నాలుగు పరమ సత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధుడు చెప్పిన నాలుగుసత్యాలు. సంస్కృత గ్రంథం, నలంద, భీహారు నుండి

బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి [1]

ఆర్య సత్యాలు[మార్చు]

గౌతమ బుద్ధుడు మధ్యేమార్గాన నాలుగు ఆర్యసత్యములను తెలియపరచెను. అవి:

  1. దుఃఖం అంతటా వుంది
  2. ఈ దుఃఖం ‘తృష్ణ’ వలన ఏర్పుడుతుంది
  3. తృష్ణ ‘అవిద్య’ వలన వస్తుంది
  4. అష్టాంగ మార్గమే అవిద్యానాశకారి.

వీటినే నాలుగు ఆర్య సత్యాలు లేదా నాలుగు పరమ సత్యాలు అనుదురు.[2] వాటి పరిపూర్ణ స్వరూప స్వభావ పరిజ్ఞానం ఆయన సముపార్జించాడు. అప్పటినుంచి ఆయన గౌతమ బుద్ధుడైనాడు.[3]

అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం దానివల్ల శాశ్వతమైన దుఃఖ – రాహిత్యం కలుగుతుంది

  • “తృష్ణ” అంటే శృతికి మించిన రాగం.
  • “తృష్ణ” అంటే లయకు మించిన తాళం
  • “తృష్ణ” అంటే మితికి మించిన మోతాదు.
  • “తృష్ణ” అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం.
  • “తృష్ణా-రాహిత్యం” వల్లనే దుఃఖ-రాహిత్యం కలుగుతుంది.

దుఃఖ-రాహిత్యమే నిర్వాణం

నిర్వాణం” అన్నా, “ముక్తి” అన్నా, “మోక్షం” అన్నా, “నిఃశ్రేయస్సు” అన్నా, “అపవర్గం” అన్నా అన్నీ ఒక్కటే, అవన్నీ పర్యాయపదాలే.[4]

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు, [5] "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యే మార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం) గా చెప్పాడు. [6] థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు.[7] మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి.[8] దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.[9]

మూలాలు[మార్చు]

  1. Macmillan Encyclopedia of Buddhism (2004) Volume One, page 296
  2. INTERMEDIATE I YEAR HISTORY(Telugu Medium) TEST PAPERS: Model Papers ...
  3. బుద్ధదేవుడి ఆనందగీతిక - అక్కిరాజు రమాపతిరావు, February 27th, 2010[permanent dead link]
  4. “నాలుగు ఆర్య సత్యాలు”
  5. Thera, Piyadassi (1999). "Dhammacakkappavattana Sutta". The Book of Protection. Buddhist Publication Society. In the Buddha's first sermon, the Dhammacakkappavattana Sutta, he talks about the Middle Way, the Noble Eightfold Path and the Four Noble Truths.
  6. Harvey, Introduction, p. 47
  7. Hinnels, John R. (1998). The New Penguin Handbook of Living Religions. London: Penguin Books. ISBN 0140514805.,pages 393f
  8. Harvey, Introduction to Buddhism, p. 92
  9. Eliot, Japanese Budhism, Edward Arnold, London, 1935, page 60

ఇతర లింకులు[మార్చు]