క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలోని కేసులన్నిటినీ డిజిటైజు చేసే పనిలో ఉంటారు. ఆ సమయంలోనే సర్వర్‌ లో ఒక ఫోల్డర్‌ఉను ఎవరో హ్యాక్‌ చేస్తారు. ఇదిలా ఉండగా ఓ స్త్రీ, తాము అమ్మదలుచుకున్న పాత ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను అంతకుముందు హీరోయిన్‌ లోకల్‌ ట్రైన్‌లో చూస్తుంది. హతురాలి పక్కనే ఉన్న తన తండ్రిని ఆ కేసు నుంచి తప్పించాలని హీరోయిన్‌ ప్రయత్నిస్తుంది. గణేశన్ చివరి నవలకూ, ఈ హత్యకూ సంబంధం ఏమిటనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

 • తమన్నా - అనురాధ
 • పశుపతి - డాక్టర్‌ యేసు
 • జి.ఎం. కుమార్‌ - గణేశన్
 • వివేక్‌ ప్రసన్న - మలర్ వణ్ణన్
 • అరుళ్‌ దాస్‌ - పోలీస్‌ ఎస్సై సుడలై
 • సూపర్ గుడ్ సుబ్రమణి
 • మైనా నందిని - చిత్ర
 • తరణి సురేష్ కుమార్
 • అర్షత్ ఫెరస్ - బిజూ
 • కె.పూరణేష్ - అహ్మద్
 • పూజిత దేవరాజు - నీతా
 • నమిత కృష్ణమూర్తి - మతి
 • నిశాంత్ నాయుడు - సందీప్
 • జానకి సురేష్

మూలాలు[మార్చు]

 1. Hotstar Specials November Story Official Trailer | Tamannaah, Pasupathy, GM Kumar | 20th May (in ఇంగ్లీష్), retrieved 2021-05-06
 2. Sakshi (22 May 2021). "తమన్నా 'నవంబర్‌ స్టోరీ' వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Sakshi. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.