Jump to content

నేరెల్ల శ్రీనివాస్ గౌడ్

వికీపీడియా నుండి
నేరెల్ల శ్రీనివాస్ గౌడ్
జననం1970
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఅంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ
జీవిత భాగస్వామిసత్తవ్వ (బీడీ కార్మికులు)
పిల్లలురమేష్, స్వాతి, సంగీత
తల్లిదండ్రులునేరెల్ల నారాయణ గౌడ్, లచ్చవ్వ
బంధువులుసాహితి (అరుణ) - (కోడలు)

నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీ కారుడు. ఆయన 2020 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]

నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ బాల్యం నుంచే కథలు, రచనలపై ఆసక్తి కలిగిన ఆయనకు జగిత్యాలకు చెందిన సామాజికవేత్త, రచయిత, ఉద్యమకారుడు బి.ఎస్.రాములు స్ఫూర్తితో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి గీత వృత్తితో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక చైతన్యాన్ని రగిలించే రచనలతోపాటు తన కుల వృత్తిలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పలు రచనలు చేశాడు. నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ దివిటి పత్రిక, ప్రజాతంత్ర, గౌడమిత్ర పత్రికలలో కొంతకాలం జర్నలిస్టుగా పని చేస్తూ ప్రజా మంటలు జాతీయ దిన పత్రికలో వ్యాసాలు రాశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ 1970లో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, హనుమాజీపేటలో నిరుపేద కల్లుగీత కార్మికుల కుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రభుత్వం బడిలో 7వ తరగతి వరకు చదువుకొని ఇంటి ఆర్థిక పరిస్థితులకు చేదోడు కావాలని 16వ ఏటనే పని కోసం బొంబాయి వెళ్లి కల్లు దుకాణంలో పని చేస్తూ అక్కడ పరిస్థితులు అనుకూలించగా తిరిగి స్వగ్రామానికి వచ్చి కులవృత్తిని చేపట్టి తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కడం, కల్లు గీయడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌కు జగిత్యాలలోని డిగ్రీ కాలేజీ గ్రంథాలయ అధికారిగా పని చేసే ఆంజనేయులు కల్లు తాగడానికి వచ్చేవాడు, మాటల మధ్య శ్రీనివాస్‌కు చదువుపట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఆయనను డిగ్రీలో ప్రవేశం కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష గురించి చెప్పడంతో 1995లో బిఎలో చేరి పూర్తి చేశాడు. శ్రీనివాస్ గౌడ్ 2002లో కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా ఎంఎ తెలుగు పట్టా ఆ తర్వాత 2021లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో మానవ హక్కులపై పిజి డిప్లమో, ఎంఎ సామజిక శాస్త్రం పూర్తి చేశాడు.

రచనలు

[మార్చు]
  • 2004 - బతుకుతాడు (నవల)
  • 2006 - పేదోళ్ల బతుకులు (కథలు)
  • 2008 - మా బతుకులు (కథలు)
  • 2011 - సర్పంచ్ (కథలు)
  • 2015 - రచ్చబండ (కథలు)
  • 2017 - దుల్దుమ్మ (నవల)[3]
  • 2022 - కల్తీ బతుకులు (నవల)
  • 2024 - మర్రి చెట్టు (నవల)

పురస్కారాలు

[మార్చు]
  • 2000 - విశాల సాహిత్య అకాడమీ జిల్లా స్థాయి కథా పురస్కారం
  • 2006 - శాంతి బాలానందం కథా పురస్కారం
  • 2008 - విశాల సాహిత్య అకాడమీ రాష్ట్ర స్థాయి నవల పురస్కారం
  • 2014 - కళాశ్రీ వారి మిద్దె రాములు స్మారక పురస్కారం
  • 2020 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలా పురస్కారం[4]

అవార్డులు & రివార్డులు

[మార్చు]
  • 'బతుకుతాడు' నవల కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పాఠ్యాంశంగా ఎంపిక.
  • కులవృత్తి కథకు 2000 సంవత్సరం సెప్టెంబర్ 05న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ రావు చేతులమీదుగా సన్మానం.
  • నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ రచనలపై 'జీవితం-సాహిత్యం' అనే అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిగాయి.
  • 2004 నుంచి 2015 వరకు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పారితోషికం అందుకున్నారు.
  • అంబేడ్కర్ యూనివర్సిటీ అనుమతితో 'గౌడవృత్తి అభివృద్ధి - హక్కు లు' అనే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించారు.

మూలాలు

[మార్చు]
  1. "కలమెత్తిన గీత కార్మికుడు". Mana Telangana. 14 February 2023. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  2. "సమాజాన్ని మేల్కొల్పే రచనలు చేయాలి". NT News. 15 February 2023. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  3. "గౌడ జీవన పురాణం 'దుల్దుమ్మ'". Mana Telangana. 23 October 2023. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  4. "ఉత్తమ రచనలకు గౌరవం". Andhrajyothy. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.