నాపిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాపిక్స్
Knoppix logo.svg
Knoppix 6.0.1.png
నాపిక్స్ 6.0.1 ఎలెక్స్ డీఈ తో శక్తివంతం.
అభివృద్ధికారులుక్లాౙ్్ నాపర్
నిర్వహణవ్యవస్థ కుటుంబంయూనిక్స్ తరహా
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంఓపెన్ సోర్స్
తొలి విడుదలసెప్టెంబరు 30, 2000; 19 సంవత్సరాలు క్రితం (2000-09-30)
ఇటీవల విడుదల7.4.2 / సెప్టెంబరు 28, 2014; 5 సంవత్సరాలు క్రితం (2014-09-28)
విడుదలైన భాషలుజెర్మన్, ఆంగ్లం
తాజా చేయువిధముఅడ్వాన్స్డ్ ప్యాకేజ్ంగ్ టూల్ (APT) (అంతరవర్తి లభ్యం)
ప్యాకేజీ మేనేజర్డిపికెజీ
Kernel విధముఆణవిక నుంగు (లినక్స్ నుంగు)
వాడుకరిప్రాంతముగ్నూ
అప్రమేయ అంతర్వర్తిఎల్ ఎక్స్ డీ ఈ (మునుపు కేడీఈ)
లైెసెన్స్స్వేచ్ఛా సాఫ్టువేర్ లైసెన్సులు
(ముఖ్యంగా జీపీఎల్)[1]
అధికారిక జాలస్థలినాపిక్స్ జాలస్థలి ఆంగ్లంలో

నాపిక్స్ డెబియన్ ఆధారిత గ్నూ-లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ (నివ్య) పంపకం. ఇది డెబియన్ గ్నూ-లినక్స్ పంపకం ఆధారంగా రూపొందించబడింది. ఈ పంపకాన్ని నేరుగా సీడీ/డీవీడీ/పెన్ డ్రైవ్ ద్వారా ఆడించే విధంగా తొలిసారిగా రూపొందించారు. ఇవాళ అలా దాదాపు అన్ని లినక్స్ పంపకాలనూ వాడవచ్చు. నాపిక్స్ లినక్స్ కన్సల్టెంట్ క్లాజ్ నాపర్ రూపొందించారు. ఒక కంప్యూటర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు సీడీ/డీవీడీ/ఫ్లాపీ/పెన్ డ్రైవ్ లాంటి బాహ్య మీడియం నుండి ఈ నివ్య నేరుగా ర్యామ్ డ్రైవ్ లోకి నింపబడుతుంది. ఈ చర్యలో నివ్య పూర్తి స్థాయిలో అణిచివేయబడుతుంది. ఏ స్థాయిలో ఈ అణిచివేత జరుగుతుందో అన్న విషయం మనం నేరుగానే పరికించవచ్చు.

నాపిక్స్ లైవ్ సీడీ‌గానే (అంటే కంప్యూటర్ లోకి స్థాపించకుండా నేరుగా సీడీ/డీవీడీ/పెన్ డ్రైవ్ నుండి ఆడించడం) కాకుండా ఇతర నివ్యలలా స్థాపించుకోవచ్చు. యూఎస్బీ పరికరాల నుండి నేరుగా లోడ్ చెయ్యగల సామర్ధ్యం గల అన్ని కంప్యూటర్లూ నాపిక్స్ ను స్థాపించుకోగలవు.

నాపిక్స్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది : సాంప్రదాయ సీడీ ఎడిషన్ (దీని నిడివి 700 ఎంబీ ఉంటుంది), డీవీడీ ఎడిషన్ (ఇది 4.7 గీగాబైట్లు ఉంటుంది). ఈ రెండు కూడా జెర్మన్, ఆంగ్ల భాషలలో లభ్యం.

నాపిక్స్ ఎక్కువగా స్వేచ్ఛా సాఫ్టువేరు అనువర్తనాలని కలిగి ఉంటుంది. కానీ కొన్ని వాణిజ్యాధికారిక సాఫ్టువేర్లు కూడా కొన్ని నిబంధనలననుసరించి నాపిక్స్ లో చేర్చవచ్చు.

అప్పటికే పాడయిపోయి క్రాష్ అయిన విండోస్ హార్డ్ డిస్కులనుండి ముఖ్యమైన దస్త్రాలను నాపిక్స్ వాడి పొందవచ్చు.

నిక్షిప్తాలు[మార్చు]

నాపిక్స్ మొదలుపెట్టినపుడు కనిపించే తెర - ఇది అప్రమేయ సాంప్రదాయ పంపకంలో కనిపిస్తుంది

దాదాపు వెయ్యికి పైగా సాఫ్టువేర్ అనువర్తనాల్లు నాపిక్స్ సీడీలో లభ్యం, డీవీడీలో 2600 కన్నా ఎక్కువ అనువర్తనాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక డీవీడీలో 9 జీబీ వరకు అణిచిన డేటాను నిలువ చేయవచ్చు.

వీటిలో కొన్ని:

 • ఎల్ ఎక్స్ డీ ఈ డెస్క్టాప్ వ్యవస్థ
 • ఎం ప్లేయర్, ఎంపీ3, ఓజీజీ ఆడియోలను ప్లే చేసే సమర్ధత కలది
 • ఇంటర్నెట్ కు జోడించే అనువర్తనాలు
 • ఐస్ వీజెల్ విహారిణి (మొజిల్లా ఫైర్ఫాక్స్ ఆధారితం)
 • ఐస్ డవ్ ఈమెయిల్ క్లైంట్ (ఇది థండర్ బర్డ్ ఆధారితం)
 • గింప్
 • డేటాను కాపాడేందుకు, వ్యవస్థను దిద్దే ఉపకరణాలు
 • నెట్వర్కింగ్ అనుసంధాన అనువర్తనాలు
 • లిబ్రేఅఫీస్
 • టెర్మినల్

హార్డ్‍వేర్ అవసరాలు[మార్చు]

నాపిక్స్ ఆడించేందుకు కావాల్సిన కనీస హార్డ్వేర్ అవసరాలు :

 • ఇంటెల్/ఏఎండీ ఆధారిత ప్రొసెసర్ (i486 లేదా ఆపైన)
 • 32 ఎంబీ ర్యామ్ పాఠ్య స్థితికి, 128 ఎంబీ ర్యామ్ గ్రాఫిక్స్ స్థితికి
 • సీడీ-రోమ్
 • సాధారణ గ్రాఫిక్ కార్డ్
 • కనీస సీరియల్ లేదా పీఎస్/2 మౌస్ లేదా యూఎస్బీ మౌస్

ప్రజాదరణ[మార్చు]

నాపిక్స్ తొలిసారిగా లైవ్ సీడీ విధానాన్ని అనుసరించిన నివ్యలలో మొదటిది. అన్ని రకాల హార్డువేర్లనూ గుర్తించి పని చేయించుకోవడం వలన అనేక ప్రింటర్/మౌస్/కీబోర్డ్ లాంటి ఉపకరణాలకి డ్రైవర్లు విడిగా వాడక్కరలేదు, అందుకని ప్రజాదరణ పొందింది. వ్యవస్థను సర్చేసేందుకు కావాల్సిన ఉపకరణాలు అప్రమేయంగా లభ్యం అవడం మరో జనరంజక అంశం.

రూపాంతరణలు[మార్చు]

ఏప్రిల్ 2008 నాటికి నాపిక్స్ 4 నుండి 5.1.1 వరకూ సీడీ, డీవీడీ రెండు రూపాల్లో విడివిడిగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.[2][3]

ముఖ్యమైన రూపాంతరణల వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి.

నాపిక్స్ రూపాంతరణ విడుదల తేదీ సీడీ డీవీడీ
1.4 2000-09-30 అవును కాదు
1.6 2001-04-26 అవును కాదు
2.1 2002-03-14 అవును కాదు
2.2 2002-05-14 అవును కాదు
3.1 2003-01-19 అవును కాదు
3.2 2003-06-16 అవును కాదు
3.3 2003-09-22 అవును కాదు
3.4 2004-05-17 అవును కాదు
3.5 LinuxTag-Version 2004-06 కాదు అవును
3.6 2004-08-16 అవును కాదు
3.7 2004-12-09 అవును కాదు
3.8 CeBIT-Version 2005-02-28 అవును కాదు
3.8.1 2005-04-08 అవును కాదు
3.8.2 2005-05-12 అవును కాదు
3.9 2005-06-01 అవును కాదు
4.0 LinuxTag-Version 2005-06-22 కాదు అవును
4.0 updated 2005-08-16 కాదు అవును
4.0.2 2005-09-23 అవును అవును
5.0 CeBIT-Version 2006-02-25 కాదు అవును
5.0.1 2006-06-02 అవును అవును
5.1.0 2006-12-30 అవును అవును
5.1.1 2007-01-04 అవును అవును
5.2 CeBIT-Version 2007-03 కాదు అవును
5.3 CeBIT-Version 2008-02-12 కాదు అవును
5.3.1 2008-03-26 కాదు అవును
ADRIANE
6.0.0 2009-01-28 అవును కాదు
6.0.1 2009-02-08 అవును కాదు
6.1 CeBIT-Version 2009-02-25 అవును అవును
6.2 / ADRIANE 1.2 2009-11-18 అవును అవును
6.2.1 2010-01-31 అవును అవును
6.3 CeBIT-Version 2010-03-02 కాదు అవును
6.4.3 2010-12-20 అవును అవును
6.4.4 2011-02-01 అవును అవును
6.5 CeBIT-Version 2011-03 కాదు అవును
6.7.0 2011-08-03 అవును అవును
6.7.1 2011-09-16 అవును అవును
7.0.1 2012-05-24 కాదు అవును
7.0.2 2012-05-30 కాదు అవును
7.0.3 2012-07-01 అవును అవును
7.0.4 2012-08-20 అవును అవును
7.0.5 2012-12-21 అవును అవును
7.2.0 2013-06-24 అవును అవును
7.4.0 2014-08-07 కాదు అవును

నాపిక్స్ 6.0.1/ఆడ్రియేన్ 1.1 సీడీ ఆధారిత సంచిక, ఇది పూర్తిగా మూలాల నుండి రూపొందించబడింది. ఒక సాధారణ సీడీలో పట్టేలా ఇందులోని సాఫ్టువేర్లను మార్చడం జరిగింది.[4] 5.x రూపాంతరాల అభివృద్ధి నిలిచిపోయ్ంది.

నాపిక్స్ 6.2.1 సీడీ, డీవీడీగా రాగా, ఆడ్రియేన్ కేవలం సీడీ రూపంలో విడుదలయింది.[5]

జనితాలు[మార్చు]

ఆడ్రియేన్ నాపిక్స్[మార్చు]

నాపిక్స్ 6.7

అంధులకు, ఇతర దృష్టి లోపాలతో అశక్తులైన వారి కోసమని ఆడ్రియేన్ నాపిక్స్ రూపొందించబడింది. ఇది ఎలాంటి దృష్టి ఆధారిత ఉపకరణాలనూ వాడకుండా పని చేసే సామర్ధ్యం కలిగి ఉన్న నిర్వహణా వ్యవస్థ. ఇది 2007 మూడో త్రైమాసికంలో లైవ్ సీడీగా అందుబాటులోకి వచ్చింది. ఈ పంపకం నామకరణం క్లాజ్ నాపర్ భార్య ఆడ్రియేన్ నాపర్ పేరు మీద చేయబడింది. ఆడ్రియేన్ కు దృష్టి లోపం ఉంది. ఈమె క్లాజ్ కు ఈ పంపకం రూపొందించడంలో సహాయం చేసింది కూడా.[6] ఆడ్రియేన్ (Adriane) అనే పదం"Audio Desktop Reference Implementation And Networking Environment" అనే పదానికి సంక్షిప్త రూపం కూడా.

ఆడ్రియేన్ నాపిక్స్ కేవలం దృష్టి లోపం ఉన్నవారికే కాక కొత్తగా కంప్యూటర్ మొదలుపెట్టిన వారికీ ఉపయోగపడుతుంది. ఇది స్యూజ్ బ్లినక్స్ స్క్రీన్ రీశర్ ను వాడుతూ పలుకుబళ్ళ ఉత్పత్తి, మాటరూపొందించే ఇంజన్ ను సాధారణగా ఔట్ పుట్ కి వాడుతుంది.

ఇతర రూపాంతరాలు[మార్చు]

నాపిక్స్ వంశ వృక్షం
 • డామ్ స్మాల్ లినక్స్, కేవలం 50 ఎంబీ నిడివి గల లినక్స్. పాత వాడుకలో లేన 90ల నాటి కంప్యూటర్ల కోసం
 • డ్రీమ్ లినక్స్, బ్రెజిల్ లో రూపొందింది.
 • కాలీ లినక్స్, ఇది సురక్షా తెరలను ధ్వంసం చేసి (వాటిని మరింత పటిష్ఠం చేసేందుకు) హ్యాక్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది
 • కనొటిక్స్, ప్రస్తుతం డెబియన్ ఆధారితం
 • నాప్ మిథ్
 • పొజీడాన్ లినక్స్, శాస్త్రజ్ఞుల కోసం
 • క్వాంటియన్, సాంఖ్యక శాస్త్రజ్ఞుల కోసం
 • పెలికాన్ హెచ్‍పీసీ, క్లస్టరింగ్ కోసం
 • వీఎం నాపిక్స్, వర్చువల్ వేర్ ఉపకరణాల కోసం

నిర్వహణలో లేని రూపాంతరాలు[మార్చు]

 • ఆడిటర్ సెక్యూరిటీ కలెక్షన్
 • క్లస్టర్ నాపిక్స్
 • ఫెదర్ లినక్స్
 • కేల్లా
 • కురుమిన్
 • మూసిక్స్

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

 • గ్రెనెమాన్, స్కాట్ (2005). హ్యాకింగ్ నాపిక్స్. జాన్ వైలీ & సన్స్. ISBN 978-0-7645-9784-8.
 • హెంట్జెన్, విల్ (2007). నాపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్. హెంట్జెన్ వెర్కె. ISBN 1-930919-56-5.
 • ర్యాంకిన్, కైలె (2004). నాపిక్స్ హ్యాక్స్. ఓరిఎల్లీ. ISBN 978-0-596-00787-4.

మూలాలు[మార్చు]

 1. "నాపిక్స్ లినక్స్ లైవ్ సీడీ : న్నాపిక్స్-సీడీ ఏ లైసెన్స్ ను వాడుతుంది?". Archived from the original on 2016-10-21. Retrieved 2007-07-16.
 2. Knopper, Klaus (2005-07-06). "KNOPPIX 4.0 in issue 8/05 with DVD of “com! Das Computer-Magazin”". KNOPPER.NET News. Knopper.Net. Archived from the original on 2005-07-08. Retrieved 2009-06-10.
 3. "Knoppix 4.0 auf DVD erscheint zum LinuxTag 2005" (Press release) (in జర్మన్). Knopper.Net. 2005-07-29. Retrieved 2009-06-10.
 4. Knopper, Klaus (2009-02-11). "Microknoppix". KNOPPIX 6.0 / ADRIANE 1.1 – Live CD. Knopper.Net. Retrieved 2009-06-10.
 5. "Microknoppix". KNOPPIX 6.2 / ADRIANE 1.2 – Live CD / DVD. Knopper.Net. Retrieved 2009-11-18.
 6. స్వప్నిల్ భారతీయ, ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ న్యూస్ దృష్టిలోపం కలవారికి లినక్స్: ఆడ్రియేన్ నాపిక్స్ Archived 2008-06-12 at the Wayback Machine 2 ఫిబ్రవరి 2007 న పొందబడింది.
"https://te.wikipedia.org/w/index.php?title=నాపిక్స్&oldid=2887894" నుండి వెలికితీశారు