నాడీ గ్రంథాలు
స్వరూపం
నాడీ గ్రంథాలు పురాతన కాలంలో భారతదేశంలో తాళపత్రాలపై రాయబడ్డ జ్యోతిష్యానికి సంబంధించిన గ్రంథాలు. వీటిలో ఎక్కువ భాగం తమిళం లోనూ, కొన్ని సంస్కృతం లోనూ ఉన్నాయి. శుక్ర నాడి, ధ్రువ నాడి సంస్కృతంలో ఉన్నాయి. చంద్ర నాడి, బ్రహ్మ నాడి, అగస్త్య నాడి, విశ్వామిత్ర నాడి, సుబ్రహ్మణ్య నాడి, నంది నాడి, కాకాభుజంగ నాడి మొదలైనవెన్నో తమిళ భాషలో ఉన్నాయి. ఇవి చాలా పెద్ద గ్రంథములు. నాడీ జ్యోతిష్యం చెప్పేవారు ఈ గ్రంథాలను గుప్తముగా ఉంచి తమ జీవనోపాధి కొరకు ఉపయోగించుచున్నారు కాబట్టి ప్రస్తుతం ఇవి ఎక్కడా ప్రచురణలో లేవు. జాతక ఫలములను కావల్సిన వారు వీరిని సంప్రదిస్తే వారు ఆగ్రంథములను పరిశీలించి ఫలములను రాసి ఇస్తారు. కౌశిక నాడి, అగస్త్య నాడి మొదలైన వానిని చేతి రేఖల ఆధారంగా చూస్తారు. [1]