నూర్ ఇనాయత్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూర్ ఇనాయత్ ఖాన్
Noor Inayat Khan, c.1943.jpg
నూరున్నీసా ఇనాయత్ ఖాన్
ఇతర పేర్లునొరా ఇనాయత్ ఖాన్
జననం(1914-01-01)1914 జనవరి 1
మాస్కో, రష్యా
మరణం1944 సెప్టెంబరు 13(1944-09-13) (వయసు 30)
బవేరియా, నాజీ జర్మనీ
రాజభక్తి United Kingdom
సేవలు/శాఖమహిళల యాగ్జలరీ ఎయిర్ ఫోర్స్
సేవా కాలం1940–1944
ర్యాంకుఅసిస్టెం సెక్షన్ ఆఫీసర్
పోరాటాలు / యుద్ధాలురెండవ ప్రపంచ యుద్ధం

నూర్-ఉన్-నిసా ఇనాయత్ ఖాన్(1914 జనవరి 1 – 1944 సెప్టెంబరు 14), లేక నూరా ఇనాయత్-ఖాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న బ్రిటీష్ యోధురాలు, స్పెషల్ ఆపరేషన్స్ లో ఆమె చేసిన పనికి బాగా ప్రాచుర్యం పొందింది.[1] నూరా బేకర్ అన్న పేరు కూడా ఆమె వాడేది. భారతీయ అమెరికన్ వారసత్వాలు కలిగిన నూర్ ఇనాయత్ ఖాన్ రచయితగానూ పేరు పొందింది.[2] స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా ఆమె చేసిన కృషికిగాను మరణానంతరం జార్జ్ క్రాస్ సాధించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నుంచి జర్మనీ ఆక్రమిత ఫ్రాన్సుకు సైన్యంలో ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా వెళ్ళి పనిచేసిన తొలి మహిళగానూ, బ్రిటన్లో తొలి ముస్లిం వార్ హీరోయిన్ గానూ ఆమె నిలిచింది.

తొలినాళ్ళు[మార్చు]

మాస్కోలో 1914 జనవరి 1న తల్లిదండ్రులకు తొలి సంతానంగా నూర్ ఇనాయత్ ఖాన్ జన్మించింది.[3] [4] విలాయత్ (1916-2004), హైదయత్ (1917-2016), ఖైరున్నీసా (1919-2011) ఆమె తోబుట్టువులు.[5]

ఆమె తండ్రి ఇనాయత్ ఖాన్ భారతీయ ముస్లిం పాలక కుటుంబానికి చెందినవాడు[5] అతని తల్లి టిప్పు సుల్తాన్ మామగారి వారసరాలు. ఇనాయత్ ఖాన్ ఐరోపాలో సూఫీయిజాన్ని బోధిస్తూ, సంగీతకారునిగా జీవించాడు. ఆమె తల్లి పిరానీ అమీరా బేగం (ఓరా రే బేకర్ గా జన్మించింది) న్యూమెక్సికో ప్రాంతానికి చెందిన అమెరికన్.[3][5] ఇనాయత్ ఖాన్ అమెరికా పర్యటనల్లో వారిద్దరూ కలిశారు. ఆ క్రమంలో వివాహం చేసుకున్నారు.

రష్యాలో నూర్ జన్మించింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో 1914లో రష్యా నుంచి కుటుంబం లండన్ చేరుకుంది. బ్లూమ్స్ బరీ ప్రాంతంలో నివసించసాగారు. నూర్ ఇనాయత్ ఖాన్ విద్యాభ్యాసం నాటింగ్ హిల్ ప్రాంతంలో ప్రారంభమైంది. 1920లో కుటుంబ సమేంతంగా ఫ్రాన్సు చేరుకుని ప్యారిస్ సమీపంలోని ఓ ప్రాంతంలో, సూఫీ మత భక్తుడు బహూకరించిన ఇంటిలో స్థిరపడ్డారు. 1927లో నూర్ ఇనాయత్ ఖాన్ తండ్రి మరణించాడు. ఆపైన నూర్ దు:ఖంలో మునిగిన తల్లి, చిన్నవారైన తోబుట్టువుల బాధ్యతను స్వీకరించింది.

యుక్తవయసులో ఆమె మౌనంగా ఉండేది. దానికితోడు సిగ్గరి, సున్నిత మనస్కురాలు. సొర్బొన్నెలో బాలల మనసత్తత్వ శాస్త్రం, ప్యారిస్లో సంగీతం అభ్యసించింది. హార్ప్, పియానోల కోసం స్వరకల్పన చేయగలిగేది. పిల్లల కథలు, కవితలు రాయడంతో తన కెరీర్ ప్రారంభించింది. బాలల పత్రికలకు, ఫ్రెంచి రేడియోకు రచయిత్రిగా కొనసాగింది. బౌద్ధ జాతక కథల నుంచి స్ఫూర్తి పొంది 1939లో ట్వంటీ జాతక టేల్స్ పుస్తకాన్ని రాసి లండన్లో ప్రచురించింది.[6]

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాకా జర్మనీ దళాలు ఫ్రాన్సును ఆక్రమించడంతో ఆమె కుటుంబంతో సహా అక్కడి నుంచి దేశదేశాలు మారి ఇంగ్లాండు చేరుకుంది.

మహిళల యాగ్జలరీ ఎయిర్ ఫోర్స్[మార్చు]

ఆమె, ఆమె సోదరుడు విలయాత్ నాజీ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర పక్ష సైన్యంలో పోరాడి ధైర్యసాహసాలు ప్రదర్శించాలనీ, అది భారతీయులకు, బ్రిటీష్ ప్రజలకు నడుమ ఒక వంతెన అవుతుందని భావించేది. [7] 1940 నవంబరులో ఆమె మహిళల యాగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ (డబు్ల్య.ఎ.ఎ.ఎఫ్.) లో రెండవ తరగతి ఎయిర్ క్రాఫ్ట్ విమెన్ గా చేరింది. వైర్లెస్ ఆపరేటర్ టై్రనింగ్ తీసుకుంది. [8] బాంబర్ శిక్షణా పాఠశాలకు సైన్యం ఆదేశాల మేరకు 1941 జూన్ లో వెళ్ళి సైన్యంలో ఆఫీసరు నియమకానికి దరఖాస్తు చేసుకుంది. నిజానికి అంతవరకూ ఆమె చేసిన ఆఫీసు పని, తీసుకున్న శిక్షణ బోరుగా భావించేది.[8]

మూలాలు[మార్చు]

  1. "Noor Inayat Khan: remembering Britain's Muslim war heroine", 23 October 2012.
  2. Inayat Khan 1985.
  3. 3.0 3.1 "Noor-un-nisa Inayat Khan". Sufi Order International. 2009. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 31 మార్చి 2019.
  4. మూస:Cite ODNB
  5. 5.0 5.1 5.2 "Tomb of Hazrat Inayat Khan". Delhi Information. 2016. Archived from the original on 5 ఆగస్టు 2016. Retrieved 5 June 2016.
  6. Tonkin, Boyd (20 February 2006). "Noor Anayat Khan: The princess who became a spy". The Independent. London, UK. Archived from the original on 7 ఆగస్టు 2016. Retrieved 5 June 2016.
  7. Visram 1986, p. 142.
  8. 8.0 8.1 Kramer 1995, p. 135.