నీటి శుద్ధీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు జీవావరణమును కలుషితము చేసే తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్ధతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్దమైన పద్ధతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్కులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము.

నీటిలో కలసిన అవసరము లేని రేణువులను, పరాన్న జీవులను, బాక్టీరియాని, ఆల్గేని, వైరస్ లను, ఫంగి; మరియు వర్షము లాగా పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసేటటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్ధాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు.

తాగు నీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వము చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి.

నీటిని చూచి పరీక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినది అని చెప్పుట సాధ్యము కాదు. తెలియనటువంటి ప్రదేశములోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్ధతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటివద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ద భూగర్భ జలము కూడా ఈ రోజులలో ఒక వేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలెను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్దీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకొనే మార్గము.

2007 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారము, 1.1 బిలియను ప్రజలకు అభివృద్ధి పరచిన తాగు నీరు సరఫరా అందుబాటులో లేదు, సంవత్సరములో నమోదైన 4 బిలియన్ల అతిసార వ్యాధి కేసులలో 88% రక్షిత నీరు మరియు తగినంతగా లేని ఆరోగ్యకరమైన వాతావరణము మరియు పరిశుభ్రత లేకపోవటము వల్లనే సంభవించినవి అని ఆపాదించటము జరిగినది, మరియు ప్రతి సంవత్సరము 1.8 మిలియన్ల ప్రజలు అతిసార వ్యాధితో మరణిస్తున్నారు. WHO ఈ అతిసార వ్యాధి కేసులలో 94% కేసులను రక్షిత నీటితో సహా పర్యావరణానికి సవరణలు చేయుట ద్వారా అరికట్టవచ్చునని అంచనా వేసింది.[1] సాధారణ ఉపాయాలైనటువంటి క్లోరినేషన్, వడపోత పరికరాలు, సూర్యరశ్మి ద్వారా క్రిములను తొలగించుట, మరియు రక్షిత నిలువ సామాగ్రులలో నీటిని నిలువ ఉంచుట వంటి ఇంటి వద్ద పాటించేటటు వంటి పద్ధతుల ద్వారా యేటా అతి పెద్ద సంఖ్యలో జీవితాలను కాపాడవచ్చు.[2] అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి ద్వారా సంభవించే వ్యాధులను అరికట్టటము ఒక పెద్ద ప్రజారోగ్య లక్ష్యము.

లాక్ డే బ్రెట్, స్విట్జర్లాండ్ యొక్క నీటి శుద్దీకరణ ప్లాంట్ యొక్క నియంత్రణ గది మరియు నిర్మాణ రూపాలు.

విషయ సూచిక

నీటి యొక్క మూలాలు[మార్చు]

 1. భూగర్భ జలము: భూమి లోతులలోనుండి వస్తున్నటువంటి నీరు కొన్ని పదుల, వందల, వేల లేదా కొన్ని సందర్భాలలో మిలియన్ల సంవత్సరాల క్రితము వర్షము రూపములో పడిన నీరు. శుద్దీకరణ విధానమును ఉపయోగించుట కంటే ముందుగానే మట్టి మరియు రాతి పొరలు భూగర్భ జలాన్ని సహజ సిద్దముగా అత్యంత ఉన్నత స్థాయి స్వచ్ఛతకు వడకడతాయి. అటువంటి నీటిని ఊటలు, మానవులచే త్రవ్వబడిన ఊటలు లేదా బోరింగు గుంతల లేదా బావుల ద్వారా సంగ్రహించవచ్చు. లోతైన భూగర్భములోని నీరు సాధారణముగా ఉన్నత స్థాయి నాణ్యతని బాక్టీరియా అధ్యయనములో కలిగి ఉంటుంది (అనగా వ్యాధులను కలిగించే బాక్టీరియా లేదా వ్యాధులను కలిగించే ప్రోటోజోవా అనేవి ఈ నీటిలో ఉండవు, కాని ఈ నీరు స్వతహాగా అత్యంత ఎక్కువ మొత్తాలలో కరిగి ఉన్న ఘనపదార్ధాలను ముఖ్యముగా కార్బోనేటులు, మరియు కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క సల్ఫ్హేటులను కలిగి ఉంటుంది. నీరు ప్రవహించినటువంటి పొరల పై ఆధారపడి నీటిలో ఇతర అయానులు అయినటువంటి క్లోరైడు మరియు బైకార్బోనేటులు కూడా ఉండవచ్చు. నీటిని తాగుటకు, వంటకు మరియు బట్టలు ఉతుకుటకు అనువుగా మార్చుటకు ఈ నీటి నుండి ఇనుము లేదా మాంగనీసు వంటి వాటి సాంద్రతను తగ్గించవలసి రావచ్చును. క్రిములను తొలగించుట కూడా అవసరపడవచ్చు. ఎక్కడైతే భూగర్బ జలమును పునరుత్తేజితము చేసే పద్ధతి పాటించబడుతుందో; ఈ పద్ధతిలో నది నీరు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడు దానిని భూగర్భములోని మట్టి లేదా రాతి పరుపులలోనికి ఎక్కించటము జరుగుతుంది కనుక ఆ నీరు కరవు సమయాలలో అందుబాటులోకి వస్తుంది; ఇది శుద్దీకరించవలసిన లోతట్టు ప్రాంతాల ఉపరితల నీటితో సమానమైన నాణ్యతను కలిగి ఉంటుంది.
 2. ఎత్తైన ప్రదేశాలలోని సరస్సులు మరియు నీటిని నిల్వ ఉంచు రిజర్వాయరులు: ఇవి స్వతహాగా నదీ జన్మస్థానాల వద్ద ఉంటాయి, ఎత్తైన ప్రదేశాలలోని నీటిని నిల్వ ఉంచు రిజర్వాయరులు సాధారణముగా మానవ నివాసాల కంటే ఎత్తైన ప్రాంతములో ఉంచబడతాయి మరియు కలుషితమయ్యే అవకాశాలను తగ్గించుటకు వాటిచుట్టు రక్షణ వలయము యేర్పరచబడి ఉంటుంది. బాక్టీరియా మరియు వ్యాధులను కలిగించు వాటి స్థాయిలు సాధారణముగా తక్కువగా ఉంటాయి, కాని కొన్ని బాక్టీరియా, ప్రోటోజోవా లేదా ఆల్గే ఈ నీటిలో ఉంటాయి. ఎత్తైన ప్రదేశాలు అడవులను కలిగి ఉన్నా లేదా తడిగా ఉండే ప్రదేశాలను కలిగి ఉన్నా ఆ ప్రాంతాలలో ఉండే హ్యూమిక్ యాసిడ్ లు నీటికి రంగును కలిగించవచ్చు. చాలా ఎత్తైన ప్రాంతాలు తక్కువ pH స్థాయిని కలిగి ఉంటాయి కనుక ఆ నీటికి సవరణలు అవసరము.
 3. నదులు, కాలువలు మరియు లోతట్టు ప్రాంతాలలోని నీటిని నిలువ ఉంచు రిజర్వాయరులు: లోతట్టు ప్రాంతాలలోని ఉపరితలములలోని నీరు గుర్తించదగిన బాక్టీరియాను మరియు ఇంకా ఆల్గే, అవసరములేని ఘనపదార్ధాలను మరియు విభిన్నమైన కరిగి ఉన్న పదార్ధాలను కలిగి ఉంటుంది.
 4. పర్యావరణము ద్వారా నీటిని సృష్టించటము అనేది గాలిని చల్లబరుచుట ద్వారా నీటి ఆవిరిని గాలి నుండి సంగ్రహించుట అనే ఆధునిక సాంకేతిక పద్ధతి. ఈ పద్ధతి అత్యంత ఉన్నత నాణ్యత కలిగిన తాగు నీటిని అందుబాటులోనికి తెస్తుంది.
 5. వర్షపు నీటిని తిరిగి ఉపయోగించుటకు పొందుట లేదా పొగమంచును సేకరించుట అనేవి నీటిని పర్యావరణము నుండి సేకరిస్తాయి. ఈ పద్ధతులను అత్యంత పొడి వాతావరణమును కలిగి ఉన్న ప్రాంతాలలోను మరియు అసలు వర్షపాతము లేనప్పటికీ పొగ మంచును కలిగి ఉండే ప్రాంతాలలోను ఉపయోగించవచ్చు.
 6. డిస్టిలేషన్ లేదా రివర్స్ ఓస్మోసిస్ వంటి విధానాల ద్వారా సముద్ర జలాల నుండి ఉప్పును ఇతర లవణాలను తొలగించుట.

శుద్దీకరణ[మార్చు]

ఈ క్రింద ఉన్న విధానాలు ఒకప్పుడు నీటి శుద్దీకరణ ప్లాంట్లలో సర్వసాధారణముగా ఉపయోగించబడినవి. ప్లాంటు యొక్క విస్తృతి మరియు నీటి నాణ్యత వంటి వాటి పై ఆదారపడి కొన్ని లేదా చాలా విధానాలను ఉపయోగించకపోవచ్చు.

శుద్దీకరణకు ముందు[మార్చు]

 1. ప్రవహింపచేయుట మరియు నియంత్రణ- నీటిలో చాలా మొత్తము దాని యొక్క మూలము నుండి ప్రవహింపచేయుట లేదా పైపులలోకి లేదా నీటిని నిలువ ఉంచు టాంకులలోకి మళ్ళించబడుతుంది. నీటికి కాలుష్యాలు చేరకుండా నిరోధించుటకు, ఈ భౌతిక వ్యవస్థలు సరియయిన వస్తువులను ఉపయోగించి నిర్మించబడాలి. తద్వారా యాద్రుచ్చికముగా జరిగే కలుషితము జరుగదు.
 2. వేరుపరచుట (వేరుపరచు వడపోతను కూడా చూడండి ) - ఉపరితలము పై ఉన్న నీటిని శుభ్రపరచుటలో మొదటి దశ నీటి నుండి పెద్ద పెద్ద కర్రలు, ఆకులు, చెత్త, మరియు ఇతర పెద్ద పెద్ద కణాల వంటి చెత్త వస్తువులను తొలగించుట మరియు ఇవి నీటిలో ఉన్నట్లయితే తరువాత వచ్చే నీటి శుద్దీకరణ దశలలో అవరోధములను కలిగించవచ్చు. ఎక్కువ లోతులోని భూగర్బ జలమునకు ఈ వేరుపరచు శుద్దీకరణ దశ ఇతర శుద్దీకరణ దశలకు ముందు అవసరము లేదు.
 3. నిలువ ఉంచుట - నదీ జలాలను నది ఒడ్డున ఉండే నీటిని నిలువ ఉంచు రిజర్వాయరులలో కొన్ని దినాల నుండి కొన్ని నెలల వరకు ప్రకృతి సిద్దముగా జరిగే శుద్దీకరణ జరుగుటకు అనువుగా నిలువ ఉంచవచ్చు. ఇది ఒకవేళ శుద్దీకరణ ఇసుక అమరికల ద్వారా వడపోత జరిగినట్లయితే ఈ విధముగా నిలువ ఉంచుట అత్యవసరము. నీటిని నిలువ ఉంచు రిజర్వాయరులు తక్కువ కాలము ఉన్న కరువు రోజులను ఎదుర్కొనుటకు ఉపయోగపడతాయి లేదా నదీ మూలాలలో అప్పుడప్పుడు సంభవించు కాలుష్యము వల్ల ప్రవాహాలలో ఏర్పడు కలుషిత సంఘటనల కాలములో నీటి సరఫరాను నిర్వహించుటకు ఉపయోగపడతాయి.
 4. ముందు మార్పుచేయుట - అధిక మొత్తాలలో గట్టి ఉప్పును కలిగి ఉన్న నీటిని షోడా యాష్ (సోడియం కార్బోనేటు) తో సాదారణ అయాన్ ప్రభావముని ఉపయోగించుట ద్వారా కాల్షియం కార్బోనేటును వేగవంతముగా బయటకు తోయుట ద్వారా శుద్దీకరిస్తారు.
 5. ముందుగా క్లోరినేషను చేయుట - చాలా ప్లాంట్లలో లోపలికి వచ్చు నీటిని పైపులలోను మరియు టాంకుల లోను వాసన కలుగ చేయు జీవుల పెరుగుదలను తగ్గించుటకు క్లోరినేషను చేస్తారు. ఇతర శక్తివంతమైన ప్రతికూల నాణ్యతా ప్రభావాల వలన (క్లోరిన్ ను క్రింద చూడండి) ఈ విధానము నిలిపివేయబడింది.[ఉల్లేఖన అవసరం][6 ]

అతిచిన్న ఘన పదార్దాలను, సూక్ష్మ జీవులను మరియు కరిగిఉన్న నిర్జీవ మరియు సజీవ పదార్ధాలను తొలగించుటకు అనేక విస్తృత విధానాలు అందుబాటులో ఉన్నాయి. శుద్దీకరించ వలసిన నీటి నాణ్యత, శుద్దీకరణ విధానపు ఖరీదు మరియు శుద్దీకరించ బడవలసిన నీటి నుండి శుద్దీకరించబడిన తరువాత ఆశిస్తున్న నాణ్యత వంటి వాటి మీద ఆధారపడి శుద్దీకరణ విధానాన్ని ఎన్నుకోవటము జరుగుతుంది.

pH క్రమబద్దీకరణ[మార్చు]

ఉప్పు మరియు ఇతర లవణాలు తొలగించబడిన నీరు 7 pH ని కలిగి ఉంటుంది (ఆల్కలిన్ కాని యాసిడ్ కాని ఉండదు) మరియు సముద్ర జలాలలో సాధారణముగా 8 .3 pH ఉంటుంది (కొద్దిగా ఆల్కలిన్ గుణాన్ని కలిగి ఉంటుంది). నీరు కనుక యాసిడ్ లక్షణాన్ని కలిగి ఉంటే (7 కంటే తక్కువ), లైమ్, షోడా యాష్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ ను pH స్థాయిని పెంచుటకు కలుపుట జరుగుతుంది. యాసిడ్ మరియు ఆల్కలిన్ లక్షణాన్ని కొంతవరకు కలిగిన నీటి యొక్క (6 .5 కన్నా తక్కువ pH )[ఉల్లేఖన అవసరం][7 ] pH ను పెంచుటకు ఫోర్సుడ్ డ్రాఫ్ట్ డి గ్యాసిఫయర్స్ అతి తక్కువ ఖర్చుతో కూడిన విధానాలు. ఇవి నీటిలోని కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ (కార్బోనిక్ యాసిడ్) ను వికేంద్రీకరించటము ద్వారా నీటిలోని pH స్థాయిని పెంచుతాయి. పురపాలక నీటి యొక్క pH స్థాయిని క్రమబద్దీకరించుటకు సాధారణముగా లైమ్ ను వాడతారు లేదా ఇది తక్కువ ఖర్చుతో కూడినందు వల్ల నీటిని శుద్దీకరించే ముందు శుద్దీకరణ ప్లాంట్ వద్ద దీనిని వాడతారు. అయితే ఇది నీటి యొక్క గాఢతను పెంచుట ద్వారా అయానిక్ స్థాయిని పెంచుతుంది. నీటికి కొద్దిగా క్షార గుణమును కలిగించుట అనేది తేర్చుట మరియు ఫ్లోక్కులేషణ్ వంటి విధానాలు సమర్ధవంతముగా పనిచేయునట్లు చేస్తుంది మరియు సీసపు పైపుల నుండి మరియు పైపులను అతికించు సీసము కరిగి నీటిలో కలుచుట వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. కొన్ని సందర్భాలలో క్షార గుణము కలిగినటువంటి నీటి యొక్క pH స్థాయిని తగ్గించుటకు ఆ నీటికి యాసిడ్ (HCI లేదా H2SO4 ) ని కలపవచ్చు. క్షార గుణము కలిగినటువంటి నీటిని ఉపయోగించటము వలన కచ్చితముగా పైపులనుండి సీసము మరియు రాగి నీటిలో కరుగవు అనుటకు వీలు లేదు కాని సాధారణముగా 7 కంటే ఎక్కువ pH స్థాయి ఉన్నటువంటి నీరు బరువైన లోహాలను కరిగించు అవకాశము pH 7 కంటే తక్కువ ఉన్న నీటి కంటే తక్కువ.

గుంటల ఉపరితలము పై తేలుతున్న మలినములు
గుంటల నుండి మలినములను బయటికి నెట్టి వేయు యాంత్రిక విధానాలు

ఫ్లోక్కులేషన్[మార్చు]

ఫ్లోక్కులేషన్ అనేది నీటిని స్వచ్ఛముగా చేయు పద్ధతి. స్వచ్ఛముగా తయారుచేయుట అనగా నీటినుండి బురదను లేదా రంగును తొలగించుట ద్వారా నీటిని స్వచ్ఛముగా రంగు లేకుండా చేయుట. స్వచ్ఛతను కలిగించుట అనేది నీటిలోని అణువులను క్రిందికి తేరు కొనేటట్లు చేసి తేరుకున్న దాన్ని భౌతిక విధానాలను ఉపయోగించి తీసివేయుట. ప్రారంభములో ఈ తేరుకోనే పదార్ధము చిన్న చిన్న కణాలుగా ఏర్పడుతుంది కాని నీటిని చిన్నగా కలుపుట వలన ఈ అణువులు అన్నీ ఒక దానితో ఒకటి కలిసి పెద్ద అణువులుగా ఏర్పడతాయి- ఈ ప్రక్రియ కొన్ని సార్లు ఫ్లోక్కులేషన్ అని కుడా పిలవబడుతుంది. శుద్ధి చేయని నీటిలో సహజముగా ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు కిందకి తేరుకున్నటువంటి అణువుల పైన చేరుతాయి మరియు అవి తేర్చు పద్ధతిలో ఏర్పడినటువంటి పెద్ద అణువులతో కలిసి పోతాయి. ఈ విధముగా తేర్చు విధానము చాలా వరకు అవసరము లేని పదార్ధాన్ని నీటి నుండి తీసి వేస్తుంది మరియు ఆ తరువాత సాధారణముగా గట్టి ఇసుక ద్వారా వడపోయుట లేదా కొన్ని సార్లు ఇసుక మరియు ఎక్కువ కార్బన్ తక్కువ ఆవిరి గుణము కలిగిన యాన్త్రసైట్ (ఎక్కువ కార్బన్ మరియు తక్కువ ఆవిరి గుణము కలిగిన బొగ్గు) కణాల ద్వారా నీరు వడకట్టబడుతుంది. తేర్చుటకు/ఫ్లోక్కులేషన్ కు ఉపయోగించు మాధ్యమాలు:

 1. ఇనుము (III ) హైడ్రాక్సైడ్. ఇది pH 7 లేదా అంతకంటే ఎక్కువ స్థాయి కలిగినటువంటి శుద్దీకరింప బడని నీటికి ఇనుము కలిగిన నీటిని అనగా ఇనుము (III ) క్లోరైడ్ ను చేర్చుట ద్వారా ఏర్పరచబడుతుంది. ఇనుము (III ) హైడ్రాక్సైడ్ అనేది అస్సలు కరుగనిది మరియు 7 కంటే తక్కువ స్థాయి pH వద్ద కూడా ఏర్పడుతుంది. వ్యాపార సంబందమైన ఇనుప ఉప్పు పదార్ధాలు సాంప్రదాయకముగా UKలో కప్రస్ అనే పేరుతో విక్రయించబడుతున్నాయి.
 2. అల్యుమినియం హైడ్రాక్సయిడ్ కూడా ఫోక్కులేషణ్ ద్వారా తేర్చు విధానములో దీని ద్వారా సంభవించు ఆరోగ్య ప్రభావాల గురించి అనేక భయాలు మరియు తప్పుగా ఉపయోగించుట తీవ్రమైన విషప్రయోగ సంఘటనకు 1988 లో దక్షిణ - పశ్చిమ యుకే లోని కామేల్ఫోర్డ్ లో తేర్చు పదార్దాన్ని శుద్దీకరించిన నీటిని కలిగి ఉన్న రిజర్వాయరు లోనికి సరాసరి పంపించటము వలన దారి తీసినప్పటికీ విస్తృతముగా ఉపయోగించబడుతుంది.
 3. పాలీ DAMAC అనేది కుత్రిమముగా ఉత్పత్తి చేయబడిన పోలిమార్ మరియు ఇది ఇప్పుడు విస్తృతముగా ఉపయోగించబడుతున్న సింథటిక్ పాలిమర్ల తరగతికి చెందిన వాటిలో ఒకటి. ఈ పాలిమర్లు అధిక అణు భారాన్ని కలిగి ఉంటాయి మరియు ఇవి స్థిరమైన మరియు తొలగించుటకు వీలైన వ్యర్ధాలను ఏర్పరుస్తాయి. కానీ నిర్జీవ సంభందమైన పదార్ధాలతో ఖర్చుతో పోల్చి చూస్తే ఇది ఎక్కువ ఖరీదైన విధానము. ఈ పదార్ధాలు వాతావరణములో శిథిలమై కలిసిపోయేటు వంటివి.

తేర్చుట[మార్చు]

ఫ్లాక్కులేషను తొట్టి నుండి బయటకు వచ్చు నీరు క్లారిఫైర్ లేదా సెట్ట్లింగ్ తోట్టిగా పిలవబడే తేర్చు తొట్టి లోనికి ప్రవేశిస్తుంది. ఇది బురదను అడుగున చేరుటకు అవకాశము కల్పించే నిదానమైన ప్రవాహము కలిగిన ఒక పెద్ద తొట్టె. తేర్చు తొట్టె, ఫ్లోక్కులేషను తొట్టె పక్కనే ఉంటే మంచిది ఎందువల్లనంటే బురద లేదా తేరిన పదార్ధము బయటకు పోకుండా ఇది మార్గమును సుగమము చేస్తుంది. తేర్చు తొట్టెలు దీర్ఘచతురస్త్రముగా ఉంటే నీరు ఈ చివర నుండి ఆ చివరకు ప్రవహిస్తుంది లేదా గుండ్రముగా ఉంటే అది మధ్యలోనుండి బయట వైపుకు ప్రవహిస్తుంది. తేర్చు తొట్టె నుండి బయటకు ప్రవహించుట అనేది సన్నని చుక్కలుగా జరుగుతుంది కాబట్టి కేవలము ఒక సన్నని పై పొర ద్వారా మాత్రమే తేరిన పదార్ధము బయటకు రాగలుగుతుంది. నీటి నుండి తేరుకునే పదార్ధము యొక్క పరిమాణము తొట్టె యొక్క నిలువ కాలము మరియు తొట్టె లోతుపై ఆధారపడి ఉంటుంది. నీటి నిలువ కాలము పెద్ద తొట్టె యొక్క ఖరీదుతో సమతూకము గావించబడాలి. కనీస క్లారిఫైర్ నిలువ కాలము సాధారణముగా 4 గంటలు. లోతైన తొట్టె చిన్న తొట్టె కంటే ఎక్కువ వ్యర్ధాన్ని తేర్చుతుంది. ఎందువల్ల నంటే పెద్ద కణాలు చిన్న వాటి కంటే వేగముగా తేరుకుంటాయి, కాబట్టి పెద్ద కణాలు డీకొని చిన్న కణాలను అవి తేరుకోనే కొద్ది తమలో కలుపుకుంటాయి. దీని వల్ల పెద్ద కణాలు తొట్టెకి నిలువుగా వీస్తాయి మరియు చిన్న కన్నాలను అవి క్రిందికి చేరే మార్గములో శుభ్ర పరుస్తాయి.

కణాలు తొట్టె అడుగుకి చేరాక టాంకు యొక్క నేలపై బురద పొర ఏర్పడుతుంది. ఈ బురద పొరను తొలగించాలి మరియు శుద్దీకరించాలి. ఈ తేరుకున్న బురద పరిమాణము గుర్తించదగినది మరియు శుద్ధి చేసిన నీటి పరిమాణములో 3 నుండి 5 వంతులు ఉంటుంది. ఈ తేరుకున్న పదార్దాన్ని శుభ్రపరచుట మరియు పారవేయుట అనేది శుద్దీకరణ ప్లాంటు నిర్వహణ ఖర్చులో ముఖ్య భాగము. టాంకు యొక్క అడుగు భాగాన్ని నిరంతరముగా శుభ్ర పరచుటకు యాంత్రిక పరికరాలను ఏర్పరచవచ్చు లేదా ఎప్పుడైతే టాంకును శుభ్రపరచవలెనో అప్పుడు టాంకును ఉపయోగించకుండా ఉండవలెను.

వడకట్టుట[మార్చు]

ఒక దగ్గరికి చేరిన వ్యర్ధమును చాలా వరకు తీసివేసిన తరువాత చివరిదశగా నీటిలోని మిగిలి ఉన్న అవసరము లేని పదార్ధాలను మరియు ఇంకా తేరుకొని వ్యర్ధాలను తొలగించుటకు వడపోయటం జరుగుతుంది.

వేగవంతమైన ఇసుక వడ పోత యంత్రాలు[మార్చు]

కచ్చితమైన ఇసుక వడపోత యొక్క కట్ యవే వ్యూ

సర్వసాధారణమైన వడపోత యంత్రము వేగవంతమైన ఇసుక వడపోత యంత్రము. యాక్తివేటేడ్ కార్బన్ లేదా ఆన్త్రసైట్ బొగ్గు పొరను పైభాగములో తరచుగా కలిగి ఉండే ఇసుక ద్వారా నీరు పైకి క్రిందికి కదులుతుంది. పైన ఉన్న పొర రుచికి మరియు రంగుకి కారకమైన జీవ సంభంద పదార్ధాలను తొలగిస్తుంది. ఇసుక రేణువులకు మధ్యలో ఉండే స్థలము అతిచిన్న అవసరము లేని వ్యర్ధ అణువుల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ వడపోత సరిపోదు. చాలా వ్యర్ధ అణువులు ఉపరితలములోని పొరను దాటుకొని వస్తాయి కాని ఇవి రంద్రాలలో బంధించ బడటము లేదా ఇసుక అణువులకు అతుకుకొనుట జరుగును. సమర్ధ వంతమైన వడపోత లోతులలో జరిగే వడపోతలో ఉంటుంది. ఈ లోతులో ఉండే వనరులు వడపోత యంత్రము యొక్క సమర్ధవంతమైన పనితీరుకు కీలకము: పై పొరలోని ఇసుక అన్ని కణాలను ఆపివేసినట్లయితే వడపోత యంత్రము వేగముగా ఆగిపోతుంది.

వడపోత యంత్రమును శుభ్రపరచుటకు నీరు వేగముగా సాధారణ దిశకు వ్యతిరేకముగా పైకి ఆక్రమించిన అణువులను తొలగించుటకు ప్రవహిస్తుంది (ఇది వెనుకకు నెట్టుట లేదా వెనుకకు కడుగుట అని పిలువబడుతుంది). దీనికి ముందు కేంద్రీకృతమైన గాలి కింద నుండి వడపోత యంత్రము యొక్క చిక్కని మాద్యమమును తెరుచుట ద్వారా వెనుకకు కడుగు ప్రక్రియకు సహాయముగా పైకి చిమ్ముతుంది; ఇది ఎయిర్ స్కవురింగ్ అని పిలువబడుతుంది. ఈ కలుషిత నీటిని తేర్చబడిన పదార్ధము ఉన్న తొట్టెలోని వ్యర్ధముతో పాటుగా పడబోయవచ్చు లేదా ఈ నీటిని వడపోత యంత్రములోనికి ప్రవేశించు కొత్త నీటితో కలిపి శుభ్రపరచవచ్చు.

కొన్ని నీటి శుద్దీకరణ యంత్రాలు వత్తిడిని వడపోయు యంత్రాలను కలిగి ఉంటాయి. ఇవి వేగ వంతమైన భుమ్యాకర్షక వడపోత యంత్రాల సిద్దాంతములపై ఆధారపడి పనిచేస్తాయి. కాని యంత్రము యొక్క మాధ్యమము స్టీలు పాత్రను కలిగి ఉంటుంది మరియు నీరు వత్తిడి ద్వారా దీనిగుండా నెట్టబడుతుంది.

ప్రయోజనాలు

 • కాగితపు మరియు ఇసుక వడకట్టు ద్వారా తొలగించే వాటి కంటే అతిచిన్నని అణువులను వడకడుతుంది.
 • ఆన్ని రకాల అణువులను నిర్ధారించిన రంద్రాల కొలతల కంటే పెద్దవైన వాటిని కూడా సమర్దవంతముగా వడకడుతుంది.
 • అవి అతి సన్ననివి కనుక ద్రవాలు వాటి నుండి సరిపడినంత వేగముతో ప్రవహిస్తాయి.
 • అవి సరిపడినంత బలమైనవి కనుక అవి 2 నుండి 5 పర్యావరణాల వల్ల కలిగే వత్తిడిని అయినా తట్టుకొంటాయి.
 • అవి శుభ్ర పరచుటకు అనువైనవి (వెనుకకు నెట్టవచ్చు) మరియు తిరిగి ఉపయోగించ తగినవి.

వాహక వడపోత యంత్రాలు తాగు నీటిని వడపోయుటకు మరియు మురికి నీటిని (తిరిగి ఉపయోగించుట కొరకు) వడపోయుటకు విస్తృతముగా ఉపయోగిస్తున్నారు. తాగు నీటికొరకు వాహక వడ పోత యంత్రాలు 0 .2 um కంటే పెద్దవైన అన్నిరకాల అణువులను గార్దియా మరియు క్రిప్తోస్పోరిడియంతో సహా సమర్దవంతముగా తొలగించగలవు. వాహక వడపోత యంత్రాలు మూడవ స్థాయిలో నీటిని శుద్దీకరించుటకు అత్యంత ప్రభావవంతమైనవి. నీటిని పారిశ్రామిక, కొన్ని పరిమితమైన గృహ అవసరాలకు, లేదా నీటిని నదుల పక్కన ఉండే పట్టణ ప్రాంతాలు ఉపయోగించే నదులలోనికి వదులునప్పుడు ఈ పద్ధతి పాటించబడుతుంది. ఇవి పరిశ్రమలలో ముఖ్యముగా ద్రవాలను తయారుచేయు పరిశ్రమలలో ఉపయోగించ బడుతున్నాయి (సీసా నీటితో సహా). ఏదియేమయినప్పటికి నీటిలో స్వతహాగా కరిగి ఉన్న ఫాస్ఫరస్, నైట్రేటు మరియు భరువైన లోహపు అయానుల వంటివాటిని ఏ వడపోత విధానము కూడా తొలగించలేదు.

నిదానమైన ఇసుక వడ పోత విధానము[మార్చు]

నిదానమైన కుత్రిమ భూగర్భ నీటి వడపోత (నది ఒడ్డు వడపోతకు భిన్నమైనది), చెక్ రిపబ్లిక్ లోని కరని లోని నీటి శుద్దీకరణ ప్లాంట్

నిదానమైన ఇసుక వడ పోత విధానము నీరు వడపోత నిర్మాణము గుండా నిదానముగా ప్రవహించాలి కనుక ఎక్కడైతే సరిపడినంత భూమి మరియు స్థలము ఉంటాయో అక్కడ ఉపయోగించబడతాయి. ఇవి భౌతిక వడపోత ప్రక్రియల మీద కంటే జీవ సంభంద శుద్దీకరణ ప్రక్రియల మీద ఆధారపడతాయి. ఈ వడపోత నిర్మాణాలు సేకరించబడిన మంచి ఖటినమైన ఇసుక పొరలు, అడుగు భాగాన గ్రావెల్ తో మరియు పైన సన్నని ఇసుకతో ఏర్పరచిన పొరలతో జాగ్రత్తగా నిర్మించబడతాయి. అడుగు భాగాన ఉన్న ప్రవాహ మార్గాలు శుద్దీకరించబడిన నీటిని క్రిములు తొలగింపబడుటకు పంపిస్తాయి. వడపోత, నిర్మాణము యొక్క ఉపరితలముnపై వృద్ది చెందే జూగ్లియల్ లేదా schmutzdecke గా పిలువబడే జీవావరణ పొర మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమర్ధవంతమైన నిదానమైన ఇసుక వడపోత విధానము కొన్ని వారాలు లేదా కొన్ని నెలల వరకు పనిచేస్తుంది. శుద్దీకరణకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది భౌతిక పద్ధతులు సాధించ లేనటువంటి తక్కువ స్థాయిలో లవణాలు ఉన్నటువంటి నీటిని అందిస్తుంది. తక్కువ స్థాయిలో లవణాలను కలిగి ఉండుట వలన నీటిని సరఫరా వ్యవస్థ ద్వారా సురక్షితముగా తక్కువ స్థాయిలో క్రిమిసంహారకములను ఉపయోగించుట ద్వారా పంపించవచ్చు. తద్వారా క్లోరిన్ మరియు క్లోరిన్ ఉప ఉత్పాదనలను ఎక్కువ స్థాయిలో ఉపయోగించారు అనే వినియోగదారుని అసంతృప్తిని తగ్గించవచ్చు. నిదానమైన ఇసుక వడ పోత విధానము వెనుకకు కడుగ లేనిది; వాటిని పై పొర పై జీవము పెరిగి అవరోదిస్తున్నప్పుడు పై పొరలోని ఇసుకను తొలగించుట ద్వారా వీటిని నిర్వహించటము జరుగుతుంది.[ఉల్లేఖన అవసరం]

నిదానమైన ఇసుక వడపోత విధానము యొక్క ఒక ప్రత్యేకమైన పెద్ద స్థాయి రూపము ఏమిటంటే నది వడ్డున వడపోత విధానము. దీనిలో నదివడ్డున సహజ సిద్ధముగా ఉండే పదార్ధాలను ఉపయోగించి కలుషితాలను తొలగించుటకు మొదటి దశ వడపోత జరుగుతుంది. కాని ఈ నీరు తాగుటకు పనికి వచ్చేంత శుద్దమైనది కాదు కాని దీనికి అనుబంధముగా ఉన్న బావుల నుండి తీసుకునే నీరు కాలువల నుండి సరాసరి ఎక్కడైతే వడ్డున వడపోత తరచుగా జరుగుతుందో ఆ నీటి కంటే తక్కువ సమస్యాత్మకమైనది.

లావా వడకట్టు సాధనాలు[మార్చు]

లావా వడకట్టు సాధనాలు ఇసుక వడకట్టు సాధనాల వంటివి మరియు అవి సరిపడినంత భూమి మరియు సరిపడినంత ఖాళీ స్థలము ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుటకు అనువైనవి. నిదానమైన ఇసుక వడకట్టు సాధనాల వలే ఇవి కూడా భౌతిక శుద్దీకరణ ప్రక్రియలకంటే జీవావరణ సంబంద శుద్దీకరణ ప్రక్రియల పై వాటి యొక్క చర్యలకు ఆధారపడతాయి. నిదానమైన ఇసుక వడకట్టు సాధనాల వలే కాకుండా ఇవి లావా గులక రాళ్ళతో రెండు పొరలు మరియు లవణాలు లేని మట్టితో నిర్మించబడతాయి (కేవలము ప్లాంటు మూలాలలో). పైన ఐరిస్ స్యుడకోరాస్ మరియు స్పార్గేనియం ఎరేక్టం వంటి నీటి శుద్దీకరణ ప్లాంట్లు స్థాపించబడతాయి. సాధారణముగా 1 /4 దృక్కోణము కలిగిన లావా రాళ్ళు నీటిని శుద్దీకరించుటకు అవసరము. నిదానమైన ఇసుక ద్వారా నీటిని వడకట్టు విధానములో వలెనే దీనిలో కూడా వరుస క్రమములో ఒక శ్రేణి నీరు బయటకు పంపు వాహకాలు ఉంటాయి (లావా ఫిల్టర్లలో ఇవి అడుగు పొరలో ఉంచబడతాయి).[3][9 ]

అయానులను మరియు ఇతర కరిగి ఉన్న పదార్ధాలను తొలగించుట.[మార్చు]

ఆల్ట్రా వడపోత వాహకాలు రాసాయనికముగా తయారయిన అతి సూక్ష్మ రంద్రాలను కలిగిన పాలిమర్ వాహకాలను నీటిలో కరిగి ఉన్న పదార్ధాలను వాటిని మార్పు చేయ వలసిన అవసరము లేకుండా తొలగించుటకు ఉపయోగించ బడుతుంది. వాహక మాధ్యమము యొక్క రకము నీటిని నెట్టుటకు ఎంత వత్తిడి అవసరము అనే దానిని మరియు ఎంత పరిమాణములో ఉన్న సూక్ష్మ క్రిమి వడ పోయబడుతుంది అనే దానిని నిర్ణయిస్తుంది.

అయాను బదిలీ:[4][10 ][5][11 ][6][12 ][7][13 ][8][14 ] అయాను మార్పు విధానము అయాను మార్పు రెసిన్-లేదా జియోలైట్-పాక్ద్ కాలమ్స్ ని అవసరము లేని అయానులను తొలగించుటకు ఉపయోగిస్తుంది. చాలా సాధారణ సందర్భము నీటిని సున్నిత పరచుట అనేది Ca2 + మరియు Mg2 + అయానులను బినైన్ (సబ్బుకు అనుకూలమైన) Na + లేదా K + అనే అయానుల చేత పునర్ స్థాపించుట. అయాను బదిలీ రేసిన్స్ ను కూడా నైట్రేటు, సీసము, మెర్క్యురి, ఆర్సెనిక్ మరియు ఇంకా అనేక విషపూరిత రసాయనాలను తొలగించుటకు ఉపయోగించుట జరుగుతుంది.

ఎలెక్ట్రోడిఅయానైజేషను:[8][15 ][4][16 ] నీరు ఒక పోజిటివ్ ఎలక్ట్రోడ్ మరియు నెగెటివ్ ఎలేక్త్రోడ్ మధ్య ప్రవహిస్తుంది. అయాను బదిలీ వాహకములు కేవలము పోజిటివ్ అయానులను శుద్దపరచబడిన నీటి నుండి నెగెటివ్ ఎలక్ట్రోడ్ ల వైపు నెగెటివ్ అయానులను పోజిటివ్ ఎలేక్త్రోడ్ ల వైపు వలస వెళ్ళేటట్లు అనుమతిస్థాయి. అత్యంత ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన నీరు కేవలము అయాను బదిలీ శుద్దీకరణ విధానము కంటే కొద్ది భిన్నమైన విధానము ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. నీటిని అయానులను పూర్తిగా తొలగించుట ఎలక్త్రోడైయాలసిస్ అని పిలువబడుతుంది. నీరు తరచుగా రివర్స్ ఓస్మోసిస్ విభాగము ద్వారా అయానులు లేని జీవ సంభంద కాలుష్యాన్ని తొలగించుటకు ముందుగా శుద్దీకరించబడుతుంది.

ఇతర యాంత్రిక మరియు జీవ సంబందమైన పద్దతులు[మార్చు]

నీటిని పెద్ద స్థాయిలో శుద్ధి చేయుటకు ఉపయోగించు వివిధ పద్ధతులతో పాటుగా అనేక తక్కువ స్థాయి, తక్కువ (లేదా కాలుష్యాన్ని కలిగించని) కాలుష్యాన్ని కలిగించే పద్ధతులు నీటిని శుద్దీకరించుటకు ఉపయోగించబడుతున్నాయి. ఈ పద్ధతులు యాంత్రిక మరియు జీవసంబదమైన ప్రక్రియలను కలిగినవి. అవలోకనము

 • యాంత్రిక వ్యవస్థలు: ఇసుక వడపోత, లావా వడపోత విధానాలు మరియు UV - రేడియేషను మీద ఆదారపడిన వ్యవస్థలు)
 • జీవసంబంధిత వ్యవస్థలు
  • నిర్మించబడిన తడి నేలలు మరియు శుద్దీకరణ గుంటలు (కొన్ని సార్లు పొరపాటుగా ఇవి రీడ్ బెడ్స్ మరియు లివింగ్ వాల్ లు అని పిలువబడతాయి) వంటి ప్లాంటు వ్యవస్థలు మరియు
  • యాక్టివేటేడ్ స్లడ్జ్ సిస్టమ్స్, బయోరోటార్ లు, ఏయిరోబిక్ బయోఫిల్టర్ లు, యాన్ఎయిరోబిక్ బయోఫిల్టర్ లు, సబ్మర్జేడ్ ఎయిరేటేడ్ ఫిల్టర్ లు మరియు బయోరోల్ ల వంటి సంగ్రహ వ్యవస్థలు [9][18 ]

నీటిని తగినంత శుభ్రపరచుటకు వీటిలోని చాలా వ్యవస్థలు సాధారణముగా కలిపి సమర్దవంతముగా పనిచేయుటకు ఉపయోగించబడతాయి. ఈ వ్యవస్థలను కలుపుట అనేది రెండు లేదా మూడు స్థాయిలలో జరుగుతుంది ఇది ప్రాథమిక మరియు రెండవ దశ శుద్దీకరణ అని పిలవబడుతుంది. కొన్ని సార్లు మూడవ దశ శుద్దీకరణ విధానము కూడా కలపబడుతుంది.

క్రిములను నాశనము చేయుట[మార్చు]

క్రిములను నాశనము చేయుట అనేది ప్రమాధకారకమైన వ్యాధికారక క్రిములను వడపోత ద్వారా బయటకు పంపుట మరియు క్రిమిసంహారక రసాయనాలను నీటి శుద్దీకరణ చివరి దశలో నీటికి కలుపుట అనే రెండు విధానాల ద్వారా కూడా సాధ్యపడుతుంది. క్రిమిసంహారకాలను నీటిలో ఉంచుట అనేది వడపోత ద్వారా కూడా నీటిలోనికి ప్రవహించి నటువంటి వ్యాధికారక క్రిములను చంపుట కొరకు జరుగుతుంది. వైరస్లు, ఎస్కేరిశియ కోలి, క్యంపాలోబ్యాక్టార్, మరియు షిగెల్ల వంటి బ్యాక్టీరియా మరియు గియార్డియా లాంబ్లియ మరియు క్రిప్తోస్పోరిడియా వంటి ప్రోటోజువాలు ఈ వ్యాధి కారకాలలోనివి. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో నీరు వినియోగదారునికి చేరే ముందు కొన్ని రోజుల వరకు నిలువ ఉంటుంది కాబట్టి ప్రజా నీటి సఫరాలో ఈ క్రిమిసంహారాలను ఉపయోగించవలసి ఉంది. ఈ క్రిమిసంహారక రసాయనాలను కలిపిన తరువాత నీరు కొన్ని రోజులు కాంటాక్ట్ తొట్టి లేదా క్లియర్ వెల్ అని పిలువబడే నిలువ సాధనాలలో ఈ క్రిమిసంహారక చర్య పూర్తి అగుట కొరకు తాత్కాలికముగా నిలువ ఉంచటము జరుగుతుంది.

క్లోరిన్ ద్వారా క్రిములను సంహరించుట[మార్చు]

చాలా వరకు క్రిమిసంహారక విధానాలు సర్వ సాధారనముగా క్లోరిన్ ను లేదా దాని సంబదిత పదార్దాలైనటువంటి క్లోరోమిన్ లేదా క్లోరిన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించుతాయి. క్లోరిన్ ఒక శక్తివంతమైన ఆక్సిడెంటు ఇది అత్యంత వేగముగా అనేక వ్యాధి కారక సూక్ష్మ క్రిములను చంపుతుంది. ఎందువల్లనంటే క్లోరిన్ ఒక విషపూరిత వాయువు మరియు దీనిని ఉపయోగిస్తున్నప్పుడు ఈ విష వాయువు వెలువడే ప్రమాదము కూడా ఉంది. ఈ సమస్య సోడియం హైపోక్లోరైట్ అనే తక్కువ ఖర్చుతో కూడిన ద్రవమును ఉపయోగించుట ద్వారా పరిష్కరించబడుతుంది. ఎలాగంటే ఈ ద్రావణము నీటిలో కరిగినప్పుడు ఫ్రీ క్లోరిన్ ను విడుదల చేస్తుంది. సాధారణ ఉప్పు ద్రావణములను విద్యుత్ వాహకముల ద్వారా రసాయనిక చర్య గావించుట ద్వారా క్లోరిన్ ను అప్పటికి అప్పుడు తయారు చేయవచ్చు. ఘన రూపములో ఉన్న కాల్షియం హైపోక్లోరైట్ అనేది నీటిలో కలిసిన వెంటనే క్లోరిన్ ను విడుదల చేస్తుంది. ఈ ఘన పదార్దాన్ని ఉపయోగించుట అనేది ఎక్కువ మానవ శక్తి పైన ఆధారపడి ఉన్నది ఎందువల్లనంటే సంచులను తెరచుట మరియు పోయుట వంటివి వాయు సిలిండర్లు లేదా బ్లీచ్ వంటి సులభముగా యంత్రాలతో చేయగలిగే వాటిలా కాకుండా మానవులచే నిర్వహించబడాలి. ద్రవ రూపములో ఉన్న సోడియం హైపోక్లోరైట్ ను తయారు చేయుట తక్కువ ఖర్చుతో కూడినది మరియు వాయువు లేదా ఘన రూపములో ఉన్న క్లోరిన్ ల లాగా కాక ఉపయోగించుటకు సురక్షితమైనది. క్లోరిన్ ఉపయోగములో కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కూడా క్లోరిన్ యొక్క అన్ని రూపాలు విస్తృతముగా ఉపయోగించబడుతున్నాయి. క్లోరిన్ ను ఏవిధమైన రూపములో ఉపయోగించినప్పటికీ ఒక ముఖ్యమైన ప్రతికూలత ఏమిటంటే ఇది ప్రాకృతిక జీవులతో నీటిలో కలిసినప్పుడు ప్రతి చర్య జరిగి ట్రైహాలోమీథేన్ లు (THMs ) మరియు హాలోఏసిటిక్ యాసిడ్ (HAAs ) లు అనే ప్రమాదకర రసాయన ఉప ఉత్పాదనలను తయారు చేస్తుంది. ఇవి రెండూ కూడా ఎక్కువ మొత్తములో కాన్సర్ కారకాలు మరియు యునైటెడ్ స్టేట్స్ వాతావరణ పరిరక్షణ విభాగము (EPA ) మరియు యుకే లోని తాగు నీటి తనిఖీ విభాగాలు దీనిని నియంత్రించినవి. ట్రైహాలోమీథేన్ లు (THMs ) మరియు హాలోఏసిటిక్ యాసిడ్ (HAAs ) లు ఏర్పడుటను తగ్గించుటకు నీటినుండి సాధ్యమైనంత వరకు ఎక్కువ క్రిములను క్లోరిన్ ను కలుపుటకు ముందే సమర్ధ వంతముగా తొలగించవలెను. క్లోరిన్ బ్యాక్టీరియాను సమర్ధ వంతముగా చంపగలిగినప్పటికి నీటిలో గడ్డల వలే ఏర్పడే ప్రోటోజువాను ఎదుర్కొనుటలో దీనికి పరిమిత ప్రభావము ఉన్నది (గియార్దియా లాంబ్లియ మరియు క్రిప్తోస్పోరిడియం రెండూ కూడా వ్యాధి కారకాలు).

క్లోరిన్ డైఆక్సైడ్ తో క్రిములను చంపుట[మార్చు]

ఎలిమెంటల్ క్లోరిన్ కన్నా క్లోరిన్ డైఆక్సైడ్ అత్యంత వేగముగా పనిచేసే క్రిమి సంహారకము, ఏమయినప్పటికీ ఇది చాలా అరుదుగా ఉపయోగించ బడుతుంది, ఎందువల్ల నంటే ఇది కొన్ని పరిస్థితులలో యునైటెడ్ స్టేట్స్ లో తక్కువ స్థాయిలో అనుమతించబడిన క్లోరైట్ ను అధిక మొత్తములో ఉత్పత్తి చేస్తుంది. క్లోరిన్ డైఆక్సైడ్ నీరువంటి ద్రవ రూపములో లభిస్తుంది మరియు అది ఉత్పత్తి చేసే గ్యాస్ ను నియంత్రించే సమస్యలను తప్పించుకొనుటకు దీనిని ద్రవ రూపములో నీటికి కలుపుట జరుగుతుంది; క్లోరిన్ డైఆక్సైడ్ యొక్క గ్యాస్ సేకరణలు ఊహించ కుండా పేలే ప్రమాదము ఉంది.

క్లోరోమిన్ తో క్రిములను చంపుట[మార్చు]

క్రిమిసంహారిణిగా క్లోరోమిన్ ను వాడటము సర్వ సాధారణముగా మారుతుంది. క్లోరోమిన్ బలమైన యాంటి ఆక్సిడెంటు కాక పోయినప్పటికీ ఇది క్లోరిన్ కంటే ఎక్కువ కాలము ఉండే ప్రభావాన్ని కలిగిస్తుంది మరియు ఇది THMs లేదా హాలోయసిటిక్ యాసిడ్లను ఏర్పరచదు. క్లోరిన్ కలిపిన నీటికి అమ్మోనియాను కలుపుట ద్వారా క్లోరిన్ ను క్లోరోమిన్ గా మార్చుట సాధ్యపడుతుంది. క్లోరిను మరియు అమ్మోనియా ప్రతిచర్య జరుపుట ద్వారా క్లోరోమిన్ ను ఏర్పరుస్తాయి. క్లోరోమైన ద్వారా క్రిమిసంహరణ కావించిన నీటి పంపిణీ వ్యవస్థ నైట్రిఫికేషణ్ ను ఎదుర్కొనవచ్చు, ఎందువల్లనంటే అమ్మోనియా బ్యాక్టీరియా పెరుగుదలకు పోషణగా పనిచేస్తుంది తద్వారా దాని యొక్క ఉపఉత్పాదనగా నైట్రెట్లు ఏర్పరచబడతాయి.

ఓజోన్ క్రిమిసంహారణ[మార్చు]

O3 అనేది స్థిరము లేని పరమాణువు. ఇది అనేక నీటిలో ఉద్భవించు జీవులకు విషకారకముగా పనిచేసే శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజంటును ఒక ఆక్సిజన్ పరమాణువు ద్వారా ఏర్పరుస్తుంది. ఇది యురోపులో విస్తృతముగా ఉపయోగించబడుతున్న ఒక బలమైన, విస్త్రుత పరిధి కలిగిన క్రిమిసంహారకము. ఇది ప్రమాదకరమైన గడ్డలను కలిగించు ప్రోటోజువాను నిస్తేజము చేయుటకు ఒక శక్తివంతమైన పద్ధతి. ఇది దాదాపు అన్ని రకాలైన వ్యాధికారకాలపై సమర్ధవంతముగా పనిచేస్తుంది. ఓజోన్ అనేది ఆక్సిజన్ ను ఆల్ట్రావయొలెట్ కిరణము ద్వారా ప్రసరింప చేయుటవలన లేదా ఒక "చల్లని" విద్యుత్ వాహకము ద్వారా ప్రసరింప చేయుట ద్వారా తయారు చేయబడుతుంది. ఓజోన్ ను క్రిమిసంహారిణిగా వాడుటకు దానిని తప్పనిసరిగా నీటిని శుద్ధి చేయు ప్రదేశములోనే తయారు చేయాలి మరియు దానిని బుడగల ద్వారా నీటికి కలపాలి. ఓజోన్ యొక్క కొన్ని ఉపయోగాలు ఏమిటంటే అది ప్రమాదకరమైన ఉప ఉత్పాదనలను చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది (క్లోరినేషనుతో పోల్చిచూసినప్పుడు) మరియు ఓజోనైజేషను వల్ల రుచి మరియు వాసన ఏర్పరచబడవు. ఓజోనైజేషను చాలా తక్కువ ఉపఉత్పాదనలను ఏర్పరచినప్పటికి ఓజోన్ తక్కువ స్థాయిలో అనుమానించదగిన కార్సినోజన్ బ్రోమేట్ ను నీటిలో ఉత్పత్తి చేస్తుంది అని ఈ మధ్య కనిపెట్టబడింది. కానీ శుద్ధి చేయబడిన నీటిలో బ్రోమైన్ అసలు ఉండరాదు. ఓజోన్ యొక్క ఇంకొక ప్రతికూలత ఏమిటంటే ఇది నీటిలో క్రిమిసంహారకాలు ఏవి మిగలకుండా చేస్తుంది. 1906 నుండి ఓజోన్ ను తాగు నీటి ప్లాంట్లలో ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటి పారిశ్రామిక ఓజోనైజేషను ప్లాంట్ ఫ్రాన్స్ యొక్క నైస్ లో కట్టబడింది. యు.ఎస్ ఆహార మరియు మందుల నిర్వహణ విభాగము ఓజోన్ ని సురక్షితమైనదిగా అంగీకరించినది; ఆహారాల యొక్క శుద్దీకరణ, నిలువ ఉంచు ప్రక్రియలో దీనిని యాంటి మైక్రోబయోలాజికల్ ఏజంటుగా ఉపయోగిస్తున్నారు.

ఆల్ట్రావైయోలేట్ ద్వారా క్రిమిసంహరణ[మార్చు]

ఆల్ట్రా వైయోలేట్ కిరణాలు గడ్డలను నిస్తేజము చేయుటలో అత్యంత ప్రభావవంతమైనవి. నీరు తక్కువ స్థాయిలో రంగును కలిగి ఉన్నంత కాలము UV నీటి చేత గ్రహింపబడకుండా ప్రయాణిస్తుంది. UV రేడియేషన్ యొక్క ప్రధానమైన ప్రతికూలత ఏమిటంటే ఇది కూడా ఓజోన్ శుద్దీకరణ వలెనే క్రిమిసంహారకాలను నీటిలో మిగల్చదు. ఓజోన్ కానీ UV రేడియేషను కానీ ఏవిధమైన క్రిమిసంహారకాలను నీటిలో మిగల్చనందున కొన్ని సార్లు తప్పని సరిగా వీటిని ఉపయోగించిన తరువాత కొన్ని క్రిమిసంహారకాలను నీటిలో కలప వలెను. పైన చర్చించిన ప్రాథమిక క్రిమిసంహారకమైన క్లోరోమిన్ ను కలుపుట ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ విధముగా క్లోరోమిన్ ను ఉపయోగించి క్లోరినేషను చేసినప్పుడు చాలా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ క్లోరోమిన్ సమర్ధవంతమైన నీటిలో ఉండే క్రిమిసంహారకముగా పనిచేస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా క్రిములను చంపుట[మార్చు]

ఓజోన్ మార్గములోనే పనిచేస్తుంది. ఉత్తేజితాలైనటువంటి ఫార్మిక్ ఆసిడ్ వంటి వాటిని క్రిమిసంహారక సామర్ధ్యమును పెంచుటకు తరచుగా కలుపుట జరుగుతుంది. దీనికున్న ఒక లోపము ఏమిటంటే ఇది చిన్నగా పనిచేస్తుంది, ఫైటోటాక్సిక్ ఎక్కువ మొత్తములో ఉంటుంది, మరియు ఇది శుభ్రపరచిన నీటి యొక్క pH స్థాయిని తగ్గిస్తుంది.

అనేక సులభముగా నిర్వహించ గలిగిన క్రిమిసంహారక విధానాలు.[మార్చు]

ఇవి అత్యవసర పరిస్థితికి మరియు లోపలి దూరముగా ఉన్న ప్రదేశాలకు అందుబాటులో ఉన్నాయి. క్రిములను చంపుట అనేది దీని యొక్క ప్రధానమైన లక్ష్యము ఎందువల్లనంటే చూచుట వల్ల నిర్దారించే రుచి, వాసన, ఆకారము మరియు రసాయనిక కాలుష్యము అనేవి తాగు నీటి యొక్క సురక్షితత్వమును తక్కువ కాలానికి ప్రభావితము చేయలేవు.

సౌర శక్తి ద్వారా నీటి లోని క్రిములను తొలగించుట[మార్చు]

ప్రాంతీయముగా లభించు వస్తువులతో సౌర శక్తి ద్వారా నీటిలోని క్రిములను చంపుట (SODIS ) అనేది తక్కువ ఖర్చుతో కూడిన క్రిమిసంహారక పద్ధతి.[10][21 ][11][23 ][12][25 ][13][26 ] ఇది వంట చెరకు మీద ఆధారపడిన విధానాల లాగా కాకుండా వాతావరణము మీద తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఈమధ్య కాలములోని ఒక అధ్యయనము ఏమి కనిపెట్టినది అంటే సౌర శక్తి ద్వారా క్రిములను చంపి వెలుతురు తగలని ప్రదేశములో నిలువ వుంచిన నీటిలో వేగ వంతముగా పునరుత్పత్తి చేసే వైల్డ్ సాల్మొనెల్ల అనేది ఈ నీటిలో కేవలము మిలియనులో పదవ వంతు హైడ్రోజను పెరాక్సయిడ్ ను కలుపుట వల్ల నిరోధించబడుతుంది.[14][28 ]

అదనపు శుద్దీకరణ అవకాశాలు[మార్చు]

 1. నీటికి ఫ్లోరిన్ ను చేర్చుట (ఫ్లోరిడేషన్) : చాలా ప్రాంతాలలో పంటి పుచ్చులను అరికట్టుట లక్ష్యముగా నీటికి ఫ్లోరైడ్ ను కలుపుట జరుగుతుంది.[15][30 ] ఫ్లోరైడ్ సాధారణముగా క్రిమిసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత కలుపుబడుతుంది. యు ఎస్ లో ఫ్లోరిడేషను నీటిలో కరిగి ఫ్లోరైడ్ అయానులను సృష్టించే హెక్సాఫ్లోరోసిలికిక్ యాసిడ్ [16][32 ]ను నీటికి కలుపుట ద్వారా పూర్తి చేయబడుతుంది.[17][34 ]
 2. నీటి కండిషనింగ్: ఇది నీటి గాఢత యొక్క ప్రభావాలను తగ్గించే పద్ధతి. ఘాడ లవణాలు నీటి యొక్క వ్యవస్థలలో పేరుకుపోవుట అనేది బైకార్బోనేటు అయానులు శిథిలమగుట ద్వారా తారాస్థాయికి చేరుకున్న కాల్షియం లేదా మెగ్నీషియం ద్రావకములో నుండి గడ్డల రూపములో ఉండే కార్బోనేటు అయానులను ఏర్పరుస్తుంది. అధిక స్థాయిలోని ఘాడ లవణాలతో పేరుకు పోయిన నీటిని కామన్ అయాన్ ప్రభావము ద్వారా అధిక మోతాలలో ఉన్న లవణాలను తేర్చగలిగేటటువంటి షోడా యాష్ (సోడియం కార్బోనేట్) తో శుద్దీకరించవచ్చు. ఇది ఉన్నత నాణ్యత కలిగిన కాల్షియం కార్బోనేట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ తేర్చబడిన కాల్షియం కార్బోనేట్ సాంప్రదాయకముగా టూత్ పేస్టు తయారీదారులకు అమ్మబడుతుంది. అనేక పారిశ్రామిక మరియు గృహ సంబంద శుద్దీకరణ విధానాలు అయస్కాంత లేదా/మరియు విద్యుత్ అంశాలను (సాధారణ విజ్ఞాన పరమైన అనుమతి లేకుండానే) చేర్చుట నీటి యొక్క గాఢతను తగ్గించుటలో ప్రభావవంతముగా పనిచేస్తుంది అని చెప్పుట జరుగుతుంది.[ఉల్లేఖన అవసరం]
 3. సీసము కరుగుటను తగ్గించుట: స్వతహాగానే యాసిడ్ ను కలిగి ఉండే ప్రాంతాలలోని తక్కువ ఉష్ణ వాహక మైనటువంటి నీరు (అనగా ఎత్తైన కొండలలోని నిప్పు రాళ్ళ ఉపరితలముపై పడినటువంటి వర్షపు నీరు), అది ప్రవహిస్తున్న పైపులలోనుండి సీసమును కరిగించుకోనే శక్తిని కలిగి ఉంటుంది. తక్కువ మొత్తములలో ఫాస్ఫేటు అయానుని కలుపుట మరియు pHని కొద్దిగా పెంచుట ద్వారా ఇవి రెండూ పైపుల యొక్క లోపలి భాగములో కరుగుటకు వీలులేని సీసపు లవణాలను ఏర్పరుచుట ద్వారా సీసము నీటిలో కలవటాన్ని అరికడతాయి.
 4. రేడియాన్ని తొలగించుట: కొన్ని భూగర్భ జలాలు రేడియో యాక్టివ్ రసాయన పదార్ధమైనటువంటి రేడియాన్ని కలిగి ఉంటాయి. దీనికి ముఖ్య మూలాలు ఇల్లినాయిస్ లోని తూర్పు ఇల్లినాయిస్ నది యొక్క భూగర్భ జలముల మూలాలలో ఉన్నాయి. రేడియాన్ని అయానులను బదిలీ చేయుట లేదా నీటి కండిషనింగ్ ద్వారా తొలగించవచ్చు. దీని ద్వారా వచ్చిన వ్యర్ధము లేదా బురద తక్కువ స్థాయి కలిగినటువంటి రేడియో యాక్టివ్ వ్యర్ధము.
 5. ఫ్లోరైడ్ ను తొలగించుట: చాలా ప్రదేశాలలో నీటికి ఫ్లోరైడ్ ను చేర్చినప్పటికీ ప్రపంచము లోని కొన్ని ప్రాంతాలు చాలా ఎక్కువ స్థాయిలో ప్రకృతి సిద్దమైన ఫ్లోరైడ్ ను నీటి మూలాలలో కలిగి ఉన్నాయి. అధిక స్థాయిలలోని ఫ్లోరైడ్ విషకారకము కావచ్చు లేదా సౌన్ధర్యముపై కోరుకోననటువంటి పళ్ళ పైన మచ్చలను ఏర్పరుచుట వంటి ప్రభావాలను కలిగించ వచ్చు. ఫ్లోరైడ్ కూడా తెలిసినటువంటి కాన్సర్ కారకము. యాక్తివేటేడ్ అల్ల్యుమినతో శుద్దీకరించుట అనేది ఫ్లోరైడ్ స్థాయిలను తగ్గించుటకు ఒక పద్ధతి.

ఇతర నీటి శుద్దీకరణ విధానాలు[మార్చు]

ఇతర నీటి శుద్దీకరణ పద్ధతులు ముఖ్యముగా స్థానిక వ్యక్తిగత సరఫరా విధానాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. కొన్ని దేశాలలో వీటిలో కొన్ని పద్ధతులు పెద్ద స్థాయిలో జరుగు పురపాలక నీటి సరఫరాకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమైనవి డిస్టిలేషన్ (సముద్ర జాలాలలోని ఉప్పును మరియు లవణాలను తొలగించుట) మరియు రివర్సు ఓస్మోసిస్.

 1. మరిగించుట: నీటిలో సాధారణముగా గది ఉష్ణోగ్రత వద్ద నివసించే సూక్ష్మ క్రిములను అచేతనము చేయుట లేదా చంపుటకు తగినంత సమయము నీటిని తగినంతగా వేడి చేయుట. సముద్ర మట్టము వద్ద కనీసము ఒక నిమిషము తీవ్ర స్థాయిలో శక్తివంతముగా మరిగించుట సరిపోతుంది. ఎక్కువ ఆల్టిట్యూడ్లు కలిగిన ప్రాంతాలలో (2 కిలో మీటర్ల కంటే ఎక్కువ లేదా 5000 అడుగులు) మూడు నిమిషాలు సిఫార్సు చేయబడింది.[18][36 ] నీరు ఎక్కువ "సాంద్రత"ను కలిగి ఉండే ప్రాంతాలలో (నీరు చెప్పుకోదగిన స్థాయిలో కరిగి ఉన్న కాల్షియం ఉప్పులను కలిగి ఉంటుంది) నీటిని మరిగించుట బైకార్బోనేటు అయానులను శిథిలము చేసి కాల్షియం కార్బోనేటును కొంతవరకు తేరుకోనేలా చేస్తుంది. ఇదే ఎక్కువ సాంద్రత కలిగిన నీరు ఉన్న ప్రదేశాలలోని నీటిని మరగించు విద్యుత్ యంత్రాలు మొదలగు వాటిపై పేరుకోనేటటువంటి పదార్ధము. కాల్షియాన్ని తప్పించి మరిగించుట అనేది ఇతర కరిగి ఉన్న పదార్ధాలను తొలగించలేదు నిజానికి నీటి మరిగింపు స్థాయి కంటే ఎక్కువ మరిగించుట ఈ కరిగి ఉన్న పదార్ధాల సాంద్రతను పెంచుతుంది (ఎందువలన అంటే కొంత నీరు ఆవిరి రూపములో తగ్గిపోవుట వలన). మరిగించుట నీటిలో ఉన్న క్రిమిసంహారాలను ఉంచదు. అందువల్ల బాగా మరిగించి చాలా రోజులు నిలువ ఉంచిన నీరు కొత్త వ్యాధి కారక క్రిములను వృద్ధి చేసుకోవచ్చు.
 2. కణములుగా చేసిన కార్బన్ వడపోత: ఎత్తైన ఉపరితలమును కలిగిన ఉత్తేజ పరచిన కార్బన్ రసాయనిక పదార్ధాలతో కలిపి అనేక పదార్ధాలను గ్రహిస్తుంది. నీటిని ఉత్తేజ పరచిన కార్బన్ గుండా ప్రవహింప చేయుట అనేది సాధారనముగా క్రిముల చేత, రంగు మరియు వాసన చేత కలుషిత మైన నీరు ఉన్న పురపాలక ప్రాంతాలలో ఉపయోగించ బడుతుంది. చాలా వరకు గ్రుహోపయోగములో ఉపయోగించు నీటి వడపోత యంత్రాలు మరియు చేపల తొట్టెలు నీటిని మరింత శుద్ధ పరచుటకు ఉత్తేజ పరచిన కార్బన్ వడపోత యంత్రాలను ఉపయోగిస్తాయి. గ్రుహోపయోగములో ఉపయోగించు నీటి వడపోత యంత్రాలు కొన్నిసార్లు వెండిని మెటాలిక్ వెండి నానోపార్టికల్ గా కలిగి ఉంటాయి. ఒకవేళ నీరు కార్బన్ విభాగములో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దానిలో సుక్ష్మ క్రిములు పెరిగి దుర్గందానికి మరియు కాలుష్యానికి దారి తీస్తాయి. వెండి నానో పార్టికల్స్ ఒక అద్భుతమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకముగా పనిచేసే పదార్ధములు మరియు ఇవి రసాయనిక హాలో-ఆర్గానిక్ పదార్ధాలు అయినటువంటి క్రిమిసంహారాలను విషరహిత ఆర్గానిక్ ఉత్పాదనలుగా మారుస్థాయి.[ఉల్లేఖన అవసరం]
 3. డిస్టిలేషన్ అనేది నీటి ఆవిరిని తయారు చేయుటకు నీటిని మరిగించుట అనే ప్రక్రియను కలిగి ఉంటుంది. ఈ ఆవిరి చల్లని ఉపరితలాన్ని తాకి అక్కడ ద్రవముగా మారుతుంది. ఎందువల్లనంటే నీటిలో కరిగి ఉన్న లవణాలు సాధారణముగా ఆవిరిగా మారవు కనుక అవి మరుగుతున్న ద్రవములోనే ఉండిపోతాయి. డిస్టిలేషన్ కూడా నీటిని పూర్తిగా శుద్ధిచేయదు ఎందువలన అంటే ఒకే మరిగింపు స్థాయి వద్ద ఉన్న కలుషిత కారకాలు మరియు ఆవిరికాని ద్రవము యొక్క బిందువులు ఆవిరితో పాటు తీసుకురాబడతాయి. ఏమయినప్పటికీ 99 .9 % శుద్దమైన నీటిని డిస్టిలేషన్ ద్వారా పొందవచ్చు.
 4. రివర్సు ఓస్మోసిస్: అశుద్ధ మైన ద్రవానికి యాంత్రిక వత్తిడిని కలిగించుట ద్వారా శుద్దమైన నీటిని ఒక చిన్న రంద్రమున్న వాహకము ద్వారా బయటకు నెట్టుట. కచ్చితమైన చిన్న రంద్రమున్న వాహకమును సృష్టించుట కష్టమైనప్పటికి రివర్స్ ఓస్మోసిస్ అనేది పెద్ద స్థాయిలో నీటిని శుద్దీకరించుటకు ఆలోచనా పరముగా ఒక సరైన విధానము. ఈ వాహకములను సరిగా నిర్వహించక పోయినట్లయితే ఆల్గే మరియు ఇతర జీవులు వాహకమును తమ నివాసముగా చేసుకొనే అవకాశము ఉంది.
 5. నీటినుండి విషపదార్ధాలను తొలగించుటకు ఇనుమును ఉపయోగించుట. విష పదార్దాలతో కలుషితమైన భూగర్బ జలమును చూడండి.
 6. వాహకమునును సరాసరి చేరే డిస్టిలేషను విధానము (DCMD ). డిస్టిలేషనుకు వర్తిస్తుంది. వేడి చేయబడ్డ సముద్రపు నీరు హైడ్రోఫోబిక్ పాలిమర్ వాహకము ఉపరితలమునుండి ప్రయాణిస్తుంది. ఆవిరి అయిన నీరు వేడిగా ఉన్న వైపు నుండి వాహకమునకు ఉన్న రంద్రముల ద్వారా చల్లని శుద్దమైన నీరు ఉన్నటువంటి ప్రవాహములోనికి ప్రవహిస్తుంది. వేడి వైపు మరియు చల్లని వైపు రెండిటి మధ్యలో ఉన్న ఆవిరి వత్తిడి లోని తేడా నీటి పరమాణువులు ముందుకు నెట్టబడుటకు సహకరిస్తుంది.
 7. గ్యాస్ హైడ్రేట్ క్రిస్టల్స్ సెంట్రిఫ్యూజ్ విధానము. కార్బన్ డై ఆక్సైడ్ ను కలిగి ఉన్న గ్యాసును కలుషితమైన నీటికి ఎక్కువ వత్తిడి మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద కలిపినట్లయితే గ్యాస్ హైడ్రేటు క్రిస్టల్స్ కేవలము స్వచ్ఛమైన నీటిని కలిగి ఉంటాయి. దీనికి కారణము నీటి పరమాణువులు గ్యాసు పరమాణువులతో పరమాణు స్థాయి వద్ద బంధముగా ఏర్పడతాయి. కలుషితమైన నీరు ద్రవరూపములో ఉంటుంది. క్రిస్టల్స్ ను మరియు కలుషిత నీటిని వేరు చేయుటకు ఒక పరికరము ఉపయోగించబడుతుంది.

హైడ్రోజన్ ఉత్పాదన[మార్చు]

తక్కువ స్థాయిలో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయుటకు, ఎలక్ట్రోడుల యొక్క ఉపరితలముపై లవణాలు ఏర్పడకుండా మరియు క్రిములను మరియు క్లోరిన్ ను ఉపయోగించు నీటినుండి తొలగించుటకు నీటి శుద్దీకరణ యంత్రాలు స్థాపించబడి ఉంటాయి. మొదట నీరు ఇసుక మరియు చెత్త కణాలను తొలగించుటకు 20 మిక్రో మిల్లిమీటర్లు ఉన్న అవరోధమును కలిగించు (జల్లెడ లేదా తెర వడపోత యంత్రము) వడపోత యంత్రము ద్వారా ప్రవహిస్తుంది తరువాత క్రిములను మరియు క్లోరిన్ ను తొలగించుటకు ఉత్తేజిత కార్బన్ ను ఉపయోగించిన బొగ్గు వడపోత యంత్రముగుండా ప్రవహిస్తుంది చివరగా లోహసంబంద అయానులను తొలగించుటకు అయానులను తొలగించు వడపోత యంత్రము గుండా ప్రవహిస్తుంది. బేరియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం మరియు సిలికాలను సంర్ధవంతముగా తొలగించామా లేదా అనునది సరిచూచుకొనుటకు వడపోతకు ముందు మరియు వడపోత తరువాత పరీక్షను నిర్వహించవచ్చు.

దీనికి ఉపయోగించు ఇంకొక పద్ధతి రివర్సు ఓస్మోసిస్.

సురక్షిత మరియు వివాదాస్పద అంశాలు[మార్చు]

నీటి యొక్క కాలుష్యాన్ని గుర్తించు రైన్బో ట్రవుట్ (ఆన్కోరించాస్ మైకిస్) ని నీటి శుద్దీకరణ ప్లాంట్లలో సున్నితమైన నీటి కాలుష్యాన్ని గుర్తించుటకు ఉపయోగిస్తారు

2007 ఏప్రియల్ లో స్పెన్సర్, మెస్సాచుసేట్స్ లో శుద్దీకరణ యంత్రాలు సరిగా పనిచేయక పోవటము వలన సోడియము హైడ్రాక్సైడ్ (lye ) ఎక్కువగా ఉపయోగించబడి నీరు కలుషితమైనది.[ఉల్లేఖన అవసరం][38 ]

చాల పురపాలక సంస్థలు క్రిమిసంహారకముగా క్లోరిన్ ను ఉపయోగించుటకు బదులు క్లోరమిన్ ను ఉపయోగించుట మొదలుపెట్టాయి. ఏమయినప్పటికీ క్లోరోమిన్ కొన్ని నీటి వ్యవస్థలలో హానికారకమైనదిగా గుర్తించబడింది. క్లోరోమిన్ పాత నీటిని సరఫరా చేయు పైపుల లోని రక్షణ కొరకు ఏర్పరచిన ఫిల్మ్ ను మానవ నివాసాలలోని పైపులకు ఉన్న వాల్వు లలోని సీసమును విడుదల చేయుట ద్వారా కరిగించ గలదు. ఇది ప్రమాదకరమైన సీసము భారిన పడుటకు దారి తీస్తుంది, దాని యొక్క ఫలితముగా రక్తము లోని సీసము స్థాయిలు పెరుగుతాయి. సీసము నరాలకు మరియు నరాలలోని కణాలకు ప్రమద్దాన్ని కలిగించే న్యురోటాక్సిన్ గా పేరుపొందినది.[19][39 ]

మినరల్స్ తొలగించబడిన నీరు[మార్చు]

డిస్టిలేషను నీటి నుండి అన్ని మినరల్స్ ను తొలగిస్తుంది మరియు వాహక విధానాలైనటువంటి రివర్స్ ఓస్మోసిస్ మరియు నానో వడపోత వంటివి చాలా నుండి అన్ని మినరల్స్ ను తొలగిస్తాయి. ఇది మినరల్సు లేని తాగుటకు సరిపడనటువంటి తాగు నీటికి దారి తీస్తుంది. 1980 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ మినరల్స్ తొలగించిన నీటి యొక్క ప్రభావాలను అధ్యయనము చేసింది.[20] మానవుల పై చేసిన ప్రయోగాలు మినరల్స్ లేని నీరు అతి మూత్రమును కలిగించుట మరియు మరియు రక్తములోని సీరాన్ని మరియు పొటాషియం స్థాయిలను తగ్గించి ఎలేక్త్రోలైట్ లను తొలగిస్తుంది. నీటిలోని మెగ్నీషియం, కాల్షియం మరియు ఇతర మినరల్సు పోషకాహార లోపమునకు వ్యతిరేకముగా రక్షణ కల్పిస్తాయి. మినరల్సును తొలగించినటువంటి నీరు సులభముగా విష కారక లోహాలైనటువంటి సీసము మరియు కాడ్మియం లను సులభముగా సంగ్రహిస్తుంది. దీనిని నీటిలో కరిగి ఉన్న కాల్షియం మరియు మెగ్నీషియం ద్వారా అరికట్టవచ్చు. తక్కువ స్థాయిలో మినరల్సును కలిగిన నీరు కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలను సీసము చేత విషప్రయోగానికి గురి చేసింది. ఇది సీసము ఎక్కువ మొత్తాలలో పైపుల నుండి నీటిలోనికి చేరినప్పుడు సంభవిస్తుంది. మెగ్నీషియం కనీసం 10 మిల్లీ గ్రాముల నుండి 20 -30 మిల్లీ గ్రాములు వరకు ఒక లీటరుకి నీటికి; కాల్షియం 20 మిల్లీగ్రాములు కనీసముగా మరియు 40 -80 మిల్లీగ్రాములు వరకు ఉండాలి మరియు నీటి గాఢత 2 నుండి 4 mmol/L లీటరుకి ఉండాలి అని సిఫార్సు చేయబడింది. లీటరుకి 5 mmol గాఢత కలిగిన నీటివలన పిత్తాశయములో రాళ్ళు, ఊపిరి తిత్తులలో రాళ్ళు, మూత్రాశయములో రాళ్ళు కీళ్ళ నొప్పులు మరియు కీళ్ళ జబ్బులు రావటము గమనించబడింది.[21] అదనముగా ఈ లవణములను తొలగించు ప్రక్రియ బ్యాక్టీరియాతో కలుషితమయ్యే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.[21]

గ్రుహోపయోగ డిస్టిల్లర్స్ ను తయారు చేసే వారు దీనికి భిన్నముగా చెపుతారు. వారు చెప్పేది ఏమిటంటే నీటిలోని మినరల్సు అనేక వ్యాదులకు కారణము ప్రయోజనకారకమైన ఖనిజాలు ఆహారము నుండి రావాలి కానీ నీటి నుండి కాదు.[22][23][24] వారు అమెరికన్ మెడికల్ అసోసియేషను చెప్పిన "మానవ శరీరమునకు కావలసిన ఖనిజాల యొక్క అవసరము ఎక్కువగా ఆహారము ద్వారా తీరుతుంది తాగు నీటి ద్వారా కాదు" అనే దానిని ఉటంకిస్తారు.[25] WHO నివేదిక కూడా కొన్ని తక్కువ మినహాయింపులతో "తాగు నీరు మానవులకు కావలసిన ఖనిజాలకు ప్రధాన మూలము కాదు మరియు మనము తీసుకొనే కాల్షియం మరియు మెగ్నీషియంలకు ఇది ప్రధాన మూలము కాదు" అని అంగీకరిస్తుంది. అంగీకరిస్తూనే ఖనిజాలు తీసివేసిన నీరు ప్రమాదకరమని సూచిస్తుంది. దీని అదనపు ఆధారాలు అనేక దేశాలలో జంతువుల మీద చేసిన ప్రయోగాలు మరియు వైద్యశాలలలో గమనించినటువంటి అంశాల నుండి లభించాయి. నీటి ద్వారా జింకు మరియు మెగ్నీషియం మోతాదులు ఇవ్వబడిన జంతువుల సీరములో ఈ పదార్ధాల యొక్క అవక్షేపాలు ఆహారము ద్వారా ఈ ఖనిజాలను ఎక్కువ మొత్తములో తీసుకుని తక్కువ ఖనిజాలు కలిగిన నీటిని తాగిన జంతువులలో కన్నా ఎక్కువ మొత్తములో ఉన్నాయి."

డిస్టిల్లెడ్ నీటి#విమర్శను చూడండి

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఆక్వాటిక్ టాక్సికాలజి
 • బ్యాక్టీరియలాజికల్ వాటర్ యనాలసిస్
 • కార్ల్ రోజర్స్ డర్నల్
 • జీవావరణ పారిశుధ్యం
 • ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్
 • ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ సైన్స్
 • ERDలాటర్ అనేది 1940 లు-1950 ల కాలములో ఉపయోగించబడిన నీటి శుద్దీకరణ యంత్రము యొక్క పేరు ఇది వ్యాను-టైప్, బాడి మవుంట్డ్, విద్యుచ్చక్తితో నడుపబడు పరికరము.
 • నిరుపయోగ నీటిని శుద్దీకరించు సాంకేతిక విధానాల పట్టిక
 • సూక్ష్మ వడపోత
 • నీటి శుద్దీకరణలో ఉపయోగించు జీవులు
 • మురుగునీటిని శుద్దిచెయ్యుట
 • ఈత కొలను శుభ్రత
 • వాతావరణ సంస్థ
 • శుద్దీకరణ గుంట
 • జల సంరక్షణ
 • నీటిని పునరుపయుక్తము చేయుట
 • నీటి శుద్దీకరణ

సూచనలు[మార్చు]

 • మాస్టర్స్, గిల్బర్ట్ ఎమ్. ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. రెండవ సంచిక. అప్పర్ సడ్డిల్ రివర్, NJ : ప్రేన్టైస్ హాల్, 1998 .
 • యునైటెడ్ స్టేట్స్ EPA భూగర్భ మరియు తాగునీటి హోమ్ పేజి. 12 /13 /05 లో దర్శించ బడిన EPA భూగర్భ మరియు తాగునీటి హోమ్ పేజి
 1. Combating Waterborne Diseases at the Household Level (PDF). World Health Organization. 2007. Part 1. ISBN 9789241595223.
 2. Water for Life: Making it Happen (PDF). World Health Organization and UNICEF. 2005. ISBN 9241562935.
 3. [9 ]^ లావా వడపోతల యొక్క బొమ్మలు మరియు చిన్న వివరణ (డచ్ లో)[permanent dead link]
 4. 4.0 4.1 [10 ]^ఎఫ్.హేల్ఫ్ఫెరిక్, అయానుల పరివర్తన, మెక్ గ్రా హిల్, న్యూయార్క్, 1962.
 5. [11 ]^అయాన్ పరివర్తకులు (కే.డార్ఫ్ నర్, ed .), వాల్టర్ డే గృయేటర్, బెర్లిన్, 1991.
 6. [12 ]^సి.ఇ. హర్లాండ్, అయాన్ పరివర్తన: ఆలోచన మరియు ఆచరణ, ది రాయల్ సొసైటి ఆఫ్ కెమిస్ట్రీ, కేమ్ బ్రిడ్జ్, 1994.
 7. [13 ]^అయాన్ పరివర్తన (డి. మురావైవ్, వి. గోర్ష్కోవ్, ఎ. వర్షవ్స్కి), ఎమ్.డెక్కర్, న్యూయార్క్, 2000.
 8. 8.0 8.1 [14 ]^ఎ.ఎ.జగోరోడ్ని, అయాన్ పరివర్తక పదార్ధాలు: స్వభావాలు మరియు ఉపయోగాలు, ఎల్సేవియర్, ఆమ్స్టర్డామ్, 2006 Archived 2007-10-24 at the Wayback Machine..
 9. ^బొమ్మలతో కూడిన జీవావరణ వ్యవస్థల యొక్క సంక్షిప్తత[permanent dead link]
 10. Conroy RM, Meegan ME, Joyce T, McGuigan K, Barnes J (1999 October). "Solar disinfection of water reduces diarrhoeal disease, an update". Arch Dis Child. 81 (4): 337–8. doi:10.1136/adc.81.4.337. PMC 1718112. PMID 10490440. Unknown parameter |pmcid= ignored (|pmc= suggested) (help); Check date values in: |date= (help)CS1 maint: multiple names: authors list (link)
 11. Conroy RM, Meegan ME, Joyce TM, McGuigan KG, Barnes J (2001). "Use of solar disinfection protects children under 6 years from cholera". Arch Dis Child. 85 (4): 293–5. doi:10.1136/adc.85.4.293. PMC 1718943. PMID 11567937. Unknown parameter |pmcid= ignored (|pmc= suggested) (help)CS1 maint: multiple names: authors list (link)
 12. Rose A. at al. (2006 February). "Solar disinfection of water for diarrhoeal prevention in southern India". Arch Dis Child. 91 (2): 139–41. doi:10.1136/adc.2005.077867. PMC 2082686. PMID 16403847. Unknown parameter |pmcid= ignored (|pmc= suggested) (help); Check date values in: |date= (help)
 13. [26 ]^ హాబ్బిన్స్ ఎమ్.(2003 ). SODIS ఆరోగ్య ప్రభావ అధ్యయనము, పిహెచ్.డి థీసిస్, స్విస్ ట్రోపికల్ ఇన్స్టిట్యుట్ బేసల్
 14. Sciacca F, Rengifo-Herrera JA, Wéthé J, Pulgarin C (2010-01-08). "Dramatic enhancement of solar disinfection (SODIS) of wild Salmonella sp. in PET bottles by H(2)O(2) addition on natural water of Burkina Faso containing dissolved iron". Chemosphere (epub ahead of print)|format= requires |url= (help). 78 (9): 1186–91. doi:10.1016/j.chemosphere.2009.12.001. PMID 20060566.CS1 maint: multiple names: authors list (link)
 15. Centers for Disease Control and Prevention (2001). "Recommendations for using fluoride to prevent and control dental decay caries in the United States". MMWR Recomm Rep. 50 (RR-14): 1–42. PMID 11521913. Lay summaryCDC (2007-08-09). Cite uses deprecated parameter |laysummary= (help)
 16. Division of Oral Health, National Center for Prevention Services, CDC. "Fluoridation census 1992" (PDF). Retrieved on 2008-12-29.
 17. Reeves TG (1986). "Water fluoridation: a manual for engineers and technicians" (PDF). Centers for Disease Control. మూలం (PDF) నుండి 2008-10-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-10. Cite web requires |website= (help)
 18. [36 ]^యుఎస్ EPA అత్యవసర క్రిమిసంహారక సిఫారసులు
 19. [39 ]^మిరండా, కిమ్, హుల్, et .a . "రక్తము లోని సీసము స్థాయిలలో మార్పులు నీటి శుద్దీకరణ వ్యవస్థలలో ఉపయోగించు క్లోరోమిన్ తో సంబందము కలిగి ఉన్నాయి" 03 /13 /2007 . పర్యావరణ ఆరోగ్య దృక్పదాలు.
 20. [40 ]^హెచ్ టి టి పి://డబ్లుడబ్లుడబ్లు.హు.ఐ[permanent dead link] ఎన్ టి/నీరు_పారిశుద్యము_ఆరోగ్యము/డిడబ్లుక్యు/నట్ డి మినరలైజ్ద్.పిడిఎఫ్
 21. 21.0 21.1 [41 ]^కోజిసేక్ ఎఫ్. (2004 ). [హెచ్ టి టి పి://డబ్లుడబ్లుడబ్లు.హు.ఐ[permanent dead link] ఎన్ టి/యెన్టైటి/నీరు_పారిశుద్యము_ఆరోగ్యము/డిడబ్లుక్యు/న్యూట్రియాంట్స్ చాప్టర్12 .పిడిఎఫ్ క్రిమి సంహారకాలను ఉపయోగించిన నీటిని తాగుట వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు] WHO .
 22. [43 ]^హెచ్ టి టి పి://డబ్లుడబ్లుడబ్లు.నాచురల్సొల్యుషన్స్.కాం/ఎకోడిస్ట్2[permanent dead link] .హెచ్ టి ఎమ్
 23. [44 ]^హెచ్ టి టి పి://డబ్లుడబ్లుడబ్లు.ఆక్వటెక్నాలజీ.నెట్/ఫ్రేం4751007[permanent dead link] .హెచ్ టి ఎమ్ ఎల్
 24. [45 ]^హెచ్ టి టి పి://డబ్లుడబ్లుడబ్లు.షాకీస్ప్యూర్వాటర్.కామ్/డిస్టిలేషన్.హెచ్[permanent dead link] టి ఎమ్
 25. [46 ]^హెచ్ టి టి పి://డబ్లుడబ్లుడబ్లు.అరిజొనాయయిరాండ్వాటర్.కామ్/ఎఫ్ఏక్యు.హెచ్[permanent dead link] టి ఎమ్

బాహ్య లింకులు[మార్చు]

మూస:Environmental technology