నాగభైరు అప్పారావు
Jump to navigation
Jump to search
లండన్‌లో నేత్ర వైద్యుడిగా స్థిరపడ్డారు. చిలకలూరిపేట మండలంలోని నాగభైరువారిపాలెంలో జన్మించారు.తల్లిదండ్రులు గోవిందమ్మ, సాంబయ్య. ఉన్నత పాఠశాల విద్యను చిలకలూరిపేట ఆర్‌వీఎస్ పాఠశాలలో, వైద్యవిద్యను కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలోనూ అభ్యసించారు. చదువు పూర్తయ్యాక గాయకుడిగా స్థిరపడాలనుకున్నారు.సంగీత దర్శకత్వంలో మాస్టర్ వేణు 1970 ప్రాంతంలో విడుదలైన అర్థరాత్రి చిత్రంలో ఒకపాట కూడా పాడారు. లండన్‌లో జరిగే తెలుగువారి కార్యక్రమాలన్నింటిలో ఆయన ఘంటసాల పాటలను పాడతారు. ఆయనను ప్రవాస భారతీయులు అభినవ ఘంటసాల అని పిలుస్తారు. సుమారు 20 వేలకు పైగా పాతపాటలు ఆయన సేకరించారు. నాగభైరువారిపాలెంలో సీతారామస్వామి దేవాలయ నిర్మాణానికి ప్రధాన దాత. మేనమామ దండా అప్పయ్య జ్ఞాపకార్ధం పక్కనే ఉన్న దండమూడి గ్రామంలో ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మించారు.