నెగోజి ఒకోంజో ఇవేలా
నెగోజి ఒకోంజో ఇవేలా | |
---|---|
7th ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ | |
Assumed office 1 March 2021 | |
అంతకు ముందు వారు | రాబర్టో అజెవెడో |
Minister of Finance | |
In office 17 August 2011 – 29 May 2015 | |
అధ్యక్షుడు | Goodluck Jonathan |
అంతకు ముందు వారు | Olusegun Olutoyin Aganga |
తరువాత వారు | Kemi Adeosun |
In office 15 July 2003 – 21 June 2006 | |
అధ్యక్షుడు | ఒలుసెగున్ ఒబాసంజో |
అంతకు ముందు వారు | ఆడము సిరోమా |
తరువాత వారు | నేనది ఉస్మాన్ |
Coordinating Minister for the Economy | |
In office 17 August 2011 – 29 May 2015 | |
అధ్యక్షుడు | Goodluck Jonathan |
అంతకు ముందు వారు | Olusegun Olutoyin Aganga |
తరువాత వారు | Position abolished |
Minister of Foreign Affairs | |
In office 21 June 2006 – 30 August 2006 | |
అధ్యక్షుడు | Olusegun Obasanjo |
అంతకు ముందు వారు | Oluyemi Adeniji |
తరువాత వారు | Joy Ogwu |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఓగ్వాషి ఉక్వు, నైజీరియా | 1954 జూన్ 13
పౌరసత్వం | Nigeria (1954–present) United States (2019–present)[1] |
రాజకీయ పార్టీ | Peoples Democratic Party |
జీవిత భాగస్వామి | ఇకెంబా ఇవేలా |
సంతానం | 4, ఉజోడిన్మా ఇవేలా తో సహా |
చదువు | Harvard University (BA) Massachusetts Institute of Technology (MA, PhD) |
నెగోజి ఒకోంజో ఇవేలా (ఆంగ్లం: Ngozi Okonjo-Iweala; జననం 1954 జూన్ 13) నైజీరియన్-అమెరికన్ ఆర్థికవేత్త. 2021 మార్చి నుండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తోంది.[2] ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఆమె మొదటి మహిళ, మొదటి ఆఫ్రికన్ కావడం విశేషం.[3][4][5]
డానోన్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, మండేలా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్, కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జార్జ్‌టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ, వన్ క్యాంపెయిన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, రిజల్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్, ఆఫ్రికన్ రిస్క్ కెపాసిటీ అండ్ ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్లస్.. ఇలా చాలా బోర్డులలో ఆమె మెంబరుగా వ్యవహరించింది.[6][7][8][9][10] ఆమె గతంలో ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కూడా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఆమె నియామకానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసింది.[11]
ప్రారంభ జీవితం
[మార్చు]నెగోజి ఒకోంజో ఇవేలా నైజీరియాలోని డెల్టా రాష్ట్రంలోని ఒగ్వాషి-ఉక్వులో జన్మించింది. ఆమె తండ్రి ప్రొఫెసర్ చుక్వుకా ఒకోంజో, ఒగ్వాషి-ఉక్వులోని ఒబాహై రాజ కుటుంబానికి చెందిన ఓబీ (రాజు).
క్వీన్స్ స్కూల్, ఎనుగు; సెయింట్ ఆన్స్ స్కూల్, మోలేట్, ఇబాడాన్, ఓయో స్టేట్; ఇంటర్నేషనల్ స్కూల్ ఇబాడాన్ లలో నెగోజి ఒకోంజో ఇవేలా చదువుకుంది. ఆమె 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా చేరుకుంది. 1976లో ఎకనామిక్స్‌లో పట్టభద్రురాలైంది.[12][13] ఆమె 1978లో సిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని, 1981లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీజినల్ ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్‌లో పీహెచ్‌డీని పొందింది. థీసిస్ క్రెడిట్ పాలసీ, గ్రామీణ ఆర్థిక మార్కెట్లు, నైజీరియా వ్యవసాయ అభివృద్ధితో సాంకేతికత.[14] అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్శిటీ ఉమెన్ నుండి ఆమె అంతర్జాతీయ ఫెలోషిప్ పొందింది. ఇది ఆమె డాక్టరల్ అధ్యయనాలకు మద్దతు ఇచ్చింది.[15]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె నైజీరియాలోని అబియా స్టేట్‌లోని ఉముహియాకు చెందిన న్యూరోసర్జన్ ఇకెంబా ఇవేలాను వివాహం చేసుకుంది. రచయిత ఉజోడిన్మా ఇవేలాతో సహా వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.[16][17][18][19][20] వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తదుపరి డైరెక్టర్ జనరల్ కావడానికి ముందు ఆమె 2019లో అమెరికా పౌరసత్వం పొందినట్లు వెల్లడైంది.[21]
మూలాలు
[మార్చు]- ↑ Overly, Steven. "U.S. backs Okonjo-Iweala, first woman and African, to head WTO". POLITICO. Archived from the original on 5 February 2021. Retrieved 6 February 2021.
- ↑ "Global Recession: మాంద్యం అంచున ఉన్నాం.. డబ్ల్యూటీవో చీఫ్". web.archive.org. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "History Made as Dr. Ngozi Okonjo-Iweala Picked to Head the WTO". Africa Renewal: United Nations Magazine. 26 February 2021. Retrieved 24 June 2021.
- ↑ "Ngozi Okonjo-Iweala Makes History at the WTO". BBC News. March 2021. Retrieved 24 June 2021.
- ↑ "WTO Director-General Ngozi Okonjo-Iweala Discusses Vaccines". The World: Pulic Radio. Retrieved 24 June 2021.
- ↑ "Prince William and Earthshot Prize Council Members Sign Letter Encouraging Everyone to Give the Earth a Shot". MSN. Retrieved 24 June 2021.
- ↑ "Earthshot Prize Council: Ngozi Okonjo-Iweala". Earthshot Prize. Retrieved 24 June 2021.
- ↑ "Profile: Ngozi Okonjo-Iweala". Bloomberg. Retrieved 24 June 2021.
- ↑ "Ngozi Okonjo-Iweala: Results for Development". R4D: Results for Development. Retrieved 24 June 2021.
- ↑ "ARC Agency Governing Board – African Risk Capacity" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 May 2020. Retrieved 12 May 2020.
- ↑ MarketScreener. "Ngozi Okonjo-Iweala to Step Down as Member of Board of Directors of Twitter, Inc., Effective February 28, 2021 | MarketScreener". www.marketscreener.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-02.
- ↑ "Ngozi Okonjo-Iweala, former finance minister of Nigeria and former managing director of the World Bank, will deliver the 2020 Graduation Address". www.hks.harvard.edu (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2020. Retrieved 12 May 2020.
- ↑ Okonjo-Iweala, Ngozi (2018-04-04). "Ngozi Okonjo-Iweala". Brookings (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 13 May 2020. Retrieved 2021-02-17.
- ↑ Okonjo-Iweala, Ngozi (1981). Credit policy, rural financial markets, and Nigeria's agricultural development (Thesis) (in ఇంగ్లీష్). Massachusetts Institute of Technology. hdl:1721.1/46400. OCLC 08096642.
- ↑ "Nigeria receives its first sovereign credit ratings". Center for Global Development. 9 February 2006. Archived from the original on 2 July 2018. Retrieved 8 May 2017.
- ↑ "Ngozi Okonjo Iweala and her son Uzodinma". The Sunday Times. 20 August 2006. Archived from the original on 31 March 2019. Retrieved 30 March 2019.
- ↑ "Dr. Ngozi Okonjo-Iweala". The B Team. 15 September 2016. Archived from the original on 12 June 2017. Retrieved 8 May 2017.
- ↑ Dinitia Smith (24 November 2005), Young and Privileged, but Writing Vividly of Africa's Child Soldiers Archived 11 మే 2020 at the Wayback Machine New York Times.
- ↑ Jain, Niharika S. (8 December 2008). "Alumna Leads World Bank in Crisis". The Harvard Crimson. Archived from the original on 2 June 2015. Retrieved 15 February 2021.
- ↑ Omotayo, Joseph (5 June 2020). "Beautiful family photos of Ngozi Okonjo-Iweala's family drop, melt many hearts". Legit.ng – Nigeria news. (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2021. Retrieved 15 February 2021.
- ↑ "Ngozi Okonjo-Iweala's US passport will not help her chances in WTO leadership race, Chinese trade experts say". 4 September 2020. Archived from the original on 8 September 2020. Retrieved 8 September 2020.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- 1954 జననాలు
- మహిళా విదేశాంగ మంత్రులు
- నైజీరియా ఆర్థిక మంత్రులు
- నైజీరియా విదేశీ మంత్రులు
- హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు
- నైజీరియన్ ఆర్థికవేత్తలు
- యునైటెడ్ స్టేట్స్‌లోని నైజీరియన్ ప్రవాసులు
- నైజీరియన్ మహిళా దౌత్యవేత్తలు
- నైజీరియన్ మహిళా ఆర్థికవేత్తలు
- మహిళా ఆర్థిక మంత్రులు
- ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళలు
- నైజీరియన్ సంతతికి చెందిన అమెరికన్ ప్రజలు
- ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్లు
- 21వ శతాబ్దపు నైజీరియన్ ప్రజలు
- 21వ శతాబ్దపు అమెరికన్ ప్రజలు