నేత్ర వైద్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ophthalmology
Eye examination with aid of a slit lamp.
SystemEye
Significant diseasesBlindness, cataracts, macular degeneration, glaucoma
Significant testsVisual field test, ophthalmoscopy
SpecialistOphthalmologist

నేత్ర వైద్యము[1] అనేది కంటి యొక్క అనాటమీ, ఫిజియాలజీ, వ్యాధుల వ్యవహారాలను నిర్వహించే వైద్య శాస్త్రం యొక్క శాఖ.[2]

చరిత్ర[మార్చు]

కంటి (నేత్ర) వైద్యుడు కంటి దృష్టి సంరక్షణలో నైపుణ్యం కలిగిన వైద్య లేదా ఆస్టియోపతిక్ వైద్యుడు. నేత్ర ( కంటి ) వైద్య నిపుణులు 12 నుండి 13 సంవత్సరాల శిక్షణ విద్యను అభ్యసిస్తారు . వైద్య విద్యను ఒక విద్యార్థి నాలుగు సంవత్సరాలు, తరువాత కనీసం ఎనిమిది సంవత్సరాల అదనపు వైద్య శిక్షణ ఉంటుందిదీనితో శస్త్రచికిత్సలను అభ్యసించడానికి అర్హత పొందుతాడు . ఈ అధునాతన శిక్షణ ఆప్టోమెట్రిస్టులు, ఆప్టిషియన్ల కంటే నేత్ర వైద్యులు విస్తృతమైన పరిస్థితులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి అనుమతిస్తుంది. నేత్ర వైద్యుడు అన్ని కంటి వ్యాధులను గుర్తించి, కంటి శస్త్రచికిత్సలు చేస్తాడు, దృష్టి సమస్యలను సరిచేయడానికి కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్స్‌లను సూచిస్తాడు. కంటి వ్యాధులు, దృష్టి లోపాలకు కారణాలు, నివారణలపై శాస్త్రీయ పరిశోధనలో చాలా మంది నేత్ర వైద్య నిపుణులు పాల్గొంటారు. కొన్నిసార్లు కంటికి నేరుగా సంబంధం లేని ఇతర ఆరోగ్య సమస్యలను నేత్ర వైద్యులుగుర్తించగలరు,, ఆ రోగులను చికిత్స కోసం సరైన వైద్య వైద్యుల వద్దకు పంపవచ్చును. కంటి సమస్యలు, సంరక్షణ నేత్ర వైద్య నిపుణులు శిక్షణ పొందుతుండగా, కొంతమంది నేత్ర వైద్య నిపుణులు వైద్య, శస్త్రచికిత్స కంటి సంరక్షణ యొక్క వాటిలో మరింత ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఈ వ్యక్తిని ప్రత్యేక నిపుణుడు ( స్పెషలిస్ట్) అంటారు. వీరు సాధారణంగా గ్లాకోమా, రెటినా, కార్నియా, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, ఓక్యులో-ప్లాస్టిక్ సర్జరీలు వంటి ప్రధాన ప్రాంతాలలో ఒకటి లేదా రెండు సంవత్సరాల అదనపు, మరింత శిక్షణను (ఫెలోషిప్ అని పిలుస్తారు) పూర్తి చేస్తారు. ఈ అదనపు శిక్షణతో కంటి వైద్య భాదితులకు సరియిన విధముగా కంటి సంరక్షణలో ప్రజలకు ఆరోగ్యమును అందించగలరు [3]

అర్హతలు[మార్చు]

భారతదేశములో 10+2 తరగతుల తర్వాత కోర్సులు నేత్ర విద్యను అభ్యసించడానికి M.B.B.S పరీక్షను నీట్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు . దీని ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రవేశల నియమావళి ప్రకారం వారు వైద్య విద్యను చదువుతారు [4] నేత్ర వైద్యములు క్రింది వాటిలో వారు చదువుతారు .

ఆప్తాల్మాలజీలో డిప్లొమా

ఆప్తాల్మిక్ టెక్నాలజీలో డిప్లొమా

ఆప్తాల్మిక్ టెక్నిక్స్‌లో బి.ఎస్.సి

ఆప్తాల్మాలజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్)

ఆప్తాల్మాలజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్

ఆప్తాల్మాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్

ఆప్తాల్మాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా

ఆప్తాల్మాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా

మూలాలు[మార్చు]

  1. "ophthalmology". Oxford Dictionary. Archived from the original on 9 జూలై 2016. Retrieved 14 September 2015.
  2. "History of Ophthalmology". mrcophth. Archived from the original on 8 ఆగస్టు 2017. Retrieved 30 August 2013.
  3. "What is an Ophthalmologist?". American Academy of Ophthalmology (in ఇంగ్లీష్). 2019-01-18. Retrieved 2020-11-11.
  4. "National Testing Agency". nta.ac.in. Retrieved 2020-11-11.