నిరుపమ్‌ పరిటాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరుపమ్‌ పరిటాల
జననం15 ఫిబ్రవరి 1988
విద్యఎంబిఎ
వృత్తిటెలివిజన్ నటుడు, రచయిత, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిమంజుల పరిటాల
పిల్లలుఅక్షజ్ ఓంకార్
తల్లిదండ్రులుఓంకార్ పరిటాల
బంధువులుజై ధనుష్ (తమ్ముడు)

నిరుపమ్‌ పరిటాల తెలుగు టెలివిజన్ నటుడు . ఆయన 2013లో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగు పెట్టాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

నిరుపమ్‌ 15 ఫిబ్రవరి 1988లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో జన్మించాడు. ఆయన తండ్రి ఓంకార్ పరిటాల పలు సినిమాలకు సినీ రచయితగా పని చేశాడు, తల్లి లెక్చరర్‌. ఆయన చెన్నై లో ఎంబీఏ వరకు చదువుకున్నాడు.

వివాహం[మార్చు]

నిరుపమ్ పరిటాల తన సహనటి మంజుల పరిటాల ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చంద్రముఖి సీరియల్ లో నటించినప్పుడు ప్రేమించుకున్నారు. వీరికి ఒక కుమారుడు (అక్షజ్ ఓంకార్) ఉన్నాడు.[3]

నటించిన సీరియల్స్[మార్చు]

 1. చంద్రముఖి (ఈటీవీ)
 2. హిట్లర్‌గారి పెళ్ళాం (జీ తెలుగు)
 3. కుంకుమపువ్వు
 4. మూగమనసులు
 5. కార్తీక దీపం (మాటీవీ) [4]
 6. అత్తారింటికి దారేది (ఈటీవీ)
 7. కలవారి కోడలు
 8. కాంచన గంగ
 9. ప్రేమ [5]

సినిమా రంగం[మార్చు]

నిరుపమ్ 2014లో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, 2014లో రభస సినిమాలో నటించాడు. ఆయన 2017లో విడుదలైన నెక్ట్స్‌ నువ్వే సినిమాకి మాటలు రాశాడు.[6]

పాల్గొన్న టీవీ షోస్[మార్చు]

 1. వావ్
 2. వావ్ 2
 3. జీన్స్
 4. కాష్
 5. 100% లక్
 6. ఆలీతో సరదాగా [7][8]

మూలాలు[మార్చు]

 1. Namasthe Telangana (15 July 2021). "మహిళా లోకానికి..డాక్టరు బాబునే!". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 2. News18 Telugu (3 May 2021). "Guess Who: ఈ కుర్రాడెవరో గుర్తు పట్టారా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్..!". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 3. News18 Telugu (25 December 2020). "Nirupam Paritala : కార్తీక దీపం డాక్టర్ బాబు భార్య ఎవరో తెలుసా..." Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 4. TV9 Telugu (4 April 2021). "Karthika Deepam: భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా.. - I'm getting many threat calls and mails lately says karthika deepam fame Nirupam Paritala". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 5. The Times of India (16 July 2020). "Actor-producer Nirupam Paritala announces his next TV project - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 6. Sakshi (25 December 2019). "ప్రేక్షకుల ప్రేమే∙ నా విజయం". Archived from the original on 24 డిసెంబర్ 2019. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 7. EENADU (12 May 2021). "చెప్పుల దండేస్తామని బెదిరించారు: నిరుపమ్‌ - alitho saradaga nirupam paritala manjula". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
 8. EENADU (21 May 2021). "'అష్టాచమ్మా' ఆడిషన్స్‌కు వెళ్లాను కానీ...! - alitho saradaga nirupam paritala and manjula paritala". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)