నిర్వాహక పరిధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్వాహక పరిధి అనేది క్లయింట్ లను తేలికగా ప్రామాణీకరించడానికి, ప్రమాణీకరించడానికి అనుమతించే భద్రతా భాండాగారాన్ని కలిగి ఉన్న ఒక సేవా ప్రదాత. ఇది కంప్యూటర్ నెట్ వర్క్ భద్రతకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఈ అంశము GLUE సమాచార నమూనాకు సంబందించిన 'అడ్మిన్ డొమైన్' వర్గము చే సంగ్రహించబడుతుంది.[1] నిర్వాహక పరిధిని ముఖ్యంగా ఆంతరిక జాలిక పరిసరాల్లో ఉపయోగిస్తారు.

కార్యాచరణ[మార్చు]

ఇది హోస్ట్ లు, రూటర్ ల  సమాహారంగా అమలు చేయబడుతుంది, అంతేకాకుండా ఇంటర్కనెక్టింగ్ నెట్‌వర్క్(లు), ఒకే పరిపాలనా అధికారం ద్వారా  నిర్వహించబడతాయి.

విభిన్న భద్రతా భాండాగారాలు, విభిన్న భద్రతా సాఫ్ట్ వేర్ లేదా విభిన్న భద్రతా విధానాలను కలిగి ఉన్న విభిన్న నిర్వాహక పరిధుల మధ్య పరస్పర చర్య చాలా కష్టం. అందువల్ల, తాత్కాలిక పరస్పర చర్య లేదా పూర్తి అంతరకార్యనిర్వహణ ను కోరుకునే నిర్వాహక పరిధులు  ఒక సమాఖ్యను నిర్మించాల్సి ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. http://www.ogf.org/documents/GFD.147.pdf GLUE Specification v. 2.0 (Open Grid Forum)