నిడుమోలు మాలా
Jump to navigation
Jump to search
నిడుమోలు మాలా | |
---|---|
జననం | శ్రీరంగం మాలా |
వృత్తి | మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి |
జీవిత భాగస్వామి | నిడుమోలు రాధారమణ, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్నతాధికారి |
పిల్లలు | ఇద్దరు కుమారులు. శ్రీనివాస్ జయప్రకాశ్, సాయి ప్రదీప్ |
తల్లిదండ్రులు |
|
నిడుమోలు మాలా భారతీయ న్యాయమూర్తి. ఆమె అభ్యుదయ కవి శ్రీశ్రీ కుమార్తె.
న్యాయవాదుల కోటాలో చెన్నై హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2022లో నియమితులయిన[1] ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ 2023 సెప్టెంబరు 12న ఉత్తర్వులు జారీచేసింది.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), సరోజా దంపతుల నలుగురి సంతానంలో మాలా చివరి అమ్మాయి. ఆమె మద్రాస్ లా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ఆ తరువాత 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకుంది. ఆమె 32 ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీసు చేసింది. 2020 నుంచి రెండేళ్లపాటు పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించింది.
మూలాలు
[మార్చు]- ↑ "మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా శ్రీశ్రీ కుమార్తె మాలా". EENADU. Retrieved 2022-03-26.
- ↑ "Latest Telugu News, తెలుగు వార్తలు, Telugu News Today Live, ఈరోజు వార్తలు, Online Telugu News, తెలుగు న్యూస్ లైవ్ - Samayam Telugu - Samayam Telugu". web.archive.org. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-09-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)