Jump to content

నిగర్ సుల్తానా

వికీపీడియా నుండి
నిగర్ సుల్తానా
నగర్ 2020 ICC మహిళా T20 ప్రపంచ కప్ లో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నిగర్ సుల్తానా జోతి
పుట్టిన తేదీ (1997-08-01) 1997 ఆగస్టు 1 (వయసు 27)
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 24)2015 6 అక్టోబర్ - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2023 10 నవంబర్ - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 25)2015 30 సెప్టెంబర్ - పాకిస్తాన్ తో
చివరి T20I2023 29 అక్టోబర్ - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–2017/18మైమెన్సింగ్ డివిజన్
2021/22–presentపశ్చిమ మండలం
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I
మ్యాచ్‌లు 38 81
చేసిన పరుగులు 714 1,529
బ్యాటింగు సగటు 23.80 25.06
100లు/50లు 0/3 1/5
అత్యధిక స్కోరు 73 113*
క్యాచ్‌లు/స్టంపింగులు 20/10 20/34
మూలం: Cricinfo, 14 అక్టోబర్ 2023

నిగర్ సుల్తానా (Bengali: নিগার সুলতানা; born 1 August 1997) ఒక బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారిణి. ఒకరోజు అంతర్జాతీయ, మహిళా T20I పోటీలలో బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించింది.[1][2] ఆమె వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాటర్ మధ్యవరుసలో ఆడుతుంది.[3]

జీవితచరిత్ర

[మార్చు]

జూన్ 2018లో , నిగర్ 2018 మహిళల ట్వంటీ 20 ఆసియా కప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళల ఆసియా కప్ ను గెలుచుకున్న జట్టులో పాల్గొంది.[4][5][6] నెల తరువాత 2018 ఐసిసి మహిళల ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఆమె ఎంపికైంది.[7]

2018లో వెస్టిండీస్ లో జరిగిన 2018 ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్ కు బంగ్లాదేశ్ జట్టుకు ఆమె ఎంపికైంది.[8][9] 2019 ఆగస్ట్ స్కాట్లాండ్ లో జరిగిన 2019 ఐసిసి ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ 20 క్వాలిఫైయర్ టోర్నమెంట్ కు బంగ్లాదేశ్ జట్టులో ఆమె ఎంపికైంది[10]. 2019లో ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్ ల సిరీస్ కు ముందు మహిళల గ్లోబల్ డెవలప్మెంట్ స్క్వాడ్ లో ఆమె పేరు చేర్చారు.[11] ఇంకా దక్షిణాసియా క్రీడలలో క్రికెట్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఆమె ఎంపికైంది.[12] బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను రెండు పరుగుల తేడాతో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.[13]

2020లో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఆమె ఎంపికైంది.[14] టోర్నమెంట్లో నాలుగు మ్యాచ్ లలో 114 పరుగులతో ఆమె బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది.[15]

నవంబర్ 2021లో జింబాబ్వేలో జరిగిన 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది.[16] జనవరి 2022లో మలేషియాలో జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం,[17] తరువాత అదే నెలలో న్యూజిలాండ్ లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు కూడా కెప్టెన్ గా ఎంపికైంది.[18]

సూచనలు

[మార్చు]
  1. "Bangladesh squad for women's T20 World Cup qualifier announced, Nigar Sultana named as captain". Sportstar. 2022-09-06. Retrieved 2022-09-19.
  2. Azam, Atif (2021-11-20). "New skipper Nigar Sultana expects support from senior trio". Cricbuzz. Retrieved 2022-09-19.
  3. "Nigar Sultana Profile". ESPNCricinfo. Retrieved 2022-09-19.
  4. "Bangladesh stun India in cliff-hanger to win title". International Cricket Council. Retrieved 11 June 2018.
  5. "Bangladesh Women clinch historic Asia Cup Trophy". Bangladesh Cricket Board. Retrieved 11 June 2018.
  6. "Bangladesh name 15-player squad for Women's Asia Cup". International Cricket Council. Retrieved 31 May 2018.
  7. "ICC announces umpire and referee appointments for ICC Women's World Twenty20 Qualifier 2018". International Cricket Council. Retrieved 27 June 2018.
  8. "Bangladesh announce Women's World T20 squad". International Cricket Council. Retrieved 9 October 2018.
  9. "Media Release: ICC WOMEN'S WORLD T20 WEST INDIES 2018: Bangladesh Squad Announced". Bangladesh Cricket Board. Retrieved 9 October 2018.
  10. "Bangladesh name 14-member squad for ICC T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 11 August 2019.
  11. "Bismah to lead Women's Global Development Squad". International Cricket Council. Retrieved 3 October 2019.
  12. "Nazmul Hossain to lead Bangladesh in South Asian Games". CricBuzz. Retrieved 30 November 2019.
  13. "Bangladesh women's cricket team clinch gold in SA games". The Daily Star. Retrieved 8 December 2019.
  14. "Rumana Ahmed included in Bangladesh T20 WC squad". Cricbuzz. Retrieved 29 January 2020.
  15. "ICC Women's T20 World Cup, 2019/20 - Bangladesh Women: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 March 2020.
  16. "Media Release : ICC Women's World Cup Qualifier 2021: Bangladesh Squad announced". Bangladesh Cricket Board. Retrieved 4 November 2021.
  17. "Bangladesh drop Jahanara for CWC qualifiers". CricBuzz. Retrieved 7 January 2022.
  18. "Jahanara returns to Bangladesh for World Cup". BD Crictime. Retrieved 28 January 2022.