Jump to content

నాగమండల (1997 సినిమా)

వికీపీడియా నుండి
నాగమండల
దర్శకత్వంటి.ఎస్.నాగాభరణ
రచనగిరీష్ కర్నాడ్
నిర్మాతశ్రీహరి ఎల్. ఖోడే
తారాగణంప్రకాష్ రాజ్, విజయలక్ష్మీ, మండ్య రమేష్, బి. జయశ్రీ
ఛాయాగ్రహణంజి.ఎస్. భాస్కర్
సంగీతంసి. అశ్వంత్
విడుదల తేదీ
1997 (1997)
దేశంభారతదేశం
భాషకన్నడ
ప్రకాష్ రాజ్ (ఎడమ), విజయలక్ష్మి (కుడి)

నాగమండల 1997లో విడుదలైన కన్నడ చలనచిత్రం. గిరీష్ కర్నాడ్ రాసిన నాగమండల నాటకం ఆధారంగా టి.ఎస్.నాగాభరణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విజయలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] నాగమండల చిత్రకథ 1973లో హిందీలో వచ్చిన దువిదా చిత్రకథను పోలివుంటుంది.

తనను నిర్లక్ష్యం చేసే భర్తకు మందు పెడదామని భావించిన ఒక భార్య పాలల్లో మందు కలిపితే, పొరపాటున ఆ పాలు వొలికి పుట్టలో పడతాయి. వాటిని తాగిన పుట్టలోని పాము రోజూ ఆమె భర్త రూపు దాల్చి, ఇల్లాలితో జతకడుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందనేది కథ.[2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: టి.ఎస్.నాగాభరణ
  • నిర్మాత: శ్రీహరి ఎల్. ఖోడే
  • రచన: గిరీష్ కర్నాడ్
  • సంగీతం: సి. అశ్వంత్
  • ఛాయాగ్రహణం: జి.ఎస్. భాస్కర్

అవార్డులు

[మార్చు]

కర్ణాటక రాష్ట్ర అవార్డులు

  • ఉత్తమ ద్వితీయ చిత్ర అవార్డు
  • ఉత్తమ సహాయ నటుడు, నటి అవార్డులు
  • ఉత్తమ కళా దర్శకత్వం అవార్డు
  • ఉత్తమ ఛాయాగ్రహణం అవార్డు

ఉదయ సినీ అవార్డులు

  • ఉత్తమ చిత్ర అవార్డు
  • ఉత్తమ దర్శకత్వ అవార్డు (టి. ఎస్. నాగభరణ)
  • ఉత్తమ సహాయ నటుడు, నటి అవార్డులు (మాండ్యా రమేష్, బి. జయశ్రీ)
  • ఉత్తమ గాయకురాలు అవార్డు (సంగీత కట్టి)

ఇతర అవార్డులు & గుర్తింపులు

  • 1997లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం భారతదేశం తరపున ఎంపిక చేయబడింది
  • ఫిలింఫేర్ ఉత్తమ దర్శకత్వ అవార్డు
  • సినీ ఎక్స్‌ప్రెస్ ఉత్తమ దర్శకుడు అవార్డు
  • ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు
  • యునైటెడ్ స్టేట్స్ లోని పంతొమ్మిది ముఖ్యమైన కేంద్రాలలో ప్రదర్శించబడింది

మూలాలు

[మార్చు]
  1. The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.
  2. ప్రజాశక్తి, ఫీచర్స్ (12 June 2019). "గిరీష్‌ కర్నాడ్‌.. ఓ ప్రత్యామ్నాయ సృజనసారథి". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 12 June 2019. Retrieved 1 July 2019.

ఇతర లంకెలు

[మార్చు]