నేను సైతం ప్రపంచాగ్నికి (పాట)

వికీపీడియా నుండి
(నేను సైతం ప్రపంచాగ్నికి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఠాగూర్ సినిమా పోస్టరు

నేను సైతం ప్రపంచాగ్నికి అనేది ఒక ప్రముఖ తెలుగు సినిమా పాట. ఈ పాట ఠాగూర్ చిత్రం లోనిది. సుద్దాల అశోక్ తేజ రచించగా మణిశర్మ స్వరాలు కూర్చారు. ఈ పాట చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడనే సందేశాన్ని పరోక్షంగా తెలియజేసినది. దీనికి మహాకవి శ్రీశ్రీ రచించిన పాట పునాది.

నేపథ్యం[మార్చు]

చిరంజీవి అతని తోటి స్నేహితులతో కలసి లంచగొండులను అందరినీ శిక్షించాలని ముందుగా వారికి తెలియజేసి అందరిలోకి అత్యంత ప్రమాదకరమైన నేరస్తుల్ని అంతం చేస్తుంటాడు. చివరికి ప్రభుత్వం అతనిని అరెస్టు చేస్తుంది. అతని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలొ ప్రజలలో వచ్చిన విప్లవాన్ని చిత్రీకరించడానికి ఈ ఉత్తేజపూరిత గీతాన్ని బాగా చూపించారు.

పాటలోని సాహిత్యం[మార్చు]

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను
||నేను సైతం ప్రపంచాగ్నికి||

అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలని గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా
మన్నెంవీరుడు రామరాజు ధను:శ్శంఖారానివా
భగత్ సింగ కడసారి పల్కిన ఇంక్విలాబ్ శబ్దానివా

అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా

పురస్కారాలు[మార్చు]