Jump to content

నాళం సుశీలమ్మ

వికీపీడియా నుండి

నాళం సుశీలమ్మ మధుర కవి నాళం కృష్ణారావు గారి సతీమణి[1]. కృష్ణారావు ఆనాడు పేరొందిన గౌతమీ గ్రంథాలయం స్థాపించాడు. "మానవసేవ" అనే పత్రిక నడిపాడు. ఆమెకు సాహిత్య పరిచయాన్ని కృష్ణారావు గారే కలిగించాడు. ఆమె బాపూజీ ప్రేరణతో విదేశీ వస్త్ర దహనం చేసింది. రాట్నంతో నూలు వడకటం, ఆ నూలుతో గుడ్డలు నేయటం అలవాటు చేసుకుంది. పూర్తి ఖద్దరే కట్టింది. ఇతరులు చేత కట్టించేది. వీణా వాద్యంలో కూడా ఆమెకు నైపుణ్యం ఉంది. ప్రకృతి వైద్యం తెలిసిన మహిళ. ఆంధ్ర మహిళా గాన సభ అనే సంస్థను స్థాపించింది. దాని అభివృద్ధికి ఎంతో కృషి చేసింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమెకు 12వ యేటనే వివాహం అయింది. అప్పటికే ఆమె భర్త నాళం కృష్ణారావుకు బ్రహ్మ సమాజంలోనూ, వీరేశలింగం వితంతు వివాహోద్యమాలాలోనూ సంబంధం ఉండేది. ఆనాటి కాలంలో స్త్రీవిద్య పట్ల వ్యతిరేకత ఉండేది. కానీ ఆ కాలంలో ఆమె ఏలూరులోని నాయుడుగారి వీధిలోని వీధిబడిలో చేరింది. ఆమె పెద్దతండ్రి కుమారులు మోతే సుబ్బయ్య గారికి సంస్కార భావాలు ఉండేవి. అతను తన భార్యతో పాటు, సుశీలమ్మను కూడా ఇంగ్లీషు దొరసానిని ఇంటికి పిలిపించి ఆంగ్లమున్నూ, మగ మాష్టారుచేత రహస్యంగా సంగీతమున్నూ నేర్పించారు. ఆమె ఆ కాలంలో నాలుగొ తరగతి వరకు చదువుకుంది. మొదట్లో ఆమె భర్త సంస్కారోద్యమాల పట్ల సహకరించమని కోరినా ఆమె సహకరించలేదు. ఆమెకు సహజ సనాతన మతాభిమానం, సంస్కారోద్యమం పట్ల వ్యతిరేక భావం అతానికి కోపం తెప్పిచేవి. తరువాత గాంధీ గారి ఉద్యమ ప్రభావంతో యావాధ్బారతదేశానికి కనువిప్పు కలిగింది. వీరేశలింగం పంతులు గారి నిరంతర ప్రభోదం వల్ల సంఘసేవ పట్ల సుముఖత కనబరచి ఉద్యమాలలో పాల్గొన్నది. తరువత ఆంధ్రా మహిళా గానసభను స్థాపించింది[2].

మూలాలు

[మార్చు]
  1. "19th and 20th Century(4th Generation) Telugu women poets. | Telugu Women Poets" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-14.
  2. "సాహిత్య ప్రస్థానం జనవరి 2019" (PDF). జనవరి 2019.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]