నృత్య నాటిక
Jump to navigation
Jump to search
నృత్య నాటిక అనునది ఒక విశిష్టమైన నృత్య కళ.[1] ఈ కళారూపంలో గాయకులు, సంగీతకారులు, నర్తకులు కలిసి ఒక కథను లేక ఒక ఘట్టాన్ని ఒక నృత్యరూపంలో ప్రదర్శిస్తారు. ఇందులో పాటలకే కాక పద్యాలకు, పదములకు కూడా స్థానం ఉంది. ఈ కళ యందు హావ-భావాలు, నటన, దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అప్పుడప్పుడూ మాత్రమే నాట్యం ప్రధానాంశం అవుతుంది. ప్రతి వాగ్గేయకారుడు తన కృతిలలో కచ్చితంగా ఒక నృత్యనాటకాన్ని రచించడం కద్దు.
- మన రంగస్థల నాటకములు, కన్నడిగుల యక్షగానము, ఇదే కోవకు చెందినవి.
- అయితే త్యాగరాజులు వారు రాసిన నౌకా చరితము అను నృత్యనాటిక చాలా ప్రసిద్ధమైనది.[2]
- ఇంకా ఇదే కోవలో వస్తాయి- భామా కలాపము.
కూచిపూడి నాట్యకళాకారులు ప్రదర్శించే నృత్యరూపకాలో అలంకారయుక్తంగా, దేశ ఛందస్సుతో రచించబడ్డాయి. నృత్యరూపకాలలో దరువులకు ప్రత్యేకస్థానం ఉంది. దరువంటే మాత్రా ఛందస్సుతో, సాధ్యమైనంత వరకు చతురస్రంలో నడుస్తూ పల్లవి, అనుపల్లప్లవి చరణాలతో కూడి ఉండే సంగీత రచన. [3]
మూలాలు
[మార్చు]- ↑ "Definition of DANCE DRAMA". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
- ↑ Thyagaraja. Nauka Charitra telugu.
- ↑ పత్రిక, విహంగ మహిళా. "కూచిపూడి నృత్య నాటికలలో "దర్వులు" – వైవిధ్యం - డా.లక్ష్మణరావు ఆదిమూలం |" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-07.