నా మాటంటే హడల్
స్వరూపం
నా మాటంటే హడల్ (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాపీ చాణక్య |
---|---|
తారాగణం | ఎం.జి.రామచంద్రన్ బి.సరోజాదేవి కె.ఆర్.విజయ |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ సరస్వతి మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నా మాటంటే హడల్ తమిళం నుండి తెలుగులోనికి డబ్బింగ్ చేయబడ్డ సినిమా. నాన్ అనయిట్టల్ అనే పేరుతో తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమా తెలుగులో 1969, ఫిబ్రవరి 8 విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్ - బాలయ్య
- బి.సరోజాదేవి - కల్యాణి
- నంబియార్ - వీరయ్య
- మనోహర్ - కుమార్
- అశోకన్ - పోలీస్ ఇన్స్పెక్టర్
- కె.ఆర్.విజయ - మాల, ఇన్స్పెక్టర్ భార్య
- దేవర్ - జమీందారు
- నగేష్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: తాపీ చాణక్య
- నిర్మాత: పి.మార్కాండన్
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథం
కథ
[మార్చు]బాలయ్య ఒక దోపిడీ దొంగ. పోలీసులకి పట్టుబడి జైలు శిక్షను అనుభవిస్తూ వుంటాడు. అతనికి కల్యాణి అనే అందగత్తెతో పరిచయమై ప్రేమగా మారుతుంది. కల్యాణి తన అనురాగంతో కఠినమైన బాలయ్య మనసును మార్చివేస్తుంది. బాలయ్య వెనుక అతి దుర్మార్గులైన ముఠా వుంటుంది. ఆ ముఠాలోని వారిలో కూడా పరివర్తన తీసుకురావడానికి బాలయ్య కష్టపడతాడు. తన మార్గంలోనికి ఆ దుర్మార్గులను ఎలా తిప్పుకున్నాడనేది పతాక సన్నివేశంలో తెలుస్తుంది[1].
మూలాలు
[మార్చు]- ↑ రెంటాల (14 February 1969). "చిత్రసమీక్ష - నా పేరంటే హడల్". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 15 January 2020.[permanent dead link]