నువారా ఎలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువారా ఎలియా

නුවර එළිය (Sinhala)
நுவரெலியா (Tamil)
నువారా ఎలియా
Nuwara Eliya
Nuwara Eliya
ముద్దుపేరు(ర్లు): 
లిటిల్ ఇంగ్లాండ్
నువారా ఎలియా is located in శ్రీలంక
నువారా ఎలియా
నువారా ఎలియా
Map of Sri Lanka showing the location of Nuwara Eliya
నిర్దేశాంకాలు: 6°58′0″N 80°46′0″E / 6.96667°N 80.76667°E / 6.96667; 80.76667Coordinates: 6°58′0″N 80°46′0″E / 6.96667°N 80.76667°E / 6.96667; 80.76667
Countryశ్రీలంక
ProvinceCentral Province
DistrictNuwara Eliya District
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంMunicipal Council
విస్తీర్ణం
 • పట్టణ
13 km2 (5 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
1,868 మీ (6,129 అ.)
జనాభా వివరాలు
(2011 census)
 • City27,500
 • సాంద్రత3,197/km2 (8,280/sq mi)
కాలమానంUTC+5:30 (Sri Lanka Standard Time Zone)
పిన్‌కోడ్
22200
ప్రాంతీయ ఫోన్ కోడ్052

నువార ఎలియా శ్రీలంకలోని సెంట్రల్ ప్రావిన్స్‌లో గల  హిల్ కంట్రీలోని ఒక నగరం.ఈ నగరం ముద్దు పేరు లిటిల్ ఇంగ్లాండ్. దీనికే  "సాదా (టేబుల్ ల్యాండ్)" లేదా "కాంతి నగరం"అనే పేర్లు కలవు. సుందరమైన ప్రకృతిని కలిగిన  సమశీతోష్ణ వాతావరణంలో ఈ నగరం ఉంది. అందుకే చల్లని ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.  ఈ నగరం 1,868 మీ ఎత్తులో ఉండి,  శ్రీలంకలో టీ ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది.

చరిత్ర[మార్చు]

1846 వ సంవత్సరం లో ఆల్బర్ట్ సరస్సును,  నైలు నదిని అన్వేషించిన ‘శామ్యూల్ బేకర్’ అనే పరిశోధకుడు  ఈ నగరాన్ని స్థాపించాడు.లిటిల్ ఇంగ్లండ్ అని పిలువబడే నువారా ఎలియా ఒక హిల్ కంట్రీ.ఇక్కడ బ్రిటిష్ వలసవాదులు నక్కలు , జింకలు, ఏనుగులు మొదలైన జంతువులను వేటాడుతారు. అలాగే  పోలో, గోల్ఫ్, క్రికెట్ వంటి ఆటలతో కాలక్షేపం చేస్తారు. క్వీన్స్ కాటేజ్, జనరల్స్ హౌస్, గ్రాండ్ హోటల్, హిల్ క్లబ్, సెయింట్ ఆండ్రూస్ హోటల్,టౌన్ పోస్ట్ ఆఫీస్ వంటి ప్రదేశాలు ఆనాటి చారిత్రక విశేషాలను తెలియజేస్తాయి. ఈ ప్రదేశాలన్నీ సందర్శకులని ఆకర్షిస్తాయి.

వాతావరణం[మార్చు]

దాని ఎత్తైన ప్రదేశం కారణంగా, నువారా ఎలియా ఉపఉష్ణమండల హైలాండ్ శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది.ఇక్కడి వాతావరణం పొడిగా ఉండి సగటు వార్షిక ఉష్ణోగ్రత 16 °C (61 °F)ను కలుగజేస్తాయి.[1][2]

శీతోష్ణస్థితి డేటా - Nuwara Eliya (1961–1990, extremes 1869–ప్రస్తుతం)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 32.2
(90.0)
31.7
(89.1)
33.9
(93.0)
29.9
(85.8)
32.5
(90.5)
27.6
(81.7)
29.2
(84.6)
29.8
(85.6)
25.8
(78.4)
27.6
(81.7)
28.6
(83.5)
27.5
(81.5)
33.9
(93.0)
సగటు అధిక °C (°F) 20.0
(68.0)
21.2
(70.2)
22.5
(72.5)
22.8
(73.0)
21.3
(70.3)
18.9
(66.0)
18.5
(65.3)
18.7
(65.7)
19.2
(66.6)
19.8
(67.6)
19.8
(67.6)
19.4
(66.9)
20.2
(68.4)
రోజువారీ సగటు °C (°F) 14.7
(58.5)
15.3
(59.5)
16.3
(61.3)
17.1
(62.8)
17.1
(62.8)
16.1
(61.0)
15.7
(60.3)
15.7
(60.3)
15.7
(60.3)
15.8
(60.4)
15.6
(60.1)
15.2
(59.4)
15.9
(60.6)
సగటు అల్ప °C (°F) 9.4
(48.9)
9.4
(48.9)
10.2
(50.4)
11.4
(52.5)
12.8
(55.0)
13.3
(55.9)
12.8
(55.0)
12.7
(54.9)
12.3
(54.1)
11.9
(53.4)
11.5
(52.7)
11.0
(51.8)
11.6
(52.9)
అత్యల్ప రికార్డు °C (°F) −2.6
(27.3)
−2.5
(27.5)
−1.9
(28.6)
0.8
(33.4)
0.8
(33.4)
6.4
(43.5)
6.0
(42.8)
5.1
(41.2)
5.0
(41.0)
1.2
(34.2)
1.4
(34.5)
−1.1
(30.0)
−2.6
(27.3)
సగటు అవపాతం mm (inches) 100.6
(3.96)
77.7
(3.06)
71.5
(2.81)
158.4
(6.24)
175.9
(6.93)
171.9
(6.77)
164.9
(6.49)
161.0
(6.34)
178.8
(7.04)
226.8
(8.93)
221.7
(8.73)
196.0
(7.72)
1,905.2
(75.02)
సగటు అవపాతపు రోజులు 8 7 8 13 13 16 17 16 15 18 17 15 163
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at Daytime) 75 67 65 73 87 84 84 84 83 83 82 85 79
Mean monthly sunshine hours 167.4 163.9 198.4 156.0 102.3 84.0 68.2 74.4 87.0 117.8 123.0 142.6 1,485
Mean daily sunshine hours 5.4 5.8 6.4 5.2 3.3 2.8 2.2 2.4 2.9 3.8 4.1 4.6 4.1
Source 1: World Meteorological Organization (average high and low, and precipitation),[3] NOAA (mean temperatures and humidity)[4]
Source 2: Deutscher Wetterdienst (sun, 1931–1960),[5] Meteo Climat (record highs and lows)[6]


జనాభా[మార్చు]

నువారా ఎలియా నగరంలో అత్యధిక జనాభా సింహళీయులదే . ఇక్కడ భారతీయ తమిళులు మరియు శ్రీలంక తమిళులు వంటి ఇతర జాతుల సమూహాలకు చెందిన గణనీయమైన కమ్యూనిటీలు ఉన్నాయి.

జాతి (2012) జనాభా
సింహళం 19,157 (44.5%)
శ్రీలంక తమిళులు 9,557 (22.2%)
భారతీయ తమిళులు 9,101 (21.1%)
శ్రీలంక మూర్స్ 4,629 (10.8%)
ఇతర (బర్గర్, మలయ్‌తో సహా) 606 (1.4%)
మొత్తం 43,050 (100%)

భాష[మార్చు]

నువారా ఎలియాలో మాట్లాడే రెండు ప్రధాన భాషలు సింహళం ,తమిళం. ఆంగ్ల భాషను కూడా  విరివిగా ఉపయోగిస్తున్నారు.

పండుగలు[మార్చు]

నువారా ఎలియాలో  ఏటా ఏప్రిల్ 1న నూతన సంవత్సరం  పండుగ  వారి ఆచార పద్ధతిలో  ప్రారంభమవుతుంది.వేడుకలో ప్రధానంగా బ్యాండ్ షో ఉంటుంది, దీనిలో అన్ని స్థానిక పాఠశాల బ్యాండ్‌లు పాల్గొంటాయి.ఈ ప్రాంతంలో ఆరోజు సెలవుదినం కావడంతో వసతి దొరకడం కష్టం.ఏప్రిల్‌లో ప్రధానంగా గుర్రపు పందాలు,బైక్ రేసింగ్లు జరుగుతాయి. వీటితో పాటు నువారా ఎలియా రోడ్ రేస్, గ్రెగొరీ సరస్సు అంచున ఉన్న 4X4 లేక్ క్రాస్ ఔత్సాహికులను ఆకర్షిస్తాయి.

ఆకర్షణలు[మార్చు]

ఈ పట్టణంలో  గోల్ఫ్ కోర్స్, ట్రౌట్ స్ట్రీమ్‌లు, విక్టోరియా పార్క్, లేక్ గ్రెగొరీ బోటింగ్ లేదా ఫిషింగ్ లు ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తాయి. వీటన్నింటిలో విక్టోరియా పార్క్ పక్షి వీక్షకులకు చాలా ప్రసిద్ధి చెందింది.ఇండియన్ బ్లూ రాబిన్, పైడ్ థ్రష్ లేదా స్కేలీ థ్రష్ పక్షులు దట్టమైన పొదల్లో దాగి ఉంటాయి.కాశ్మీర్ ఫ్లైక్యాచర్ జాతి పక్షి పార్క్ లోని అన్ని పక్షుల కంటే ఆకర్షణీయమైనది.లవర్స్ లీప్' అనే జలపాతం  నువారా ఎలియా పట్టణం నుండి కొంచెం దూరంలో  తేయాకు తోటల మధ్య ఉన్న అద్భుతమైన జలపాతం. ఇది పొడవాటి క్యాస్కేడింగ్ షీట్‌లో 30 మీటర్ల ఎత్తు నుండి  పడిపోతుంది. కొండపై నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్న  యువ జంట పేరు మీదుగా ఈ జలపాతానికి లవర్స్ లీప్ అని  పేరు పెట్టబడింది.

మూలాలు[మార్చు]

  1. "Nuwara Eliya climate: Average Temperature, weather by month, Nuwara Eliya weather averages - Climate-Data.org". en.climate-data.org. Retrieved 2021-12-08.
  2. WMO. "World Weather Information Service". World Weather Information Service (in ఇంగ్లీష్). Retrieved 2021-12-08.
  3. "World Weather Information Service - Nuwara Eliya". World Meteorological Organization. Retrieved December 29, 2012.
  4. "NUWARA ELIYA Climate Normals 1961-1990". National Oceanic and Atmospheric Administration. Retrieved May 9, 2016.
  5. "Klimatafel von Nuwara Eliya / Sri Lanka (Ceylon)" (PDF). Baseline climate means (1961-1990) from stations all over the world (in జర్మన్). Deutscher Wetterdienst. Retrieved May 9, 2016.
  6. "Station Nuwara Eliya" (in ఫ్రెంచ్). Meteo Climat. Retrieved 26 August 2021.