నాలుక పూత
నాలుక పూత |
---|
నాలుక పూత శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధి. దూబు ప్రభావంతో నాలుక వాచిపోతుంది, దాని రంగు మారుతుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. నాలుకపై గల మొగ్గలు కోల్పోయి నాలుక నున్నగా తయారవుతుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైన అంతటా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి. దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుభ్రతే. అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బికాంప్లెక్ లేమి వలన, వైరస్ వలన, ఫంగస్, బాక్టీరియాల ఇన్‌ఫెక్షన్, కడుపులో పురుగులు, మెటాలిక్ పాయిజినింగ్, దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అజీర్ణవ్యాధి, దంతాల వ్యాధులు, ఏదైనా మందులు తీసుకొంటే అవి వికటించినపుడూ ఇలా నోరు పూస్తుంది.
లక్షణాలు
[మార్చు]- నాలుక వాచిపోవుట.
- నాలుక నున్నగా కనిపిస్తుంది (విటమిన్ బి12 లోపం కారణంగా).
- నాలుక రంగు మారుతుంది (ముదురు ఎరుపు రంగుకు).
- ఆహారం నములుటలో కష్టత, మాట్లాడే టపుడు కష్టత.
ఈ వ్యాధి నివారణకు సుమారు 10 రోజుల వ్యవధి పడుతుంది.(నాలుక వాయుట తీవ్రంగా ఉన్నను, శ్వాస తీసుకొనుట, మాట్లాడుట, నములుట, చప్పరించుట వంటి క్రియలు కఠినంగా ఉన్నప్పుడు)