మంజుల పరిటాల
మంజుల పరిటాల | |
---|---|
జననం | మంజుల మే 9, 1990 |
విద్య | బి.కామ్ (కామర్స్) |
వృత్తి | టెలివిజన్ నటి |
జీవిత భాగస్వామి | నిరుపమ్ పరిటాల |
పిల్లలు | అక్షజ్ ఓంకార్ |
తల్లిదండ్రులు | శివశంకర్, పుష్ప |
బంధువులు | కీర్తి ధనుష్ (చెల్లెలు), జై ధనుష్ (మరిది) |
మంజుల పరిటాల కన్నడ, తెలుగు టెలివిజన్ నటి. 2013లో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
జననం ౼ విద్యాభ్యాసం
[మార్చు]మంజుల 1990, మే 9న శివశంకర్, పుష్ప దంపతులకు కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. మంజుల తండ్రి హెడ్ కానిస్టేబుల్, నటుడు. తల్లి గృహిణి. మంజుల బి.కామ్ కామర్స్ పూర్తిచేసింది.[2]
వివాహం
[మార్చు]నటుడు, రచయిత ఓంకార్ పరిటాల కుమారుడు టీవీ నటుడు నిరుపమ్ పరిటాలతో మంజుల ప్రేమ వివాహం జరిగింది. చంద్రముఖి సీరియల్ లో నటించినప్పుడు ప్రేమించుకున్నారు. వీరికి ఒక కుమారుడు (అక్షజ్ ఓంకార్).[3]
టీవీరంగం
[మార్చు]ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తన తండ్రి స్నేహితుడు రూపొందించిన ప్రేమ పిశాచిగలు కన్నడ సీరియల్ లో తొలిసారిగా నటించిన మంజుల, కన్నడలో దాదాపు 15 సీరియళ్ళలో నటించింది.
బెంగళూరులోని ఆర్కా మీడియా సంస్థ ద్వారా ప్రసాద్ దేవినేని నిర్మాతగా వై.ఎస్. కోలా నాగేశ్వరరావు దర్శకత్వంలో 2013లో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి తొలిసారిగా తెలుగు సీరియల్ లో నటించింది. రజనీకాంత్, గుహన్ షణ్ముగం, తమీమ్ అన్సారీ, విశ్వ, రాహుల్ రవి వంటి నటులతో కలిసి నటించింది.[4]
నటించిన సీరియల్స్
[మార్చు]తెలుగు
- చంద్రముఖి (ఈటీవీ)
- తరంగాలు (జెమినీ టీవీ)
- లేతమనసులు (జెమినీ టీవీ)
- ఆకాశమంత (జెమినీ టీవీ)
- కాంచన గంగ (స్టార్ మా)
- కృష్ణవేణి (స్టార్ మా)
- అమ్మాయి కాపురం (జెమినీ టీవీ)
- నీలాంబరి
- చంద్రలేఖ
- గోకులంలో సీత
- ఇద్దరమ్మాయిలు
- జానకి కలగనలేదు (స్టార్ మా)
- సీతే రాముడి కట్నం
- పల్లకిలో పెళ్ళికూతురు
కన్నడ
- పొన్నుంజల్ (సన్ టీవీ)
- నందిని (సన్ టీవీ)
- పెరజ్హగి (కలర్స్ టీవీ)
- మూరుబాగిలు
- ప్రేమ పిశాచిగలు
- క్షణ-క్షణ
- కాదంబరి
- తులసి
- కల్యాణి
- రంగోలి
కార్యక్రమాలు
[మార్చు]- సి రియల్ స్టార్స్ (జీ తెలుగు)
- స్టార్ మహిళ (ఈటీవీ తెలుగు)
- మోడ్రన్ మహాలక్ష్మి (స్టార్ మా)
- అభిరుచి (ఈటీవీ)
- భలే ఛాన్స్ లే (స్టార్ మా)
ఇతర వివరాలు
[మార్చు]- మంజుల చెల్లెలు కీర్తి ధనుష్, మరిది జై ధనుష్ నటీనటులుగా వివిధ సీరియల్స్ లో నటిస్తున్నారు.
- చంద్రముఖికి నాలుగు అవార్డులు, కాంచనగంగలో పాత్రకు ఒక పురస్కారం అందుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (3 November 2015). "నీ కళ్లు బాగున్నాయ్.. అన్నారు". Archived from the original on 26 February 2020. Retrieved 7 May 2020.
- ↑ Nettv4u, TV Actress. "Kannada Tv Actress Manjula Paritala Biography, News, Photos, Videos". www.Nettv4u.com (in ఇంగ్లీష్). Retrieved 7 May 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (14 September 2014). "ప్రేమించి పెళ్లి చేసుకున్ :పరిటాల మంజుల". Sakshi. Archived from the original on 9 May 2020. Retrieved 9 May 2020.
- ↑ Onenov, TV Actress (15 June 2018). "Manjula Paritala". www.onenov.in. Retrieved 7 May 2020.[permanent dead link]