నాళికాశిశువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాళికాశిశువు
Intervention
నాళికా శిశువు క్రమము

కృత్రిమ గర్భధారణ ద్వారా కలిగే శిశువును నాళికా శిశువు లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ అని వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియలో ఒక మానవ అండాన్ని శుక్రాణువు ద్వారా బాహ్యంగా నాళిక (టెస్ట్ ట్యూబ్) లో ఫలదీకరిస్తారు, తరువాత తయారైన సంయుక్త బీజాన్ని (జైగాట్) తల్లి గర్భంలోకి ప్రవేశింప చేస్తారు. తల్లి యోనిలోని వాతావరణానికి పోలిన వాతావాణాన్ని సృష్టించడం, అది ప్రయోగాత్మకంగా గమనించే విధంగా చూసుకోడం ఈ పద్ధతిలో ముఖ్యాంశం. తల్లి యోని/అండాశయం నుండి అండాన్ని సేకరించి, శుక్రాణువు ద్వారా ఆ అండాన్ని ప్రయోగశాలలో రాసాయనిక ద్రవ మాధ్యమంలో ఫలదీకరింపచేయడం తరువాతి అంశం. 2-6 రోజుల పాటు ఫలదీకృతమైన బీజాన్ని సురక్షితంగా సంరక్షించి స్త్రీ యోనిలోకి ప్రవేశపెడతారు, ఆపై ఆ ఫలదీకృతమైన అండం పిండంగా పెరిగి, స్త్రీ గర్భం దాల్చుతుంది.

ఇలా కృత్రిమంగా గర్భం ధరించడానీకి ఎన్నో కారణాలు ఉండవచ్చు, వీటీలో మొదటి కారణం స్త్రీ లేదా పురుషుడు, ఇరువురిలో ఒకరు వంధ్యత్త్వం కలిగి ఉండటం. లేదా స్త్రీ లో గర్భసంచి గర్భం దాల్చేందుకు సరిపోనపుడు, వేరే స్త్రీలో ఈ స్త్రీ అండాన్ని నాళికా శిశు పద్ధతి ద్వారా ప్రవేశ పెట్టడం జరుగుతుంది, ఈ ప్రక్రియను మారుగర్భం(సరోగెసీ) అనవచ్చు.

కొన్ని దేశాలలో ఈ కృత్రిమ గర్భధారణ విధానం నిషిద్ధం, పాక్షికంగా నిషేధం ఉన్న కొన్ని దేశాలలో స్వలింగ సంపర్కులపై నిషేధం ఉంటే, మరి కొన్ని దేశాల్లో ఒంటరి స్త్రీలపై ఈ నిషేధం ఉంది. అలాంటి దేశాల వారు నాళికా శిశు యాత్రలు చేస్తారు కూడా. అంటే నాళికా శిశు జననం నేరం కాని దేశాలకు వెళ్ళి పిల్లల్ని కని తిరిగి సొంత దేశం చేరటం.

1978 సంవత్సరంలో మొట్టమొదటి నాళికా శిశువు జన్మించాడని ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అతని పేరు లూయిస్ బ్రౌన్. లూయిస్ పుట్టిన ప్రక్రియలో యోని వాతావరణాన్ని కృత్రిమంగా రూపొందించలేదు. సహజమైన ప్రక్రియలో అతని జననం జరిగింది. ఈ ప్రయోగం చేసిన రాబర్ట్ జి ఎడ్వార్డ్ కు 2010లో వైద్య నోబుల్ బహుమతి అందించారు. భారతదేశంలో తొలి నాళికా శిశువు దుర్గ అనే పాప, ఈమె లూయిస్ కు 67 రోజుల వ్యత్యాసంతో కోల్కతాలోని సుభాష్ ముఖోపాధ్యాయ పర్యవేక్షణలో పుట్టింది. కృత్రిమ గర్భధారణ ద్వారా రుతువిరతి(మెనోపాజ్) పొందిన స్త్రీలు కూడా గర్భం ధరించగలరు.