Jump to content

నెల్లుట్ల కోదండరామారావు

వికీపీడియా నుండి
(నెల్లుట్ల కోదండరామారావు(ఎన్.కె) నుండి దారిమార్పు చెందింది)
నెల్లుట్ల కోదండ రామారావు(యన్.కె)
యన్.కె
జననంనెల్లుట్ల కోదండరామారావు
మరణం27 డిసెంబర్ 2014
హన్మకొండ
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లుయన్.కె
వృత్తిఉద్యమనాయకుడు, కవి

నెల్లుట్ల కోదండ రామారావు ఎన్.కెగా ప్రసిద్ధులు. ప్రజా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన సాహితీ వేత్త. వీరు రాసిన లాల్ బనో గులామీ చోడో అనే సుదీర్ఘ కవిత అత్యంత ఆదరణనూ ఉద్యమ ప్రేరణనూ అప్పట్లో కలిగించింది.దాంతో ఆయన పేరు కూడా ‘లాల్‌ బనో..‘ఎన్‌కేగా మారిపోయింది.1970 దశకంలో విప్లవోద్యమం ఊపిరిపోసుకుంటున్న సమయంలో ఎన్‌కే తన కవిత్వంతో ఉర్రూతలూగించారు. ఆయన రాసిన ప్రతీ కవిత గోడలపై నినాదంగా కనిపించేది.

వృత్తి భాద్యతలు

[మార్చు]

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేసి, పదవీ విరమణ చేశారు.

కుటుంబం

[మార్చు]

కోదండ రామారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎన్ కె తండ్రి నెల్లుట్ల రామకృష్ణామాత్ర 1940ల్లో కవిత్వం రాశారు. తిరుపతి వెంకటకవులకు, మానవల్లి రామకృష్ణ కవికి వచ్చిన వివాదంలో తిరుపతి వెంకట కవులను ఎదిరించి పద్యాలు రాశాడు. "ఎవడురా మమ్మీసడించి కలము నడిపెడు మొనగాడు తెలుగు నేల" వంటి గొప్ప పద్యాలు రాశారు. ఎన్ కెకు రెండు సంవత్సరాలు కూడా నిండక ముందే -- 1950-51 ప్రాంతంలో ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఏమయ్యారో తెలియదు. ఎన్ కె తల్లి కేసమ్మగారు దేవులపల్లి రామానుజరావు గారి చెల్లెలు. రామానుజం గారే వీరి పోషణ బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఎన్‌కే అన్నయ్య నెల్లుట్ల జగన్మోహన్‌రావు 1969నాటి తెలంగాణ ఉద్యమంలో ఎన్‌జీవోల సంఘం నాయకుడిగా ప్రసిద్ధులు.

సాహిత్యమూ, ప్రజాజీవితమూ

[మార్చు]
  • 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి నుంచీ కవిత్వం రాస్తూ పాటలు పాడుతూ ఉన్నారు.
  • 1969లో వరంగల్‌లో వచ్చిన తిరగబడు కవుల ఉద్యమంలో ఎన్‌కే భాగస్వామ్యం వహించగా.. తిరగబడు కవితాసంకలనంలో ఆయన రాసిన ‘లాల్ బనో.. గులామి చోడో బోలో వందేమాతరం’ కవిత ఆనాటి కవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
  • 1970ల్లో అప్పటి నక్సల్‌ నేతలు కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి, తరిమెల నాగిరెడ్డి తదితరుల ప్రభావంతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. తెలంగాణ ప్రజాకవి కాళోజీ ఇంట.. విరసం నేత వరవరరావు ప్రేరణతో జరిగే ‘సృజన’ సమావేశాలకు వెళుతూ.. విప్లవ కవిగా అవతరించారు.
  • 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడినప్పుడు దాని స్థాపక సభ్యుడిగానూ తర్వాత కొన్ని సంవత్సరాలు కార్యవర్గ సభ్యుడిగానూ పనిచేసారు.
  • సృజన సాహితీ మిత్రుడిగా ఉన్నారు.
  • ఎమర్జెన్సీలో జైలు నిర్బంధాన్ని అనుభవించారు. ఎన్‌కే నిర్బంధ కాలంలోనూ తన విలువలు, విశ్వాసాలకు అనుగుణంగానే పనిచేశారు.

లాల్ బనో గులామీ చోడో పేరు తెచ్చిన సుధీర్ఘ కవిత

[మార్చు]

వరంగల్ లోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ సంఘపరివార్ శక్తులు, ముఖ్యంగా ఎబివిపి 1970ల చివరా, 1980ల మొదట్లో రాడికల్ విద్యార్థి సంఘానికి, విప్లవ రాజకీయాలకు వ్యతిరేకంగా 'లాల్ గులామీ చోడ్ కర్ బోలో వందే మాతరం' అనే నినాదంతో విష ప్రచారం సాగిస్తున్నప్పుడు ఎన్ కె ఆ నినాదాన్ని తిరగేసి 'లాల్ బనో గులామీ చోడో, బోలో వందే మాతరం' అనే అద్భుతమైన సుదీర్ఘ కవిత రాశారు. అది మొదట సృజన ఆగస్టు 1982 సంచికలో అచ్చయింది. ఆ తర్వాత 1983 లోనూ, 1985 లోనూ రాడికల్ విద్యార్థి సంఘం ప్రచురణగా పుస్తకంగా వచ్చింది. పుస్తకంగా వచ్చినప్పుడు దానికి కె బాలగోపాల్ 'దేశభక్తి' అని సుదీర్ఘమైన ముందుమాట రాశారు. ఆ పుస్తకాన్ని నల్లగొండలో ఎబివిపి గుండాలు హత్య చేసిన రాడికల్ విద్యార్థి సంఘ నాయకుడు శేషయ్యకు అంకితం చేశారు. 1983 నుంచి 1990ల మధ్య దాకా సభల్లో, సమావేశాల్లో కనీసం వంద చోట్ల విద్యార్థులు ఆ కవితను అడిగి మరీ వినిపించుకునేవాళ్లు. ఆ సుదీర్ఘ కవితను ఎన్ కె చాల అద్భుతంగా, భావస్ఫోరకంగా, ఉద్వేగపూరితంగా, ఉత్తేజకరంగా చదివేవారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]