నీ నామమే మాకు నిధియు నిధానము
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
నీ నామమే మాకు నిధియు నిధానము అనేది అన్నమాచార్యులు రచించిన కీర్తన.
కీర్తన
[మార్చు]నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే ఆత్మ నిధానాంజనము
నమో నమో కేశవ నమో నారాయణ - నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదన - నమో త్రివిక్రమ నమో వామనా
నమో నమో శ్రీధర నమో హృషీకేశ - నమో పద్మనాభ నమో దామోదర
నమో సంకర్షణ నమో వాసుదేవ - నమో ప్రద్యుమ్న తే నమో యనిరుద్ధా
నమో పురుషోత్తమ నమో యధోక్షజ - నమో నారసింహ నమోస్తు యచ్యుత
నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర - నమో శ్రీ వేంకటేశ నమో శ్రీకృష్ణా
వివరణ
[మార్చు]ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు విష్ణువును ఆత్మ అనే నిధిని దర్శించుటకు తోడ్పడే అంజనముగా పేర్కొంటాడు. దీని కోసం 24 లో 23 కేశవ నామాలు ప్రయోగించాడు. ఓం కేశవాయనమ: ఓం మాధవాయ నమ: అంటూ త్రికాలాల్లో, పూజాదికాల్లో చేసే ఆచమనంలో ఉపయోస్తూ వస్తున్న నామాలివి.[1]
భారతీయ సంస్కృతి
[మార్చు]- ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి ఈ కీర్తనను సంగీతపరంగా గానం చేశారు.[2]
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్లో నీ నామమే మాకు నిధియు నిధానము పూర్తి కీర్తన.
మూలాలు
[మార్చు]- ↑ సప్తగిరి సచిత్ర మాస పత్రిక, జూలై 2008.
- ↑ ఎమ్మెస్ గానం చేసిన నీ నామమే కీర్తన.