నిన్ను తలచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్ను తలచి
దర్శకత్వంఅనిల్ తోట
స్క్రీన్ ప్లేఅనిల్ తోట
నిర్మాతఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి
తారాగణంవంశీ యకసిరి, స్టెఫి పటేల్
ఛాయాగ్రహణంవాసిలి శ్యాం ప్రసాద్
కూర్పుసాయిబాబా తలారి, అనిల్ తోట
సంగీతంయల్లెందర్ మహవీర
నిర్మాణ
సంస్థలు
ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్‌, నేదురుమల్లి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2019 సెప్టెంబర్ 27
దేశం భారతదేశం
భాషతెలుగు

నిన్ను తలచి 2019లో తెలుగులో విడుదలైన సినిమా. ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్‌, నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనిల్ తోట దర్శకత్వంలో ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.[1] వంశీ యకసిరి, స్టెఫి పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 1న విడుదల చేసి[2] సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేశారు.[3][4]

అభిరామ్ (వంశీ యాకసిరి) అల్లరిచిల్లరగా తిరుగే కుర్రాడు. అంకిత (స్టెపీ పటేల్)ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి ఆమెను ప్రేమలో పడేయడానికి అభి ఏమి చేశాడు ? ఆ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంకిత మనసులో వేరే అతను ఉన్నారని అభికి తెలుస్తోంది ? దాంతో అభి ఎమి చేశాడు ? అసలు అంకిత మనసులో ఉన్నది ఎవరు ? అంకిత అభితో ప్రేమలో పండిందా ? చివరికి అంకిత అభి ఒక్కటయ్యారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]
  • వంశీ యకసిరి
  • స్టెఫి పటేల్
  • ఆనంద్
  • కృష్ణ తేజ
  • నవీన్ నేని
  • ఆయుష్ గుప్తా
  • కేదార్ శంకర్
  • మహేష్ ఆచంట

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్‌, నేదురుమల్లి ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ తోట
  • సంగీతం: అనిల్ తోట
  • సినిమాటోగ్రఫీ: వాసిలి శ్యాం ప్రసాద్
  • పాటలు: పూర్ణాచారి, శ్రీమణి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (25 September 2019). "మంచి సినిమాని ప్రోత్సహించాలి". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. Zee News Telugu (1 February 2019). "నిన్ను తలచి మూవీ టీజర్". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. The Times of India (27 September 2019). "Ninnu Thalachi Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  4. The Times of India (17 August 2017). "'Ninnu Thalachi' gearing up for a grand release in September" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  5. The Times of India (2019). "'Ninnu Thalachi' review: A breezy romantic entertainer - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.

బయటి లింకులు

[మార్చు]